Mahatma Gandhi: మహాత్మునికి విశాఖతో అనుబంధం ఇదే..? ఉద్యమకాంక్షను రగిల్చిన జాతిపిత

మహాత్మాగాంధీ (ఫైల్)

Mahatma Gandhi Birth Anniversary: హింస వద్దు... అహింస ముద్దు.. అంటు తూటాల్లాంటి మాటాలతో జనాన్ని సమ్మోహనపరిచిన వ్యక్తి మోహన్ చంద్ కరమ్ చంద్ గాంధీ. ఆయనే మహాత్మా గాంధీ. స్ఫూర్తిదాయక ప్రసంగాలతో జనంలో ఆలోచన రేకెత్తించాలన్న, స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని రగిలించాలన్న గాంధీకే చెల్లింది.

 • Share this:
  P.Anand Mohan, Visakhapatnam, News18

  హింస వద్దు... అహింస ముద్దు.. అంటు తూటాల్లాంటి మాటాలతో జనాన్ని సమ్మోహనపరిచిన వ్యక్తి మోహన్ చంద్ కరమ్ చంద్ గాంధీ. ఆయనే మహాత్మా గాంధీ (Mahatma Gandhi). స్ఫూర్తిదాయక ప్రసంగాలతో జనంలో ఆలోచన రేకెత్తించాలన్న, స్వాతంత్ర్య ఉద్యమ (Freedom Fight) స్ఫూర్తిని రగిలించాలన్న గాంధీకే చెల్లింది. ఆ శక్తి.. యుక్తి మహాత్ముడికే సొంతం. స్వాతంత్ర్య పోరాటంలో తన పర్యటనలో భాగంగా మహాత్మా గాంధీ పలుమార్లు విశాఖపట్నం జిల్లా (Visakhapatnam District)లోని అనకాపల్లి, చోడవరం సభల్లో ప్రసంగిస్తూ ప్రజలను ఉత్తేజ పరిచారు. ఆ నాడు గాంధీజి నడియాడిన ప్రాంతాల్లో ఇవే.స్వాతంత్ర పోరాటం ఉవ్వెత్తున ఎగుస్తున్న వేళ మహాత్ముడు ఒకసారి కాదు, రెండు కాదు, మూడు సార్లు అనకాపల్లి పట్టణాన్ని సందర్శించారు. స్థానికులతో మమేకమయ్యి, స్వాతంత్ర్య స్ఫూర్తిని నిలిపారు.స్వాతంత్ర కాంక్షను రగుల్చుతూ, అనకాపల్లిలో సమావేశాలు నిర్వహించారు. అందుకే గాంధీ అంటే అనకాపల్లి వాసులకు ఎంతో మక్కువ. వచ్చిన ప్రతీసారీ జనం నీరాజనం పట్టారు.

  హిందీ ప్రచారోద్యమంలో భాగంగా మహాత్మాగాంధీ 1929, ఏప్రిల్ 29న విశాఖపట్నం వచ్చారు. అక్కడి నుంచి అనకాపల్లి, చోడవరం, ఏటికొప్పాక, నక్కపల్లి ప్రాంతాల్లో పర్యటించారు. అందులో భాగంగా నెహ్రు చౌక్ నాలుగు రోడ్లు జంక్షన్ వద్ద బహిరంగ సభ నిర్వహించి ప్రజలను చైతన్యవంతుల్ని చేసారు...తరువాత హరిజనోద్దారణలో భాగంగా 1933 డిసెంబర్ 29న అనకాపల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు గాంథీ అనకల్లి రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. రెండవ సారి గాంథీ రావడంతో ప్రజలు రైల్వే స్టేషన్ నుంచి ఊరేగింపుగా పెద నాలుగురోడ్లు, ఇప్పటి నెహ్రూ చౌక్ కు గాందీని తీసుకు వచ్చారు. అనంతరం పెదనాలుగురోడ్ల సమీపంలోని గ్రంధి హనుమంతురావు ఇంటికి వెళ్లారు అక్కడ గాంధీజీ కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత మహాత్ముడిని పెద్ద బజారుకి తీసుకువెళ్లారు.

  ఇది చదవండి: ఏపీలో పెన్షన్ పోర్టబులిటీ.. ఇక నుంచి ఎక్కడైనా పెన్షన్ తీసుకోవచ్చు.. ఇలా చేయండి..


  అప్పట్లో పెద్ద మార్కెట్ లో బెల్లం మార్కెట్ నిర్వహించేవారు.ఆ రోజుల్లో బజారు ప్రాంతం ఆక్రమణకు గురి కాకుండా ఉండటంతో విశాలంగా ఉండేది. దీంతో అక్కడ మహాత్ముడు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయగా 20 వేల మంది హాజరయ్యారు.అప్పట్లో జిల్లాలో జరిగిన సమావేశాల్లో అతి పెద్ద సభ ఇదేనని ఇప్పటికీ చెబుతుంటారు. సభ విజయవంతం కావడంతో అక్కడి వర్తకులు పెద్ద బజారుకు మీ పేరు పెట్టుకుంటామని గాంధీని కోరగా, కాసేపు తటాపటాయించిన మహాత్మడు పేర్లు నావయితే పెట్టకుంటున్నారు గానీ, అక్కడ మాత్రం గాంధీ సిగరెట్లు, గాంధీ కల్లు గాంథీ విస్కీ అంటూ విక్రయించరు కదా అంటు మహాత్మడు చమత్కరించారు. తన ఆశయాలకు అనుగుణంగా మార్కెట్ ను నడిపితేనే పేరు పెట్టుకోవాలని సూచించారు. ఇందుకు వ్యాపారులు సమ్మతించడంతో పెద్ద బజారుకు గాంధీ పేరు పెట్టారు. కాల క్రమేణా ఇది గాంధీ మార్కెట్ గా మారింది.

  ఇది చదవండి: పండగ చేసుకుంటున్న ఏపీ మత్స్యకారులు.. కారణం ఇదే..!  తెలుగు రాష్ట్రాల్లో రెండోదిగా ఖద్దరు సొసైటీ అనకాపల్లిలోనే ఏర్పాటు చేసారు. గాందీ రెండవ సారి అనకపల్లి వచ్చినప్పుడు ఖద్దరు సోసైటీ ఎర్పాటు చేస్తామని ఆర్యవైశ్యసంఘాలు గాంధీజీని కోరారు ఆయన అనుమతి ఇవ్వడంతో చందాలు వసులు చేసారు, ఆ సందర్భంలో గాంధీ ఖద్దరు సొసైటీకి రెండువేల రూపాయలు విరాళం వచ్చాయి ఆ రోజుల్లో రెండు వెలు పెద్ద ఎమౌంట్.. హరిజన నిధికి 516 రూపాయలు విరాళం వచ్చాయి. ఆ సందర్భంలోనే గాంథీ విదేశీ వస్త్రాలను దహనం చేసారు.అలా 1941లో అనకాపల్లి లో గాంధీ ఖద్దరు సొసైటీ ఏర్పాటైంది.

  1946 జనవరి 21న మూడోసారి గాంధీ అనకాపల్లి వచ్చారు. ఈసారి ఇంకా జనప్రవాహం పెరిగిపోయి తొక్కిసలాట జరిగింది. అనేక మంది గాయాలపాలు కాగా, కొంతమంది మృతి చెందారు. దీంతో క్రమశిక్షణ లేకుండా వ్యవహిరంచిన ప్రజల తీరుపై మనస్తాపం చెందిన మహాత్ముడు ఏమీ మాట్లాడుకుండా రైలు ఎక్కి వెనక్కి వెళ్లిపోయారు.ఎలా వెళ్లిన గాంథీ తిరిగి మళ్లి ఇటు వైపు రాలేదు...ఇలా అనకాపల్లి మహాత్మడు ప్రేమను, ఆగ్రహాన్ని చవిచూసింది. గాంధీ అనకాపల్లి వచ్చిన సందర్భంగా పెద్ద మార్కెట్ కు గాంధీ మార్కెట్ గా, అండర్ బ్రిడ్జికి గాంధీ నగర్ గానూ స్టేషన్ రోడ్డుకు గాంధీ బొమ్మ జంక్షన్ గా పేరు పెట్టుకుని ఆయన స్మృతులను నెమరవేసుకుంటున్నారు.

  జిల్లాలో గాంధీజీ పర్యటించిన మరో పట్టణం చోడవరం మండలంలోని గాంధీ గ్రామ్. స్వాతంత్ర ఉద్యమం ఎగసిపడుతున్న తరుణంలో గాంధీజీ పేరంటే పల్లె జనం పోటెత్తావారు. ఆయన్ను చూసేందుకు, ఆయన మాట వినేందుకు ఉత్సాహం చూపేవారు. ఆరోజుల్లో గాంధీజీ ప్రసంగం ప్రజల్లో స్వాతంత్ర కాంక్షను రగిలించేది. గాంధీజీ మాట పల్లెల్లో పదే పదే వినిపించేది.చోడవరం మండలంలో కూడా అటువంటి గుర్తు ఉంది. అదే గాంధీ గ్రామం. మహాత్ముడిపై ఉన్న అపారమైన ప్రేమ, ఆయనిచ్చిన స్ఫూర్తితో గ్రామస్తులు ఆ పేరు పెట్టుకున్నారు. స్వాతంత్ర పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా తిరుతూ ప్రజల్లో ఉద్యమ కాంక్షను రగిలించిన సందర్భంలో 1940లో చింతపల్లి నుంచి కాలినడకన పర్యటిస్తూ గాంధీజి ఈ గ్రామంలో ఆగారు. అప్పుడు ఆగ్రామం పేరు ఆంకూర్ పాలెంగా ఉండేది.

  ఆ సమయంలో గాంధీజీ అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకోని కొంత మంతి ప్రజలతో మైమేకం అయ్యారు.స్వాతంత్రం వచ్చిన తర్వాత అంకూర్ పాలెం గ్రామస్తులు కొందరు, నర్సయ్య పేట నుంచి విడిపోయిన మరికొందరు గాంథీ విశాంతి తీసుకున్న చోట ఒక గ్రామంగా ఏర్పాటు చేసుకుని దానికి గాంధీ గ్రామ్ గా పేరు పెట్టుకున్నారు. ప్రత్యేకంగా తమ గ్రామానికి గాంధీ విగ్రహాన్ని నెలకొల్పుకుని ఆయన్ను తరిస్తుంటారు. చోడవరం మండలంలో ప్రధాన పంచాయితీ విలసిల్లుతున్న ఈ గాంధీ గ్రామ్ లో మహాత్ముని పట్ల తమకున్న గౌరవానికి చిహ్నంగా వారు గాంధీ విగ్రహాన్ని నెలకొల్పారు. ఇప్పటికీ గాంధీ ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్న గ్రామాల్లోగాంధీ గ్రామ్ ఒకటి.
  Published by:Nagesh Paina
  First published: