Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM VISAKHAPATNAM BASED FINE ARTS ARTIST RAMA KRISHNA BRINGS MEMORIES OF DISEASED PERSONS TO THEIR FAMILIES BY MAKING SILICON STATUES FULL DETAILS HERE PRN VSP

Super Talents: వీళ్లు సృష్టికి ప్రతిసృష్టి చేస్తారు..! దూరమైన వాళ్లను దగ్గర చేస్తారు..!

విశాఖలో అబ్బుర పరుస్తున్న సిలికాన్ శిల్పకళాకారులు

విశాఖలో అబ్బుర పరుస్తున్న సిలికాన్ శిల్పకళాకారులు

Vizag: ఆ విగ్రహాన్ని చూస్తే అచ్చం మా నాన్న లాగే ఉంది. డిటో ఈ శిల్పం మా అమ్మలాగే ఉంది. వారెవ్వా.. మా బామ్మ రూపం అచ్చు గుద్దినట్టు దింపేశారు. ఇది ఆ శిల్పాలను చూస్తున్నవారి మాట. ఆ విగ్రహాలను తయారు చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పడమే కాదు. వారిని మరిచిపోలేమని కన్నీళ్లు పెట్టుకుంటున్న వారు కూడా ఉన్నారు.

ఇంకా చదవండి ...
  P Anand Mohan, News18, Visakhapatnam

  ఆ విగ్రహాన్ని చూస్తే అచ్చం మా నాన్న లాగే ఉంది. డిటో ఈ శిల్పం మా అమ్మలాగే ఉంది. వారెవ్వా.. మా బామ్మ రూపం అచ్చు గుద్దినట్టు దింపేశారు. ఇది ఆ శిల్పాలను చూస్తున్నవారి మాట. ఆ విగ్రహాలను తయారు చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పడమే కాదు. వారిని మరిచిపోలేమని కన్నీళ్లు పెట్టుకుంటున్న వారు కూడా ఉన్నారు. తమ వారు దూరమైనా.. ఈశిల్పాల రూపంలో తిరిగి బ్రతికి వచ్చినట్టే ఉందని అంటున్నవాళ్లు ఎందరో. ఈ వాక్యాలన్నీ.. విశాఖ శిల్పకళాకారులకి పరిచయ వాక్యాలు. దాదాపు 20 ఏళ్లుగా ఈ రంగంలో ఉంటున్న ఈ శిల్పకారులకు ఇప్పుడిప్పుడే మంచి ఫాలోయింగ్ లభిస్తోంది. వారి కళకూ ఆదరణ పెరుగుతోంది.

  హైదరాబాద్ (Hyderabad) లో మొన్నీ మధ్య ఓ మైనపు బొమ్మ పెళ్లిలో భావోద్వేగాలు నింపేసింది గుర్తుందా..? చెల్లి పెళ్లికి నాన్నని అనుకోని అతిథిలా తీసుకొచ్చాడు ఆమె అన్న. చెల్లి కళ్లలో ఆనందం చూసేందుకు ఆమెను సర్‌ప్రైజ్‌ చేశాడు. తండ్రి మైనపు బొమ్మతో.. చెల్లినే కాదు.. తల్లిని కూడా ఆశ్చర్యపరిచాడు ఆ యువకుడు. ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరి ఆ మైనపు బొమ్మను విశాఖపట్నం (Visakhapatnam) కు చెందిన ఫైన్ ఆర్ట్స్ రామకృష్ణ తయారు చేశారు. ఆయన బృందం నాలుగు నెలలు ఈ మైనపు బొమ్మను తయారుచేయడానికి శ్రమించింది. చివరికి అచ్చంగా అదే రూపు రావడానికి టైం తీసుకుంది. మొత్తానికి ఆ కుటుంబంలోని ముఖ్యవ్యక్తి రూపాన్ని అచ్చు గుద్దేశారు. పెళ్లిమండపంలోని ప్రతిఒకరు ఈ విగ్రహాన్ని చూసి ఎమోషనల్‌ అయ్యారు. విగ్రహాన్ని పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చేశారు. మా కోసం మళ్లీ తిరిగొచ్చావా అంటూ ఎమోషనల్‌ అయ్యారు.

  ఇది చదవండి: ప్రపంచంలోనే యంగెస్ట్ స్కూబా డైవర్..? పదేళ్లకే సాగరంలో అద్భుతాలు..?


  ఇక ఇలాంటి విగ్రహాలు తయారు చేయడంలో ఫైన్ ఆర్ట్స్ రామకృష్ణది అందెవేసిన చెయ్యి. సిలికాన్, ఫైబర్, ఇతరత్రా పలు ముడిసరుకులతో బొమ్మలు తయారు చేస్తారు. అలాగే రాగి, ఇత్తడి, కంచు లోహాలతో చేసిన విగ్రహాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా మట్టితో చేసిన వాటికే ఎక్కువగా ఆదరణ ఉంది. మట్టితో ఒక వ్యక్తి ఆకృతిని మలిచి.. దానికి సిలికాన్ తో పూత పూసి.. ఫినిషింగ్ అద్భుతంగా వచ్చేటట్టు చేయడమే రామకృష్ణ అండ్ టీం ప్రతిభ. ఫైన్ ఆర్ట్స్ లో చాలా కీలకమైన ఈ కళ విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం అంటారు రామకృష్ణ. ప్రధానంగా ఫినిషింగ్ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని చెబుతున్నారు.

  ఇది చదవండి: ఏపీ తీరంలో టైటానిక్.. వందేళ్లుగా సముద్రంలోనే..ఆసక్తిని రేకెత్తిస్తున్న షిప్ హిస్టరీ..!


  1999లోనే ఈ రంగంలోకి అడుగుపెట్టారు రామకృష్ణ, దాస్ లు. వీరు ట్రయాంగిల్ ఆర్ట్స్ పేరుతో ఈ విగ్రహాల తయారీ మొదలు పెట్టారు. విశాఖ బీచ్ రోడ్డులో ఏనుగు విగ్రహాలు, ఆడుకునే పాపాయి విగ్రహం మొదలుకుని చాలా విగ్రహాలు రామకృష్ణ చేతిలో తయారైనవే. ఇవే కాక అప్పటి మున్సిపల్ కార్పొరేషన్, ఇప్పటి జీవిఎంసీ కమిషనర్లల వరకూ ముఖ్యమైన అధికారులందరూ కొన్ని విగ్రహాల్ని రామకృష్ణతో తయారు చేయించారు. మహనీయుల విగ్రహాల తయారీ నుంచీ ఇప్పుడు మామూలు వ్యక్తుల విగ్రహాల వరకూ అన్నింటినీ యాజ్ ఇటీజ్ గా దింపేయడం ట్రాయంగిల్ ఆర్ట్స్ లో టాలెంట్. ఇక ఇలా వీళ్లు దాదాపు రెండు వేల విగ్రహాలపైనే తయారు చేశారు. తెలుగు రాష్ట్రాలలోని శిల్పారామాలలో.. ముఖ్యమైన ఆర్ట్ ఫంక్షన్లలోనే తమ చేతిలో రూపుదిద్దుకున్న విగ్రహాలు ఇప్పటికీ ఉన్నాయని రామకృష్ణ తెలిపారు.


  ఇది చదవండి: టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిన వ్యాపారి ఐడియా..! అందరి చూపు అతనివైపే..!


  ఎవరికైనా తమవారి విగ్రహం కావాలంటే దానికి తగ్గట్టు ఫొటోలు కావాలంటారు రామకృష్ణ. శిల్పంగా మారే వ్యక్తికి సంబంధించిన ఫొటో క్లియర్ పిక్సెల్స్ తో ఉండాలంటున్నారు. బాగా క్లియర్ గా ఉండే ఫొటోలతోనే కరెక్ట్ గా పర్ ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుందని చెప్పారు. ఏ మనిషి ఫొటో అయినా.. క్లియర్ గా తమకు ఇస్తే.. మూడు నెలల్లో ఆ బొమ్మ తయారు చేస్తామంటున్నారు. మట్టి బొమ్మల సైజులను బట్టీ రేటు ఉంటుందన్నారు. సాధారణంగా మూడు నుంచీ నాలుగు అడుగుల పైనే ఉన్న విగ్రహాలు 2 లక్షల నుంచీ అయిదు లక్షల వరకూ ఖర్చు అవుతుందట. అలాగే సైజు పెరిగే కొద్దీ దానికి తగ్గ సామాగ్రి పడుతుందని ఖర్చు కూడా పెరుగుతుందని చెప్పారు. ఇదే కాక.. ఫైబర్, సిలికాన్ వంటివి అవసరాన్ని బట్టీ విదేశాల నుంచీ తెప్పిస్తారట. దీంతో వీటికి ఆర్డర్ ను బట్టీ రేటు ఉంటుందని రామకృష్ణ తెలిపారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Visakhapatnam

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు