హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Rare Fish: ఈ చేపను తినలేరు.. కానీ లాభాలు పండిస్తుంది.. ఎందుకో తెలుసా? సముద్రంలో జాలార్ల వలకు చిక్కిన పెద్ద చేప

Rare Fish: ఈ చేపను తినలేరు.. కానీ లాభాలు పండిస్తుంది.. ఎందుకో తెలుసా? సముద్రంలో జాలార్ల వలకు చిక్కిన పెద్ద చేప

సముద్రంలో చిక్కిన అరుదైన చేప

సముద్రంలో చిక్కిన అరుదైన చేప

Rare Fish: అప్పుడప్పుడూ జాలర్లకు షాక్ ఇస్తాయి కొన్ని చేపలు.. నిత్యం చేపల కోసం వల వేసే మత్స్యాకారులకు అప్పుడప్పుడు ఊహించని విధంగా అత్యంత అరుదైన.. అత్యంత పెద్ద చేపలు చిక్కుతాయి. అయితే ఈ సారి సముద్రంలో చిక్కన చేప చాలా అరుదైని.. తినడానికి ఏ మాత్రం పనికిరాదు.. కానీ భారీ ధర పలికింది.. ఎందుకో తెలుసా..?

ఇంకా చదవండి ...

Rare Fish: వారంతా మత్స్యకారులు (Fishermen).. రోజంతా కష్టపడి చేపలు పడితేనే వారికి పూట గడుస్తుంది. అది కూడా సంప్రదాయ మత్స్యకారులు కావడంతో మరింత శ్రమ అసవరం వారికి. ఒక్కోసారి వారం రోజులైనా ఒడ్డుకు వచ్చే పరిస్థితి ఉండదు. దండిగా చేపలు వలకు చిక్కితేనే (Fish Hunting) వారి శ్రమకు ఫలితం వస్తుంది. సముద్రంలోకి వెళ్లే ముందు గంపెడాశతో వెళ్తారు. ఒక్కోరోజు వారి ఆశల అంచనాలు అందుకుంటారు. మరో రోజూ గంపెడు కాదు కదా.. గుప్పేడు చేపలు దొరికే పరిస్థితి ఉండదు. అయితే మత్స్యకారులకు ఇది నిత్య పోరాటమే. ఆ తరహాలోనే సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఊహించని అనుభవం ఎదురయ్యింది. తాజాగా కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం (U.Kothapalli Mandal)లో సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఒక మత్స్యకారుడు వలకు భారీ టేకు చేప లభ్యమైంది. ఈ చేప చాలా చాలా ప్రత్యేకమైంది. దీంతో వారి ఆనందానికి హద్దులేకుండా పోయింది.. అయితే ఆ చేప మాత్రం తినడానికి ఏ మాత్రం పనికి రాదు..

ఉప్పాడ గ్రామం (Uppada Village) మాయపట్నంకి చెందిన మోష అప్పారావు తనకు ఉన్న సంప్రదాయ వలలతో సముద్రంలోకి సాంప్రదాయ తెప్ప బోటులో చేపల వేటకు వెళ్ళారు. సముద్రంలో వల వేయగా చాలా చేపలు చిక్కాయి. అందులో సుమారు 50 కిలోలు బరువు ఉండే భారీ టేకు చేప (Teku Fish)కూడా ఉంది. ఈ చేపను కాకినాడకు చెందిన వేలంపాటదారుడు దక్కించుకున్నాడు. భారీ సైజులో ఉండే టేకు చేపలు సముద్రంలో వేటకు వెళ్ళే మత్స్యకార వలలకు చాలా అరుదుగా చిక్కుతాయి.


సముద్ర గర్భంలో ఉండే టేకు చేప బయటికి రావడం.. అది వలకు చిక్కడంతో మత్స్యకారులు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఈ టేకు చేప తినేందుకు పనికిరాదని.. ఔషధాల తయారీలో ఉపయోగిస్తారని నిపుణులు తెలిపారు. సాధారణంగా ఈ టేకు చేప వెనుక భాగంలో తోకకు ఉండే ముళ్లు చాలా ప్రమాదకరమైనవి..

ఇదీ చదవండి : చంద్రబాబుకు సిక్కోలు సెంటిమెంట్.. రేపటి నుంచి జనం బాట.. జిల్లాల పర్యటన వ్యూహం అదేనా?

ఇది చాలా విచిత్రమైన చేప కూడా.. దీని వల్ల చిన్న చిన్న చేపలకు ప్రమాదం పొంచి ఉంటుంది. సముద్రంలో చిన్న చేపలను తింటూ జీవనం సాగించే.. ఈ టేకు చేప సుమారు 500 కేజీల వరకు బరువు పెరిగే అవకాశం ఉంటుంది అంటారు. వీటిపై ఏవైనా పెద్ద సముద్ర జీవరాశులు దాడికి ప్రయత్నించే సందర్భాల్లో ఏనుగు తొండం మాదిరిగా ఉంటుంది. ఆ తోక సాయంతో రివర్స్ అటాక్ చేసి తమను తాము రక్షించుకుంటూ ఉంటాయి. సాధారణంగా సాధు స్వభావంతో స్నేహపూర్వకంగానే మెలిగే ఈ టేకు చేప.. భయపడిన స్థితిలో చాలా ప్రమాదకరంగా మారుతుంది.

First published:

Tags: Andhra Pradesh, AP News, Fish, Fishermen

ఉత్తమ కథలు