Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM VISAKHAPATNAM BEACH TURNING OUT IN BLACK COLOUR AS TOURISTS WORRYING FULL DETAILS HERE PRN VSJ NJ

Vizag News: వైజాగ్ బీచ్‌కు ఏమైంది.. ఎందుకలా జరుగుతోంది..ముప్పు ముంచుకొస్తోందా..?

నల్లగా

నల్లగా మారిపోతున్న విశాఖ బీచ్

విశాఖపట్నం (Visakhapatnam) అంటే గుర్తుకొచ్చేది బీచ్. బీచ్ లేకుండా విశాఖను ఊహించుకోవడం కష్టం. వైజాగ్ బీచ్‌ (Vizag Beach) లో నిలబడి పైకి చూస్తే నీలి రంగు ఆకాశం.., కింద నేలమీద స్వచ్ఛమైన నీళ్లు.. బంగారువర్ణంలో మెరిసే ఇసుకతిన్నెలు బీచ్ సొంతం.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India
    Setti Jagadeesh, News 18, Visakhaptnam

    విశాఖపట్నం (Visakhapatnam) అంటే గుర్తుకొచ్చేది బీచ్. బీచ్ లేకుండా విశాఖను ఊహించుకోవడం కష్టం. వైజాగ్ బీచ్‌ (Vizag Beach) లో నిలబడి పైకి చూస్తే నీలి రంగు ఆకాశం.., కింద నేలమీద స్వచ్ఛమైన నీళ్లు.. బంగారువర్ణంలో మెరిసే ఇసుకతిన్నెలు బీచ్ సొంతం. వర్షాకాలం వచ్చిందంటే చాలు విశాఖ తీరంలో అందాలు చూసేందుకు పర్యాటకులు, నగరవాసులు వస్తుంటారు. అలాంటిది ఆహ్లాదంగా ఉండాల్సిన విశాఖ తీరం ఇప్పుడెందుకు నల్లబడింది.. దీని పరిణామాలేంటని నగరవాసులు భయాందోళన చెందుతున్నారు. గత కొన్నిరోజులుగా ఎక్కడ విన్నా విశాఖ బీచ్‌కు ఏమైంది..? బంగారు వర్ణంలో ఉండాల్సిన ఇసుక తిన్నెలు అమావాస్య చంద్రుడిలా నల్లగా మారాయి. తెల్లవారుజామున వాకింగ్‌కు వచ్చిన వాళ్లు, పర్యాటకులు ఆ రంగు మారిన ఇసుకను చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అసలెందుకిలా ఉన్నట్టుండి తీరంలోని ఇసుక నల్లగా మారింది?

    సముద్రంలో ఏదైనా బొగ్గు గని పేలిందా అన్నట్లుగా ఆర్కే బీచ్‌లోని ఇసుక నల్లటి దుప్పటి కప్పుకున్నట్లుగా మారిపోయింది. దీంతో నగరవాసులు హడలిపోతున్నారు. సాయంత్రం అయితే చాలు తీరంలో సందడిచేసే జనాలు ఇప్పుడు అటు తొంగి చూడ్డానికే భయపడుతున్నారు. అయితే నగరవాసులు భయపడాల్సిన పనేం లేదంటున్నారు శాస్త్రవేత్తలు. సముద్రంలోని మురుగు అప్పుడప్పుడు ఒడ్డుకి కొట్టుకురావడం సర్వసాధారణమేనని, అలా వచ్చినప్పుడు ఇసుక నల్లబడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు ఇనుప రజను ఎక్కువ శాతం సముద్రంలోకి వచ్చినప్పుడు కూడా ఇలా తీరం నల్లటి బొగ్గులా మారిపోతుందంటున్నారు రిటైర్డ్‌ పోర్టు చీఫ్‌ ఇంజనీర్‌ రహీమ్‌ అన్సారీ తెలిపారు.

    ఇది చదవండి: లైఫ్‌లో ఒక్కసారైనా ఈ జలపాతాన్ని చూడాల్సిందే..! లేదంటే మీ బ్యాడ్‌ లక్‌..!


    లావా, బసాల్ట్‌రాక్స్, ఇతర నల్ల రంగు రాళ్ళు, ఖనిజాలతో కూడిన రాళ్ళు కోతకు గురైనప్పుడు కూడా ఇలా తీరంలోని ఇసుక నల్లగా మారుతుందంటున్నారు. సాధారణంగా క్రియాశీల అగ్నిపర్వతం సమీపంలో ఉన్న బీచ్‌లలో ఈ తరహా నల్లటి ఇసుక కనిపిస్తుందంటున్నారు రహీమ్‌ అన్సారీ. ప్రపంచ వ్యాప్తంగా నల్ల ఇసుకతో ఉన్న బీచ్‌లకు హవాయ్, కేనరీ దీవులు ప్రసిద్ధి. మన దేశంలోనూ నల్ల ఇసుక బీచ్‌లు ఉన్నాయి.

    ఇది చదవండి: చూడటానికి ఇది పార్క్ మాత్రమే.. కానీ లోపలికెళ్తే ప్రపంచాన్నే మర్చిపోతారు..!


    గుజరాత్ లోని డుమస్ బీచ్‌, త్రివేండ్రంలోని కోవలం బీచ్, కర్నాటకలోని తిలమతి బీచ్, మహారాష్ట్రలోని నవపూర్ బీచ్‌లలో ఇసుక నల్లగా ఉంటుంది. అయితే మన విశాఖ నగర తీరం ఇప్పుడు ఎందుకు ఇలా నల్లబడిందో శాస్త్రవేత్తలు, పరిశోధకులు పూర్తి వివరాలు స్పష్టం చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు స్వచ్ఛంగా ఉండే సముద్రం ఉన్నట్లుండి నల్లగా మారిపోవడం తీవ్రచర్చనీయాంశమవుతోంది. ఐతే ఏదైనా ముప్పుముంచుకొస్తుందా..? అనే చర్చ కూడా సాగుతోంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam

    తదుపరి వార్తలు