Visakha Garjana: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజధానిపై రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఓవైపు అమరావతి (Amaravathi) ని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ 29 గ్రామాల రైతుల మహా పాదయాత్ర కొనసగుతోంది. వారి పాదయాత్రకు కౌంటర్ గా.. రాజధానుల నినాదంతో అధికార వైసీపీ (YCP) మహా గర్జన నిర్వహిస్తోంది. నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో మన విశాఖ - మన రాజధాని అనే నినాదంతో భారీ బహిరంగ సభ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఆ సభ కోసం హోరుమని వర్షంలో ర్యాలీ కొనసాగిస్తున్నారు. ఈ మహా గర్జనను వైసీపీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేల ఉత్తరాంధ్రపై పట్టు సాధించాలి అంటే.. ఈ ర్యాలీ సక్సెస్ చేయాలని వైసీపీ అంచనా వేస్తోంది.
ఉత్తరాంధ్ర అభివృద్ధే లక్ష్యమంటూ ప్రారంభమైన ఈ గర్జన సభ.. ర్యాలీ కొనసాగుతోంది. అయితే ఉదయం నుంచి ఎడతెరిపి లేని వాన కురుస్తుండడంతో.. ర్యాలీ కొనసాగుతుందా అనే అనుమానాలు నెలకొన్నాయి. కానీ వెనక్కు తగ్గేదే లే అంటూ.. హోరుమని వానలోనూ ర్యాలీని కొనసాగిస్తున్నారు. ఏపీకి మూడు రాజధానులు ముద్దు అంటూ నినాదాలతో విశాఖ ప్రాంతం హోరెత్తుతోంది.
మధ్యాహ్నం 2 గంటలకు బీచ్ రోడ్డులో భారీ బహిరంగ సభ జరగనుంది. ఆ సభ కోసం ఇప్పటికే వేలాదిగా జనాలు చేరుకున్నారు. వారంతా మూడు రాజధానులు ముద్దు అంటూ నినాదాలు చేస్తూ.. ర్యాలీగా వెళ్తున్నారు. దీంతో విశాఖ వీధులన్నీ హోరెత్తుతుతున్నాయి. మరోవైపు వైసీపీ ర్యాలీకి వ్యతిరేకంగా.. సేవ్ ఉత్తరాంధ్ర పేరుతో.. టీడీపీ రౌండ్ టేబుల్ సమావేశానికి సిద్ధమవుతోంది.
ఇదీ చదవండి : Jr NTRతో విబేధాలపై క్లారిటీ.. ఆయనకోసం ఏం చేయమన్నా చేస్తా?
ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ సైతం విశాఖ వస్తున్నారు. మూడు రోజుల పాటు ఆయన ఉత్తరాంధ్రలోనే ఉంటారు. ఇవాళ కార్యకర్తలతో సమావేశం అవుతారు.. అలాగే రేపు జనవాణి కార్యక్రమం చేపట్టనున్నారు. అయితే పవన్ విశాఖవస్తున్న సందర్భంగా.. జనసేనకు వ్యతిరేకంగా నినాదాలు చేయాలని వైసీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
ఇటు చంద్రబాబు నాయుడు, అటు పవన్ కళ్యాణ్ ఇద్దరిపైనా వైసీపీ మంత్రులు, నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కలెక్షన్లకు.. షూటింగ్ లకు .. విశాఖ కావాలి.. కానీ రాజధానిగా విశాఖ వద్దా అని ప్రశ్నిస్తున్నారు. విశాఖ రాజధాని ఎందుకు వద్దో చెప్పేకా ఆయా నేతలు.. విశాఖలో అడుగుపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఎవరు ఎన్ని రకాలుగా అడ్డుపడినా.. విశాఖ పరిపాలనా రాజధానిగా చేయడం ఆగదని మంత్రులు స్పష్టం చేశారు. ఈ ర్యాలీలో మంత్రులు,, సీనియర్ నేతలు అందరూ పాల్గొని.. జై విశాఖ నినాదాలు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Three Capitals, Visakhapatnam