హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Turmeric Farming: మన్యంపై రష్యా-ఉక్రైన్ యుద్ధం ఎఫెక్ట్.. ఎందుకో తెలుసా?

Turmeric Farming: మన్యంపై రష్యా-ఉక్రైన్ యుద్ధం ఎఫెక్ట్.. ఎందుకో తెలుసా?

X
మన్యంపై

మన్యంపై రష్యా ఉక్రైన్ యుద్ధం ఎఫెక్ట్

Turmeric Farming: రష్యా-ఉక్రేయిన్‌ యుద్ధం ఎఫెక్ట్‌ మన్యంపై పడింది. అంతకుముందు కరోనా.. ఇప్పుడు యుద్ధాలు.. అంతర్జాతీయంగా ఎదురవుతున్న వరుస సంక్షోభాల ప్రభావం పసుపు మార్కెట్‌పై తీవ్రంగా పడింది. ఎందుకంటే..?

Setti Jagadeesh, News 18, Visakhaptnam

Turmeric Farming: అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitaramaraju District) పరిధిలో వేలాది ఎకరాల్లో పసుపు సాగు (Turmeric Farming) విస్తరించి ఉంది. ఏటా మూడు వేల టన్నుల వరకు ఉత్పత్తి అవుతోంది. ఇక్కడ పసుపు ఉత్పత్తిలో ఎక్కువ భాగం తమిళనాడు (Tamilnadu), కేరళ (Kerala) తో పాటు యూరప్ దేశాలకు ఎగుమతి అవుతుంది. తాజాగా ఎగుమతులు తగ్గి పసుపు ధరలు ఒక్కసారిగా దిగి రావడం గిరి రైతులను కలవరానికి గురి చేస్తోంది. సాధారణంగా పాడేరు ఐటీడీఏ (Paderu ITDA) పరిధిలో 75 కోట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పసుపు ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. ఇక్కడి పసుపును ప్రధానంగా పాడేరు, సాలూరు ప్రాంతాల్లో వ్యాపారులు కొని నిల్వ చేసుకుంటారు. కొమ్ములను ఉడికించి పాలిష్ చేసి శుద్ధి చేస్తారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా విక్రయిస్తుండే వారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.

రోమా రకం.. ఎంతో ప్రియం                                                  కొత్తగా ఏర్పడిన జిల్లాలో పసుపు మార్కెట్ ఎంతో కీలకంగా మారింది. అల్లూరి జిల్లా పరిధిలోని పాడేరు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్ల పరిధిలో సుమారు 35 వేల ఎకరాల్లో సాగవుతోంది. ఇక్కడ పండుతున్న రోమా రకం పసుపులో రస నాణ్యత అధికంగా లభించే కుర్కుమిన్ మూల పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీంతో అంతర్జాతీయంగా కూడా గుర్తింపు ఉంది.

ఇదీ చదవండి : మంత్రుల బస్సు యాత్రకు బిగ్ షాక్.. కీలక మంత్రి ఇలాకాలో జనం లేక సభ రద్దు.. కారణం ఏంటంటే

గతంలో స్థానిక ఆదివాసీలు దేశవాళి పసుపు సాగు చేస్తుండేవారు. దీనికి రెండేళ్లు సమయం పట్టేది. అయితే మార్కెట్లో అంతగా డిమాండ్ లేకపోవడంతో పాటు ఛాయ సైతం అంతంతమాత్రమే ఉండేది. దీనికి బదులుగా అంతర్జాతీయ మార్కెట్ ప్రమాణాలకు తగ్గట్లుగా ఉన్న రోమా రకాన్ని రైతులకు పరిచయం చేశారు. తొమ్మిది నెలల్లో దిగుబడి రావడమే కాకుండా మార్కెటింగ్ వెసులుబాటు ఉంటుంది.

ఇదీ చదవండి : వైసీపీకి బిగ్ షాక్.. మహానాడు వేదికగా టీడీపీలోకి మాజీ ఎంపీ..?

ఈ క్రమంలో స్థానిక ఐటీడీఏలు సైతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ఉప ప్రణాళిక నిధులతో రైతులకు రాయితీపై విత్తనాలు, యంత్ర సామగ్రి అందించి ప్రోత్సహిస్తున్నాయి.

ఇతర దేశాలకు పూర్తిగా తగ్గిన ఎగుమతి                                                            గత రెండేళ్లుగా కొవిడ్‌..ఈ మధ్య రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం పసుపు మార్కెట్ మీద తీవ్రంగా పడింది. ఈ సీజన్‌లో ఇతర దేశాలకు ఎగుమతులు పూర్తిగా స్తంభించాయి. ఇక్కడ పసుపు ఎక్కువగా ఉక్రెయిన్‌తో పాటు ఇతర యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తుంటారు.ఎగుమతులు స్తంభించడంతో దేశీయ మార్కెటారులు సైతం క్షేత్రస్థాయిలో పసుపు నిల్వలు కొనేందుకు ముందుకు రావడం లేదు. ఫలితంగా గత ఏడాదితో పోల్చి చూస్తే స్థానిక వారపు సంతల్లో కేజీకి రూ.20 వరకు తగ్గుదల కనిపిస్తోంది.

ఇదీ చదవండి : : కోనసీమ హింసకు వారే కారణం..? బస్సు యాత్రలో క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స

గిరిజన రైతులు ఆవేదన

ముఖ్యంగా పాడేరు, సాలూరు ఏజెన్సీలో పండించే పసుపునకు బయట మార్కెట్‌లో మంచి డిమాండు ఉంది. నాణ్యత గల పసుపునే ఇక్కడ రైతులు పండిస్తారు. ఈ ఏడాది సీజన్ సమీపించి దాదాపుగా నెలఅయ్యింది. మంచి నాణ్యతగల పసుపునే దిగుబడి చేశామని... తీరా వారపు సంతలకు వెళ్తే ఆశించిన ధర దక్కకపోవడంతో నిరాశతో వెనక్కి వచ్చేస్తున్నామని గిరిజనులు వాపోతున్నారు. కొవిడ్ కంటే ముందు కేజీ రూ.85ల నుంచి రూ.90 వరకు అమ్ముడైంది. గత ఏడాది రూ.85 వరకు కొనేవారు. ప్రస్తుతం రూ. 65 మించడం లేదు. ఈ ధరకు విక్రయిస్తే తమకు పెట్టుబడి కూడా రాదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Turmeric farmers, Visakha, Vizag

ఉత్తమ కథలు