Tragedy: అమ్మా లేదు.. నాన్నా రాలేడు..? స్నేహితులు కనిపించరు.. పట్టించుకునే వారు లేరు.. బంధువులు వారి గురించే మరిచిపోయారు. ఉండడానికి ఇళ్లులేదు.. తినడానికి తిండి లేదు.. కట్టుకునేందుకు బట్టలు లేవు. ఇది ముగ్గురు చిన్నారుల ధీ అవస్థ (Children's Tragedy Story).. ఆట పాటలతో సాగాల్సిన ఆ చిన్నారుల జీవితం కన్నీలే తోడుగా సాగింది. తమ వయసు వారితో స్నేహం చేయాల్సిన ఆ ముగ్గురూ.. కష్టాలతో స్నేహం చేశారు. హ్యాపీగా సాగాల్సిన వారి జీవితం ఇలా మారడానికి తల్లిదండ్రుల మధ్య వివాదాలే (Dispute Between Father and Mother) కారణం. తల్లితండ్రి దూరమైన తరువాత కొద్దిరోజులు అమ్మమ్మ పెడితే ముద్ద తినేవారు. పాపం ఆమె కూడా వారిని విడిచి వెళ్లిపోయింది. దీంతో ఏం చేయాలో తెలియక ఆ చిన్నారులు రోజులు పస్తులతోనే కన్నీరు పెట్టేవారు.. ఎవరిని అడిగేవారు కాదు.. వారి అవస్థ చూసి చలించి.. స్థానిక ఆంజనేయ స్వామి ఆలయ అర్చకుడు (Lord Anjaneya Swamy Temple Priest) నిత్యం ప్రసాదం ఇస్తూ వారి కడుపు నింపేవారు. ఆయన ఇచ్చే ప్రసాదంతోనే ఉదయం, రాత్రి ఆకలి తీర్చుకుంటున్నారు. ఆ విషయం ఆలయానికి వచ్చినవారందరికీ తెలియడం.. మొయిద గ్రామస్థులు మానవత్వంతో వారికి నిత్యం భోజనం అందించే ఏర్పాట్లు చేశారు.
అసలు వారి ముగ్గురి కథా అలా మారడానికి కారణం ఏంటంటే..? స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. నెల్లిమర్ల గ్రామానికి కూతవేటు దూరంలో నెల్లిమర్ల జూట్‌మిల్లు సమీపంలో ఆంజనేయస్వామి ఆలయం ఎదురుగా ఉన్న పూరి గుడిసెలో నివాసం ఉన్న కుటుంబమది. తండ్రి రాములు యాచిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆయనకు భార్య, ముగ్గురు ఆడపిల్లలు గంగ, చిన్నతల్లి, సరస్వతి ఉన్నారు. పెద్దమ్మాయి గంగ 8వ తరగతి చదువుతోంది. మిగతా వారు నాలుగు, రెండో తరగతులు చదువుతున్నారు. అనుకోకుండా ఆ తల్లిదండ్రుల మధ్య వివాదాలు మొదలయ్యాయి.
దీంతో భర్తను.. పిల్లలను విడిచి తల్లి రెండేళ్ల క్రితం ఎక్కడికో వెళ్లిపోయింది. ఆమె వెళ్లిన కొన్ని రోజులకే మనస్థాపంతో తండ్రి చనిపోయాడు. తల్లిదండ్రులు లేకపోవడంతో అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న వరసకు అమ్మమ్మ వీరి ఆలనాపాలనా చూసేది. భిక్షాటన చేసి కడుపు నింపేది. అయితే ఆమెకు కూడా బతుకు భారం అవ్వడంతో.. మూడు నెలల కిందట ఎక్కడికో వెళ్లిపోయింది.
ఇదీ చదవండి : సీఎం నివాసం సమీపంలో లోకేష్ అద్భుత కార్యక్రమం.. సొంత ఖర్చులతో సంజీవని ఆరోగ్య రథం
దీంతో ఆ చిన్నారులు తినడానికి తిండి, కనీసం ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి. పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేస్తూ ఉదయం, సాయంత్రం ఆంజనేయ స్వామి ఆలయం అర్చకుడు కె.చక్రవర్తి ఇచ్చే ప్రసాదంతో ఆకలి తీర్చుకునేవారు. బాలికల పరిస్థితి చూసి మొయిద గ్రామానికి చెందిన మిత్ర బృందం వారికి 15 రోజులుగా భోజనం పెడుతోంది. విషయం వెలుగులోకి రావడంతో జిల్లా శిశు సంక్షేమశాఖ ముందుకొచ్చి చిన్నారులను ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Children, Tragedy, Vizianagaram