హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Visakhapatnam:ఈనెల 28న విశాఖ బంద్..స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై మలి విడత పోరాటం తప్పదా..

Visakhapatnam:ఈనెల 28న విశాఖ బంద్..స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై మలి విడత పోరాటం తప్పదా..

(మార్చి28న విశాఖ బంద్)

(మార్చి28న విశాఖ బంద్)

Visakhapatnam: విశాఖ స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పోరాట కమిటీ ఈనెల 28న విశాఖ బంద్‌కు పిలుపునిచ్చింది. స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియను కేంద్రం మళ్లీ దూకుడు పెంచిన నేపధ్యంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపి ఈ నిర్ణయం తీసుకుంది.

ఇంకా చదవండి ...

విశాఖ నగరంలోని స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేస్తున్న ఉద్యమం మరోసారి తీవ్రరూపం దాల్చనుంది. కేంద్రం ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేయడంతో ఉద్యమ కమిటీ యాక్షన్‌ ప్లాన్ సిద్ధం చేసింది. కేంద్ర నిర్ణయం వెనక్కి తీసుకోవాలని..విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అనే నినాదంతో నెలకోల్పబడిన పరిశ్రమను కాపాడుకునేందుకు మలివిడత ఉద్యమానికి దిగుతున్నారు. ఇందులో భాగంగానే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా మార్చి 28న(March) విశాఖ బంద్‌Visakha Bandhకు పిలుపునిచ్చింది. కేంద్రం తీసుకున్న ప్రజావ్యతిరేక నిర్ణయంపై గురువారం (Thursday)కార్మిక సంఘాలతో సమావేశమైన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ (Visakha Steel Conservation Combat Committee)ఈనెల 28విశాఖ బంద్‌ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. స్టీల్‌ ప్లాంట్‌ని ప్రైవేటు పరం చేస్తారని వచ్చిన నాటి నుంచి కార్మికులు రిలే నిరాహారదీక్షలు చేస్తూనే ఉన్నారు. వారి దీక్షలు 400 రోజులు పూర్తి చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని కమిటీ నేతలు తెలిపారు.

ఈనెల 28న విశాఖ బంద్..

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోనివ్వకుండా పోరాడేందుకు తలపెట్టిన ఉద్యమం ఉక్కు సంకల్పంతో సాగుతోంది. ఈనెల 28న చేపట్టబోయే విశాఖ బంద్‌కు ప్రజలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతివ్వాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ విజ్ఞప్తి చేసింది. అంతే కాదు స్టీల్ ప్లాంట్‌కు అనుకూలంగా 100 మంది ఎంపీల సంతకాలను కూడా సేకరించాలని కమిటీ యోచిస్తోంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌- వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ పేరుతో పిలవబడుతున్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (RINL)ఆస్తుల విలువ కట్టేందుకు కంపెనీల నుంచి కేంద్రం బిడ్‌లను ఆహ్వానిస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

మలి విడత ఉద్యమం..

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లోని కేంద్రం వాటాతో పాటు మిగిలిన సంస్థల అనుబంధ వాటాలను ఉపసంహరించుకునేందుకు జనవరి 27న ఆర్ధిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA) సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. దీనికి కొనసాగింపుగానే ప్రభుత్వ రంగ కంపెనీలలో ప్రభుత్వ ఈక్విటీని నిర్వహించే డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (DIPAM) మార్చి 11న దివాలా, దివాలా బోర్డ్ ఆఫ్ ఇండియా (IBBI)లో రిజిస్టర్ చేయబడిన అసెట్ వాల్యూయర్‌ను నియమించడానికి ప్రతిపాదన కోసం అభ్యర్థన (RFP) ను విడుదల చేసింది. కంపెనీ ఆస్తుల మదింపును నిర్వహించడంతో పాటు RINL వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో కేంద్రానికి సహాయం చేయడానికి ఈనిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.

First published:

Tags: Vishakaptnam, Vizag Steel Plant

ఉత్తమ కథలు