హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Igloo Theater: వినడానికి వింతగా అనిపించినా ఇది నిజం.. అందుబాటులోకి ఇగ్లూ థియేటర్.. ప్రత్యేకతలు ఏంటంటే?

Igloo Theater: వినడానికి వింతగా అనిపించినా ఇది నిజం.. అందుబాటులోకి ఇగ్లూ థియేటర్.. ప్రత్యేకతలు ఏంటంటే?

ప్రత్యేక ఆకర్షణగా ఇగ్లూ థియేటర్

ప్రత్యేక ఆకర్షణగా ఇగ్లూ థియేటర్

Igloo Theater: వినోదం విషయంలో ప్రేక్షకుడి అభిరుచి నిత్యం మారుతూనే ఉంది. కొత్తదానాన్ని సినీ లవర్స్ కోరుకుంటున్నారు. వారి అభిరుచికి తగ్గట్టే ఇప్పటికే మల్టీప్లెక్స్ లు వచ్చేశాయి. మరోవైపు ఇంటినే హోం థియేటర్ గా మార్చేసుకుంటున్నారు కొందరు. అయితే సినీ ప్రేమికుల అభిరుచిని గుర్తించిన ఓ వ్యక్తి.. ఇగ్లూ థియేటర్ ను త్వరలో అందుబాటులోకి తెస్తున్నాడు.. దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసా?

ఇంకా చదవండి ...

P Anand Mohan, News18, Visakhapatnam

Igloo Theater: సాధారణంగా సినిమాలకు వెళ్లేముందుద చాలా విషయాలు ఆలోచిస్తాం. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువమంది కోరుకున్న వినోదం సినిమా మాత్రమే.. సాధారణంగా థియేటర్ (Theater) కు వెల్దామా.. లేకుంటే మల్టీప్లెక్సు (Multiflex)కా  అని.. ఖర్చెందుకు ఓటీటీ (OTT)లో చూద్దామా అనుకునే రోజులు ఇవి.. ఇలా సగటు ప్రేక్షకుడి అభిరుచి నిత్యం మారుతూ ఉంది. అందరూ కొత్తదనం కోరుకుంటున్నారు. అలాంటి వారి కోసం ఇప్పటికే అనేక హంగులతో థియేటర్లు సిద్ధమవుతున్నాయి. మల్టీప్లెక్స్ లు సైతం కొత్త కొత్తగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయిత కొత్తగా మరికొన్ని రోజుల్లో ఇగ్లూ థియేటర్ (Igloo Theater) కు వెళ్తే ఎలా ఉంటుందని చర్చించే అవకాశం ఉంది. ఇదేం థియేటర్ అనుకుంటున్నారా..? ఇగ్లూ థియేటర్ కూడా ఉంటుందా అని డౌట్ పడుతున్నారా.. కానీ మీరు విన్నది నిజమే.. త్వరలోనే సినీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఇగ్లూ సినిమా థియేటర్ల మీద ఆసక్తి పెరిగింది. ఇది ఎక్కడ ఉంది.. దీని ప్రత్యేకతలు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. విశాఖ జిల్లా (Visakha District)లో ఆనందపురం జంక్షన్‌ ఫ్లై ఓవర్‌ తరువాత జాతీయ రహదారికి దగ్గరలో ఏ స్క్వేర్‌ గోకార్టింగ్‌ వద్ద ఇగ్లూ థియేటర్‌ నిర్మాణం జరుగుతోంది. ఈ థియేటర్‌ కోసం కొన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారు అనుకుంటే పొరపాటే.. స

సరిగ్గా నెలన్నర క్రితం ప్రారంభమైన ఈ థియేటర్‌ నిర్మాణం ఇంకో నెల రోజుల్లో పూర్తి అవుతుంది. ఆగస్టు నెలలో థియేటర్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 500 గజాల్లో ఇగ్లూ తరహాలో ఎఫ్‌ఆర్‌పీ మెటీరియల్‌తో థియేటర్‌ నిర్మాణం జరుగుతోంది . ఈ మినీ థియేటర్‌లో 100 మంది కూర్చొనే విధంగా సీట్లు ఏర్పాట్లు చేస్తారు. ఫుల్‌ ఏసీ, హైక్వాలిటీ సండ్‌ సిస్టమ్ మల్టీప్లెక్సుల్లో ఉన్న ఫెసిలిటీలు అన్ని చాలా కంఫర్ట్ బుల్ గా ఉంటాయి. దీని నిర్మాణం పూర్తయిన వెంటనే పక్కనే 500 గజాల్లో మరో ఇగ్లూ థియేటర్‌ను నిర్మించే ప్లాన్ లో కూడా ఉన్నాడు అతడు.

అనంతపురం జిల్లాలో ఇటీవలే.. ఛోటా మహరాజ్ సినిమా పేరుతో ఒక ఇగ్లూ టైప్ మిని థియేటర్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. తాడిపత్రిలో కూడా అతి త్వరలో ప్రారంభానికి సిద్దం అవుతోంది. బత్తలపల్లి, దర్మవరం, పుట్టపర్తిలో కూడా ఇలాంటి థియేటర్ల నిర్మాణానికి కొంతమంది సిద్ధం అవుతున్నారు. వందమంది సీటింగ్ కెపాసిటీతో ఉండే ఈ థియేటర్లు ఎలాంటి గందరగోళం లేకుండా చాలా ప్రశాంతంగా సినిమా చూసేయోచ్చు. ఇప్పటికే తెలంగాణలో ఇగ్లూ థియేటర్ నిర్మించారు. ఇటీవలే.. దక్షిణ భారతదేశంలో రెండో థియేటర్ అనంతపురంలో ప్రారంభమైంది. ఇప్పటి వరకు తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో మొదటిది కాగా, అనంతపురంలో రెండోది ప్రారంభం చేశారు. తాజాగా తరువాత తాడిపత్రి, హిందూపురంలో సైతం ఇగ్లూ థియేటర్ ప్లాన్ చేస్తున్నారు.

ఇదీ చదవండి : ఆ చేపల చెరువుకు ఏమైంది..? భారీ సంఖ్యలో ఎందుకు చనిపోతున్నాయి? స్థానికులు ఏం చేశారంటే

అయితే వీటికి కూడా సాధారణ థియేటర్లకు ఏ విధంగా అయితే పర్మిషన్లు తీసుకొంటారో అలానే పర్మిషన్లు తీసుకుంటారు. ఈ మిని థియేటర్ నిర్మాణానికి దాదాపు కోటి రూపాయల వరకూ ఖర్చు అవుతుంది. ఉత్తర భారతదేశంలో ఈ థియేటర్లు మంచి ట్రెండ్ తో నడుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన ఇగ్లూ థియేటర్లకు కూడా బాగానే క్రేజ్ ఉంది. మరి త్వరలో విశాఖపట్నంలో నిర్మితం అవుతున్న ఈ థియేటర్లు ఎలాంటి క్రేజ్ సొంతం చేసుకుంటాయో చూడాలి.. ఎందుకంటే విశాఖ ప్రజలు ఎప్పుడూ కొత్తదనాన్ని ఆహ్వానిస్తారు. అలాగే ఇక్కడకు వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా ఎక్కువే.. నిత్యం రద్దీగా ఉంటుంది. దీంతో కచ్చితంగా ఈ ఇగ్లూ థియేటర కు తప్పక ఆదరణ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Visakhapatnam, Vizag

ఉత్తమ కథలు