హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Submarine: ఘాజీ సినిమాలోని సబ్‌మెరైన్‌ను చూడాలని ఉందా..? ప్రత్యేకతలు ఇవే..

Submarine: ఘాజీ సినిమాలోని సబ్‌మెరైన్‌ను చూడాలని ఉందా..? ప్రత్యేకతలు ఇవే..

ప్రత్యేక

ప్రత్యేక ఆకర్షణగా ఘాజీ సబ్ మెరైన్

సబ్‌ మెరైన్‌ లోపల ఎలా ఉంటుంది...అందులో ఏమేం ఉంటాయి. ఎంతమంది ఉంటారు..అప్పట్లో యుద్ధం సమయంలో వీటిపాత్ర ఏంటి? జలాంతర్గాముల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వైజాగ్‌ బీచ్‌కు వెళ్లాల్సిందే.

  Neelima Eaty, News18 Visakhapatnam

  INS Kursura Submarine:  హీరో రానా (Hero Rana) నటించిన ఘాజి సినిమా (Ghaji Movie) చూసినప్పుడు. ఎంతో థ్రిల్‌ ఫీలై ఉంటారు. ఆ సబ్‌మెరైన్‌ (Submarine) నిజంగా చూసినప్పుడూ అదే అనుభూతి పొందుతారు. ఆ ఫీల్  పొందాలంటే వైజాగ్‌లో ఆర్కేబీచ్‌ (Vizag RK Beach) కు వెళ్లాల్సిందే.. 31 సంవత్సరాల గ్లోరియస్ సర్వీస్ చేసి 2001 నుంచి మ్యూజియంగా మారి ఎంతో మందిని ఆకర్షిస్తోంది మన ఐఎన్ఎస్ కురుసుర  జలాంతర్గామి (INS Kursura Submarine). విశాఖపట్నం (Visakhapatnam)లో ని ఆర్కే బీచ్ ( RKబీచ్) రోడ్‌లో కనువిందు చేస్తుంది.

  ఈ  INS కుర్సుర సబ్‌మెరైన్‌ భారతదేశానికి చెందిన ఐదవ జలాంతర్గామి. కుర్సుర 18 డిసెంబర్ 1969న ప్రారంభించబడిన ఈ కుర్సుర 31 సంవత్సరాల సేవ తర్వాత 27 ఫిబ్రవరి 2001న ఉపసంహరించారు. 1971 ఇండో-పాకిస్తానీ యుద్ధం (Ind Pak War) లో పాల్గొన్న కుర్సుర .. పెట్రోలింగ్‌లో కీలక పాత్ర పోషించింది. తరువాత ఇతర దేశాలతో కలిసి నౌకాదళ విన్యాసాలలో పాల్గొంది ఇతర దేశాలలో అనేక పర్యటనలు చేసింది.

  దేశంలోనే తొలి సబ్‌మెరైన్ మ్యూజియం

  ఐ.ఎన్.ఎస్ కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియం భారతీయులకు గర్వకారణం. భారతదేశంలో మొట్ట మొదటి సబ్‌మెరైన్ మ్యూజియం మనం INS కురుసుర సబ్‌మెరైన్. ఈ జలాంతర్గామిని 1969లో రష్యా వాళ్ళు తయారుచేశారు. వైజాగ్‌లో ఐఎన్ఎస్ కురుసర సబ్‌మెరైన్ మ్యూజియం దక్షిణాసియాలో మొదటిది మరియు ప్రపంచంలో రెండవ సబ్‌మెరైన్ మ్యూజియం. ఐఎన్ఎస్ కురుసురా తన 31 సంవత్సరాల సేవలో 73,500 నాటికల్ మైళ్లు ప్రయాణించింది. ఈ దూరం భూమి యొక్క వ్యాసం కంటే చాలా ఎక్కువ.

  ఇదీ చదవండి : పిట్ట కొంచెం.. కూత చాలా ఘనం.. రికార్డులు క్రియేట్ చేస్తున్న చిచ్చర పిడుగు..

  సబ్‌మెరైన్ సేవలు.. ప్రస్తుతం ఏమున్నాయి..?

  INS కురుసుర జలాంతర్గామి 91.3 మీటర్ల పొడవు మరియు 8 మీటర్ల వెడల్పుతో, 1971 నాటి ఇండో-పాక్ యుద్ధంతో సహా అనేక యుద్ధాలలో ముఖ్యమైన పాత్ర పోషించింది. సబ్‌ మెరైన్‌ దేశానికి సేవలు అందించిన నాటి కీలకమైన క్షణాలను సందర్శకులకు చూపించేందుకు ఆనాటి కళాఖండాలు, ఫొటోగ్రాఫ్స్‌, వాటితో పాటు వాటి గురించి వ్రాసిన స్క్రిప్ట్‌లను కూడా ప్రదర్శనలో ఉంచారు. ఈ మ్యూజియంలో జలాంతర్గామి జీవితంతో పాటు సముద్రంలో జలాంతర్గాములు ఎదుర్కొనే సవాళ్లను తెలియజేసేలా ప్రదర్శన ఉంది. జలాంతర్గాముల గురించి సందర్శకులకు అవగాహన కల్పించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

  ఇదీ చదవండి : మంత్రి అంబటికి నిరసన సెగ.. గడప గడపకు ప్రభుత్వంలో పెన్షన్ పై నిలదీత

  సబ్‌మెరైన్‌ వివరాలు

  ఐఎన్ఎస్ కుర్సురా మొత్తం జలాంతర్గామిలో కేవలం 2 వాష్‌బేసిన్‌లు మరియు 2 రెస్ట్‌రూమ్‌లను మాత్రమే కలిగి ఉంది. జలాంతర్గామి మ్యూజియంలోని కౌన్సిలర్‌లలో ఒకరు వివరించినట్లుగా, కొన్నిసార్లు జలాంతర్గామి సముద్రం మధ్యలో 77 మంది సిబ్బందితో ఒక నెల కంటే ఎక్కువ కాలం ఉంటుంది.

  ఇదీ చదవండి : మున్సిపల్ స్కూళ్ల విలీన నిర్ణయనం వెనుక భారీ కుట్ర.. టీచర్ల పోరాటానికి మద్దతు

  మ్యూజియంలో ఆరుగురు గైడ్‌లు

  INS కురుసుర జలాంతర్గామి మ్యూజియం… దాని గొప్ప చరిత్ర మరియు ప్రత్యేకత కారణంగా పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తుంది. మీకు ఒకవేళ ఆ మ్యూజియంలో ఏమేం ఉన్నాయో తెలియకపోతే.. అక్కడ మీకు వివరాలు చెప్పేందుకు దాదాపు ఆరుగురు గైడ్‌లు ఉంటారు. వారు సందర్శకులతో జలాంతర్గామి చరిత్ర మరియు కార్యకలాపాలను చాలా వివరంగా తెలుపుతారు.

  ఇదీ చదవండి : సీఎం జగన్ కు బిగ్ షాక్.. నారా లోకేష్ ను కలిసిన వైసీపీ కీలక నేత

  టిక్కెట్ తప్పనిసరి

  దీనిని చూడడానికి సందర్శకులు ప్రవేశం కూడా ఉంది. కొంచెం డబ్బు చెల్లించి మొత్తం జలాంతర్గామిని చూడవచ్చు. పెద్దలుకు 40 రూపాయిలు, చిన్నపిల్లలకు 20 రూపాయిలు.

  ఇదీ చదవండి : పొత్తులపై చర్చలవేళ కొత్త ట్విస్ట్.. పవన్ ట్వీట్ల సారంశం అదేనా? టార్గెట్ ఎవరు

  టైమింగ్స్‌: మంగళవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 2 గంటలు నుంచి రాత్రి 8:30 వరుకు మాత్రమే. ఆదివారం 10 గంటలు నుండి 12:30 వరుకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటలు నుంచి రాత్రి 8:30 వరుకు. సోమవారం మాత్రం సబ్మెరన్ క్లోజ్ చేసి ఉంటుంది.

  ఇదీ చదవండి : నిన్న అన్న నేడు చెల్లి.. ఏపీలో జగన్.. తెలంగాణ లో షర్మిల.. ట్రాక్టర్ నడిపి రైతులకు భరోసా

  మ్యూజియం అడ్రస్: ఆర్ కె బీచ్ రోడ్, కిర్లంపూడి లేఅవుట్, చిన్న వాల్టెయిర్, పాండురంగాపురం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ 530017

  ఫోన్‌ నెంబర్‌: 08912754133, 08912563429


  ఎలా వెళ్లాలి?

  విమాన మార్గం ద్వారా వైజాగ్‌ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లొచ్చు. అక్కడ నుంచి వైజాగ్‌ బీచ్‌ రోడ్‌కు క్యాబ్‌ బుక్‌ చేసుకోవచ్చు. రైలు, బస్సు మార్గం ద్వారా అయితే వైజాగ్‌ వరకు వెళ్లొచ్చు. వైజాగ్‌ బస్టాండ్‌ నుంచి ఆటోలో బీచ్‌ రోడ్‌కు వెళ్లొచ్చు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Best tourist places, Local News, Vizag

  ఉత్తమ కథలు