• Home
  • »
  • News
  • »
  • andhra-pradesh
  • »
  • VISAKHAPATNAM VISAKHAPATNAM CORPORATE HOSPITALS CHARGE ONLY CASH PAYMENT FOR CORONA PATIENTS NGS

Andhra Pradesh: లక్షల్లో క్యాష్ కడితేనే కరోనా వైద్యం. కార్డులు, ఇన్సూరెన్స్ లకు నో అంటున్న కార్పొరేట్ ఆస్పత్రులు

విశాఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో క్యాష్ ఉంటేనే కరోనా వైద్యం

విశాఖపట్నంలో కార్పొరేట్ హాస్పిటల్స్ అంటేనే భయపడాల్సి వస్తోంది. పొరపాటున కరోనా కోసం పెద్ద ఆస్పత్రిల్లో అడుగుపెట్టారు అంటే.. బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ చేసుకోవాల్సిందే. కార్డులు ఆమోదించవు.. కేవలం క్యాష్ ఉంటేనే వైద్యం అంటూ.. లక్షల రూాపాయలు ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నాయి.

  • Share this:
    ఓ వైపు ఆంధ్ర ప్రదేశ్ పై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది. తాజాగా ఏపీలో కరోనా కేసుల సంఖ్య 5 వేల మార్కును దాటింది. ముఖ్యంగా సెకెండ్ వేవ్ ఊహించని స్థాయిలో దూసుకొస్తోంది. గతంలో కంటే కొత్త లక్షణాలతో వైరస్ పంజా విసురుతోంది. ఇలాంటి సమయంలో మానవత్వం చూపించాల్సిన కార్పొరేట్ ఆస్పత్రులు.. మనుషుల రక్తన్ని పీల్చేస్తున్నాయి. వైద్యం పేరుతో నిలువ దోపిడీ చేస్తున్నాయి.

    ముఖ్యంగా విశాఖపట్నంలో కార్పొరేట్ ఆస్పత్రుల్లో పరిస్థితి మరీ దారుణం. కరోనా రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఐదు లక్షల రూపాయల క్యాష్ కడితేనే వైద్యం అందిస్తామని స్పష్టం చేస్తున్నాయి. చేతిలో డబ్బులు లేవు కార్డు ద్వారా పే చేస్తామని చెప్పినా వినడం లేదు. క్రెడిట్, డెబిట్ కార్డు రెండింటినీ తీసుకోవడం లేదు. కేవలం క్యాష్ కావాలంటూ మొండి పట్టు పడుతున్నాయి. దీంతో రోగుల బంధువులు క్యాష్ కోసం ఏటీఎంలు, బ్యాంకులు, ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

    రోగులకు ఇన్సూరెన్స్ సౌకర్యం ఉందని చెబుతున్నా ఆస్పత్రులు పట్టించుకోవడం లేదు. దీంతో పేద, మధ్య తరగతి రోగులు తీవ్ర నరకయాతన అనుభవిస్తున్నారు. ఇటు సుప్రీం కోర్టు.. అటు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా.. కార్పొరేట్ ఆస్పత్రులు మాత్రం తమ తీరు మార్చుకోవడం లేదు. కరోనా కష్టకాలాన్ని కూడా కాసులు దండుకోడానికి వాడుకుంటున్నాయి. పెద్ద పెద్ద కార్పొరేట్ ఆస్పత్రులు అన్నింటిలో అదే పరిస్థితి.

    అయితే కొన్ని ఆస్పత్రుల్లో బీమా ఉన్నవాళ్లకు వైద్యం చేస్తున్నా.. పీపీఈ కిట్ల పేరుతో ఒక్కో రోగి నుంచి 40 వేల రూపాయలకుపైగానే ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. పీపీఈ కిట్లకు ఇన్సూరెన్స్ కంపెనీలు డబ్బు చెల్లించడం లేదనే సాకుతో రోగికి.. అతడికి వైద్యం చేసే డాక్టర్ కు.. ఆ వార్డుల్లో పని చేసే స్టాఫ్ నర్సులు, సిస్టర్స్, పనివాళ్లకు ఉపయోగించే పీపీ కిట్ల భారాన్ని కూడా ఆ రోగి మీదే వేస్తున్నారు. ప్రతి రోగి దగ్గర వాటికి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒక్క పీపీఈ కిట్ లోనే ఉంటున్నా.. ప్రతి పేషెంట్ దగ్గర పీపీఈ కిట్ లకు అంటూ డబ్బులు వసూలు చేసేస్తున్నారు. దీంతో ఇన్సూరెన్స్ ఉన్నా కాని.. రోగులు చేతి చమురు వదిలించుకోక తప్పడం లేదు.

    కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య పరికరాల వాడకం పేరుతో వేస్తున్న బిల్లులు చూస్తే గుండె గుభేల్ అనక మానదు. హోల్ సేల్ మార్కెట్ లో 200 రూపాయలకు దొరికే పీపీఈ కిట్ లకు.. కార్పొరేట్ ఆస్పత్రుల్లో వేయి రూపాయాలు దాకా వసూలు చేస్తున్నారు. శానిటైజర్ బయట మార్కెట్లో 100 రూపాయలకే దొరికితే.. అవే కంపెనీకి చెందిన శానిటైజర్ ను ఆస్పత్రుల్లో 500ల రూపాయలపైన బిల్ వేస్తున్నారు. అది కూడా వారు సూచించిన ఫార్మసీలోనే అవి కొనాలని నిబంధనలు పెడుతున్నారు. దీంతో కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
    Published by:Nagesh Paina
    First published: