• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • VISAKHAPATNAM VIJAYANAGARAM CCS DSP PAPARAO DECEASED DUE CORONA VIRUS TOTAL FAMILY EFFECTED CORONA NGS VZM

Corona Virus: దక్కని చివరి చూపు. కుటుంబం మొత్తానికి కరోనా. చికిత్స పొందుతూ డీఎస్పీ మృతి

Corona Virus: దక్కని చివరి చూపు. కుటుంబం మొత్తానికి కరోనా. చికిత్స పొందుతూ డీఎస్పీ మృతి

కరోనా చికిత్స పొందుతూ డీఎస్పీ మృతి, భార్య ఇద్దరు కొడుకులకు కరోనా

ఉన్నత ఉద్యోగం. పెద్ద కుటుంబం కాని అనాథలా అంత్యక్రియలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. విజయనగరం జిల్లా డీఎస్పీ కరోనా చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే ఆయన భార్య, ఇద్దరు పిల్లలు కూడా కరోనా కారణంగా చికిత్స పొందుతున్నారు. దీంతో వారికి కడ చూపు కూడా దక్కలేదు పాపం.

  • Share this:
    ఏపీ కరోనా సెకెండ్ వేవ్ పెను ప్రమాదంగా మారింది. ప్రాణాలను బలి తీసుకుంటోంది. తొలి దశతో పోల్చితే సెకెండ్ వేవ్ వేగంగా విస్తరిస్తోంది. అంతేకాదు మరణాల సంఖ్య కూడా పెరగడం ఆందోళన పెంచుతోంది. ఏప్రిల్ తొలి రోజుల్లో వందల్లో కేసులు నమోదవుతూ ఉండేవి.. కానీ సరిగ్గా రెండు వారాలు తిరిగేసరికి ఒక్క రోజులో నమోదైన కేసుల సంఖ్య ఏడు వేల మార్కును దాటడం ఆందోళన పెంచుతోంది. అయితే గతంతో పోల్చుకుంటే ఈ సారి మరణాల రేటు కూడా ఎక్కువ అవుతోంది..

    తాజాగా విజయనగరం జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. విజయనగరం సీసీఎస్ డీఎస్పీ గా విధులు నిర్వహిస్తున్న జె. పాపారావు కరోనాకు చికిత్స పొందుతూ మృతి చెందారు.  కోవిడ్ బారిన పడి విశాఖపట్నం శ్రద్ధ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ రోజు తెల్లవారుజామున మరణించారు. అయితే భార్య కూడా శ్రద్ధలోనే చికిత్స పొందుతున్నారు.  ఇద్దరు పిల్లలు కూడా కరోనా బారిన పడి కేర్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు.

    1991 బ్యాచ్ ఎస్సై గా విధులలో చేరిన జుత్తు పాపారావు విశాఖ, విజయనగరం జిల్లాలలో ఎస్సై గా, సీఐ గా, డీఎస్పీ గా వివిధ స్టేషన్స్ లో వివిధ హోదాల్లో పనిచేశారు. పాపారావు మృతితో ఆ కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. కరోనా బారిన పడి పాపారావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా.. అతడి భార్య సుమతి, ఇద్దరు కుమారులు కూడా కరోనా బారిన పడ్డారు.

    ప్రస్తుతం ఆయన బార్య విశాఖలోని శ్రద్ధ ఆసుపత్రిలో కోవిడ్ చికిత్స పొందుతున్నారు. ఇక పెద్ద కుమారుడు కిరణ్, చిన్న కుమారు రవీంద్ర కూడా కరోనా కాటుకు గురై కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో తన భర్తను చూసుకోలేని దయనీయ స్థితిలో భార్య సుమతి, తండ్రికి తలకొరివి పెట్టలేని స్థితిలో ఇద్దరు కుమారులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆస్పత్రిలోనే గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. దీంతో ఆ కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగింది.

    డీఎస్పీ పాపారావుది స్వస్థలం శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం. దీంతో శివరామపురం గ్రామంలోనూ విషాద ఛాయలు అలముకున్నాయి. పెద్ద కుమారుడు ఢిల్లీ లోని ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీలో బీటెక్, చిన్న కుమారుడు విశాఖలో మెడిసిన్ చదువుతున్నాడు. అంత పెద్ద కుటుంబ అయ్యి ఉండి కూడా.. అనాథలా డీఎస్పీ అంత్యక్రియలు చేయాల్సి వస్తోందని బంధువులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. పాపారావు మృతికి విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు, విజయనగరం ఎస్పీ బి.రాజకుమారి, జిల్లా పోలీస్ యంత్రాంగం సంతాపం తెలిపారు.
    Published by:Nagesh Paina
    First published:

    అగ్ర కథనాలు