P Anand Mohan, News18,Visakhapatnam
Viral Fevers: బాబోయ్ ఫ్లూ వ్యాధులు అని టెన్షన్ పడాల్సి వస్తోంది. వైరల్ ఫీవర్ల (Viral fevers) దాడితో చిన్నారుల విలవిలాడుతున్నారు. ముఖ్యంగా పసిపిల్లలను కూడా ఈ వైరస్ వదలడం లేదు. ఆంధ్రప్రదేశ (Andhra Pradesh)లో వానలు.. వరదలతో పాటు.. ఈ వ్యాధులు కూడా విస్తరించడం కలకలం రేపుతోంది. గత రెండు వారాలుగా జ్వరం లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్న చిన్నారుల సంఖ్య భారీగా పెరిగిందని పీడియాట్రిక్ వైద్యులు పే ర్కొంటున్నారు. కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు (Heavy Rains), వాతావరణంలో వచ్చిన మార్పులతో ఫ్లూ వైరస్ యాక్టివ్ అయి విజృంభిస్తోంది అంటున్నారు. ఇప్పటికే వందలాది మంది చిన్నారులు వైరస్ బారినపడుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. బాధిత చిన్నారుల్లో జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలున్నాయని చెబుతున్నారు.
గత రెండేళ్లతో పోలిస్తే విశాఖపట్నం జిల్లా (Visakhapatnam District) లో ఈ ఏడాది ఫ్లూ బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఆస్పత్రికి వస్తున్న పది మంది చిన్నారుల్లో ఆరుగురు ఈ వైరస్‌తో ఇబ్బంది పడుతున్నారని చిన్న పిల్లల వైద్య నిపుణుడు, కెజిహెచ్ పీడియాట్రిక్ విభాగం హెచ్ఒడి, అసిస్టెంటు ప్రొఫెసరు సతీష్ చంద్ర అన్నారు. సాధారణంగా ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ఎక్కువగా కనిపించే ఫ్లూ కేసులు ఈ ఏడాది ముందుగానే వెలుగుచూస్తున్నాయి.
ఫ్లూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, సాధారణంగా ఈ జ్వరం 3-4 రోజుల్లో తగ్గిపోతుందని, ప్రస్తుతం కనిపిస్తున్న ఫ్లూ కనీసం పది రోజుల వరకు పిల్లలను వేధిస్తోందని సూచిస్తున్నారు. దగ్గు, జలుబు తీవ్రత అధికంగా ఉండడంతో పిల్లలు తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తోందని సతీష్ చంద్ర.. కొన్ని సూచనలు చెబుతున్నారు. ఆస్పత్రులకు వస్తున్న ప్రతి పదిమందిలో ఆరుగురు ఫ్లూ వైరస్‌తో బాధపడుతుండగా, మరో ఇద్దరు విరేచనాలు, ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని లెక్కలు చెబుతున్నాయి. చల్లని వాతావరణం, తేమ గాలులు, వర్షాల ప్రభావంతో వైరస్‌లు ఒక్కసారిగా యాక్టివ్ అయినట్టు చెబుతున్నారు.
ఇదీ చదవండి : చేతిపంపు నుంచి ఆగకుండా వస్తున్న నీరు.. ఎందుకో తెలుసా..? ఎక్కడంటే..?
వాప్తి ఇలా: ఫ్లూ వైరస్ ఒకరి నుంచి ఒకరికి జోరుగా వ్యాప్తి చెందుతోంది. ప్రస్తుతం పాఠశాలలు తెరవడం వల్ల ఇవి వేగంగా సోకుతున్నాయి. గాలి, చేతులు, వస్తువుల ద్వారా వైరస్ వ్యాప్తి చెంది, చిన్నారులను అనారోగ్యానికి గురి చేస్తున్నాయి.
ఇదీ చదవండి: రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయని ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు.. బాలయ్య ఎందుకు రాలేదంటే..?
జాగ్రత్తలు తప్పనిసరి: ఫ్లూ విజృంభిస్తున్న నేపథ్యంలో చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. వారు ఉండే వాతావరణం పరిశుభ్రంగా ఉంచాలి. వేడి ఆహారం, గోరువెచ్చని నీళ్లు తాగించడంతోపాటు ఆహారం తీసుకునే ప్రతిసారీ చేతులను శుభ్రంగా కడుక్కునేలా చూడాలి. వర్షంలో అస్సలు తడవనీయకూడదు. స్కూల్ నుంచి రాగానే దస్తులు, షూ, సాక్స్ తొలగించి స్నానం చేయించాలి. వాతావరణం చలిగా ఉంటే వేడి నీళ్లలో టవల్ ముంచి తుడ వాలి. చేతులు, కాళ్లు, ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. బయటి ఆహారానికి దూరంగా ఉంచాలి. కొవిడ్ జాగ్రత్తలు పాటించాలే చూడాలి. అస్వస్థతతో ఉన్న పెద్దలకు దూరంగా ఉండాలి. ఇతరులు వినియోగించిన చేతిరుమాలు, వస్తువుల ను పిల్లలకు దూరంగా ఉంచాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Fever, Vizag