హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Civil Ranker: సివిల్స్ లో మెరిసిన తెలుగు తేజం.. ఐదో ప్రయత్నంలో అద్బుతం విజయం.. ఎలా సాధ్యమైందంటే?

Civil Ranker: సివిల్స్ లో మెరిసిన తెలుగు తేజం.. ఐదో ప్రయత్నంలో అద్బుతం విజయం.. ఎలా సాధ్యమైందంటే?

సివిల్

సివిల్ ర్యాంకర్ మంతిన భరద్వాజ్ 

Civil Ranker: పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదు అని నిరూపించాడు భరద్వాజ్. అందుకే నాలుగు ప్రయత్నాల్లో విఫలమైనా నిరాశ చెందలేదు.. ఎలాగైనా ర్యాంక్ సాధించాలనే లక్ష్యంతో.. తీవ్రంగా కష్టపడ్డాడు. మొత్తానికి ఐదోసారి ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు.

ఇంకా చదవండి ...

  Setti Jagadeesh, News 18, Visakhaptnam.

  Civil Ranker: పట్టుదల ఉంటే సాధించలేని ఏదీ లేదు అని నిరూపించాడు  నర్సీపట్నంకు చెందిన మౌర్య భరద్వాజ్‌.. నాలుగు ప్రయత్నాల్లో ఫెయిలైనా.. ఐదో ప్రయత్నంలో సూపర్ సక్సస్ అయ్యాడు. సివిల్స్‌ (Civils) లో మెరిశారు. ఆల్ ఇండియా 28వ ర్యాంక్‌ సాధించి సత్తా చాటాడు. అయితే భరద్వాజ్‌కు (Bhardwaj) విజయం అంత ఈజీగా రాలేదు. తొలి నాలుగు ప్రయత్నాల్లో ఓటమి ఎదురైనా ఏమాత్రం నిరాశ చెందలేదు. మొక్కవోని విశ్వాసంతో ఐదోసారి తన కలను నెరవేర్చుకున్నాడు. మంతిన సత్యప్రసాద్‌ (Satyaprasad), రాధా కుమారి (Radha Kumari)ల పెద్ద కుమారుడే భరద్వాజ్‌. భరద్వాజ్‌ తండ్రి ప్రసాద్‌ గొలుగొండ మండలం, కొత్త మల్లంపేట (Kottha Mallmpeta), హైస్కూలులో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. తల్లి రాధాకుమారి ఏరియా ఆస్పత్రిలో ఫార్మాసిస్టుగా పనిచేస్తున్నారు. సివిల్ సర్వీసెస్ సాధించడంతో కుటుంబ సభ్యుల ఆనందం అంతాఇంతా కాదు. ఎన్నో ఏళ్ల కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

  భరద్వాజ్ చిన్నతనం నుంచి నర్సీపట్నం (Narsipatnam) లో డాన్ బస్కోప్ పాఠశాలలో పదవ తరగతి వరకు చదివారు. ఇంటర్మీడియట్ విశాఖ చైతన్య కాలేజీలో పూర్తి చేసి, వరంగల్ (Warangal) నిట్ లో బీటెక్ పూర్తి చేశాడు. తరువాత దానికి సంబంధించిన సంస్థల్లోనే రెండేళ్ల పాటు ఉద్యోగం చేస్తూ, మళ్లీ సివిల్ సర్వీసెస్ పై దృష్టి సారించారు. 2020లో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి కాలాన్ని శిక్షణకు వెచ్చించి విజయం సాధించాడు.

  ఇదీ చదవండి : మండు వేసవిలో చల్లని ప్రయాణం కోరుకుంటున్నారా? అలలపై తేలిపోండిక.. ఎన్నిరోజుల ప్రయాణం? ఖర్చు ఎంతంటే? పాస్ పోర్ట్ అవసరం లేదు

  మొదటి రెండు ప్రయత్నాల్లో విఫలమైనా.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తన ప్రయత్నాన్ని కొనసాగించారు. మూడో ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లాడు. నాలుగోసారి సెంట్రల్‌ పోస్టల్‌ సర్వీసెస్‌కు ఎంపికయ్యాడు. కానీ IAS కావాలనుకున్న భరద్వాజ్‌కు అది సంతృప్తి నివ్వలేదు. అందుకే పట్టుదలతో మళ్లీ ప్రయత్నించాడు. ఐదో ప్రయత్నంలో జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంక్‌ కైవసం చేసుకున్నాడు.

  ఇదీ చదవండి : డిప్యూటీ స్పీకర్ కు చుక్కలు.. మందిమార్బలంతో కాదు ఒక్కరు రండి అని నిలదీసిన మహిళ

  ఈ సందర్భంగా భరద్వాజ్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులని.. వారు పనిచేస్తున్న చోటుకు వచ్చే పై అధికారులను గమనిస్తూ ఉండేవాడినని. అప్పుడే తాను కూడా ప్రభుత్వ రంగంలో ఉన్నత అదికారి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నానని. హైస్కూల్‌లో ఉండగానే నాలో IAS బీజం పడిందని అప్పటి నుంచి అదే లక్ష్యంతో ఉన్నట్టు చెప్పాడు. ఇంటర్వ్యూలో కుటుంబనేపథ్యం, వ్యక్తిగత విషయాలు, ఇంజనీరింగ్ విద్య, రష్యా-ఉక్రెయిన్‌ యుద్దం, విశాఖపట్నం, నర్సీపట్నం ప్రాంతానికి చెందిన విషయాల గురించి ప్రశ్నించారు. సివిల్స్‌లో ఆంత్రోపాలజీని ఆప్షనల్‌ సబ్జెట్‌గా ఎంచుకున్నాన్నాడు.

  ఇదీ చదవండి : : గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్కార్ షాక్.. నిరసనలకు సిద్ధమయ్యే యోచనలో సిబ్బంది..

  ప్రజల జీవనప్రమాణాలు పెరిగేలా కృషి చేస్తా: భరద్వాజ్‌

  పేదల జీవన ప్రమాణాలు పెంచే దిశగా తన వంతు కృషి చేస్తానని భరద్వాజ్‌ తెలిపారు. మిగిలిన అన్ని శాఖలను సమన్వయం చేస్తూ అన్ని వర్గాలు అభివృద్ధి సాధించే దిశగా తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పుకొచ్చారు. విద్యా, వైద్య రంగాల్లో ప్రజలకు మరింత సేవ చేయాలన్నదే తన లక్షమంటున్నారు భరద్వాజ్‌.

  బిర్యాని అంటే చాలా ఇష్టం అన్నారు.

  ఇదీ చదవండి : సర్వ రోగ నివారిణి పనస.. మరీ ఇంత చీపా..? ధర తెలిస్తే షాక్ అవుతారు..?

  నర్సీపట్నంలో సుదీర్ఘ కాలం తర్వాత సివిల్ సర్వీసెస్ ర్యాంకు సాధించడం ఇదే ప్రధమం.  16 ఏళ్ల క్రితం నర్సీపట్నానికి సమీపంలో ఉన్న పాములవాక గ్రామానికి చెందిన కిల్లాడి సత్యనారాయణ ఐపీఎస్ సాధించారు. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్‌ డీఐజీగా పనిచేస్తున్నారు. ఆయన తర్వాత ఆ ప్రాంతం నుంచి సివిల్స్‌లో ర్యాంక్ సాధించిన వ్యక్తిగా భరద్వాజ్‌ నిలిచారు.

  ఇదీ చదవండి : చేదెక్కిన అరటి.. అమ్మకాలు లేక అన్నదాతకు అవస్థలు.. కారణం ఏంటంటే?

  అభినందనల వెల్లువ

  సివిల్స్‌లో ర్యాంకు సాధించిన తెలుగు రాష్ట్రాల వారిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అభినందించారు. ఎమ్మెల్యే పెట్ ఉమాశంకర్‌ కూడా సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో 28వ ర్యాంకు సాదించిన భరద్వాజ్ ను అభినందిచారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Civil Services, Civils, Vizag

  ఉత్తమ కథలు