హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Lucky Fish: ఈ చేప చిక్కతే అదృష్టమే? ఎంత ధర పలికిందో తెలుసా..? ప్రత్యేకతలేంటి..?

Lucky Fish: ఈ చేప చిక్కతే అదృష్టమే? ఎంత ధర పలికిందో తెలుసా..? ప్రత్యేకతలేంటి..?

Lucky Fish:ఆ చేప చిక్కితే మత్స్యాకారుల పంట పండినట్టే.. ఎందుకంటే ఒక్క చేప చిక్కితే చాలు రాత్రికి రాత్రే లక్షాధికారులు కావొచ్చు.. ఏంటి ఆ చేప.. ఎందుకు అంత ప్రత్యేకతో తెలుసా..?

Lucky Fish:ఆ చేప చిక్కితే మత్స్యాకారుల పంట పండినట్టే.. ఎందుకంటే ఒక్క చేప చిక్కితే చాలు రాత్రికి రాత్రే లక్షాధికారులు కావొచ్చు.. ఏంటి ఆ చేప.. ఎందుకు అంత ప్రత్యేకతో తెలుసా..?

Lucky Fish:ఆ చేప చిక్కితే మత్స్యాకారుల పంట పండినట్టే.. ఎందుకంటే ఒక్క చేప చిక్కితే చాలు రాత్రికి రాత్రే లక్షాధికారులు కావొచ్చు.. ఏంటి ఆ చేప.. ఎందుకు అంత ప్రత్యేకతో తెలుసా..?

  Lucky Fish: మత్స్యాకారులు నిత్యం వేటకు వెళ్తుంటారు.. అయినా రోజూ విధితో పోరాటం చేస్తారు.. ఒక్కోసారి వారి శ్రమకు తగ్గ ఫలితం కూడా దక్కదు.. కానీ ఒఖ్క చేప మాత్రం వలకు చిక్కితే.. వారి పంట పడినట్టే.. దాని పేరే గోల్డెన్ ఫిష్ (Golden Fish).. దీన్ని కచ్చిడి చేప (Kachidi Fish) అని కూడా అంటారు. ఈ మధ్య ఈ కచ్చడి చేప పేరు జనాల నోళ్లలో బాగా నానుతుంది. అందుకు కారణం దాని ధర.. రుచి.. ఈ రకం చేప జాలర్లకు చిక్కాలి అంటే వారికి సుడి ఉండాలి అంటారు. లక్కీగా ఆ కచ్చిడి వలలో పడితే.. ఒక్కరోజులోనే లక్షాధికారి అయిపోవచ్చు. ముఖ్యంగా అందులోనూ మగ చేప అయితేనే మార్కెట్‌లో పీక్స్‌లో డిమాండ్ ఉంటుంది. దీన్ని కొనేందకు వ్యాపారులు విపరీతంగా పోటీ పడతారు. అంత డిమాండ్ ఎందుకు అంటారా.. కేవలం రుచి కోసం అయితే అంత ధర ఏంటి అనుమానం కలగొచ్చు.. ఈ కచ్చిడీ కేవలం రుచికే కాదు.. ఔషధంగా కూడా పని చేస్తుంది అంటున్నారు మత్స్య కారులు.

  కచ్చిడి చేప పొట్టలోని తిత్తులు ఔషధాల తయారీలో ఉపయోగిస్తారని.. అందుకే అంత రేటని వ్యాపారాలు చెబుతారు. సర్జరీ చేశాక కుట్లు వేసే దారాన్ని ఈ చేప గాల్ బ్లాడర్‌తో తయారు చేస్తారని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. అంతేకాదు ఖరీదైన వైన్‌ తయారీలోనూ ఈ ఫిష్‌‌ను వినియోగిస్తారు. అందుకే ఇంత డిమాండ్ ఆ చేపకు. అందుకే దీన్ని గోల్డెన్ ఫిష్ అని కూడా పిలుస్తారు. నిజంగానే ఈ చేప దొరికితే మత్స్యకారులు తమకు గోల్డ్ దొరికనట్టే అని భావిస్తారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా (East Godavari District)లోని సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్ వద్ద ఇరవై ఎనిమిది కేజీల మగ చేప మత్స్యకారుల వలకు చిక్కింది. ఈ చేపను పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) లోని నర్సాపురం గ్రామానికి చెందిన వ్యాపారి 2 లక్షల 90 వేల రూపాయలకు కొనుగోలు చేశారు.

  సాధారణంగా సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు చేపలు చిక్కడం సహజం. ఒక్కోసారి ఇలా అరుదైన చేపలు, రకరకాల రూపాల్లో మత్స్యకారుల వలకు చిక్కుతుంటాయి. ఇటీవల విశాఖ జిల్లాలో మాత్రం చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు ఓ భారీ కాయంతో ఉన్న తిమింగలం చిక్కింది.  దీంతో భారీ చేప పడి ఉంటుందని సంబరపడ్డారు ఆ మత్స్యకారులు. అదృష్టం కలిసి వచ్చిందని అనుకున్నారు. ఎంత శ్రమించినా వలను పడవలోకి లాగలేకపోయారు. చివరకు పడవలో ఉన్న తాడును కట్టి చెమటోడ్చి ఎలాగోలా తీరానికి చేర్చారు. తీరా చూస్తే అది భారీ తిమింగలం. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడడంతో చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన మత్స్యకారులంతా దాన్ని చూసేందుకు తరలి వచ్చారు.

  చిక్కిన ఈ తిమింగలం బరువు సుమారు వెయ్యి నుంచి 12 వందల కిలోల వరకు ఉంటుంది. దీనిని మత్స్యకార పరిభాషలో పప్పరమేను అంటారట. ఇది తినడానికి పనికి రాదని, కానీ దీని నుంచి వచ్చే నూనెలో చాలా ఔషధ గుణాలు కలిగి ఉంటుందని స్థానికులు వివరించారు. పట్టుబడిన తిమింగలం ప్రాణాలతో ఉండటంతో గుర్తించిన మత్స్యకారులు దానిని తిరిగి సముద్రంలోనికి వదిలేశారు.

  ఇదీ చదవండి : ఏపీ సీఎం జగన్ కు నాంపల్లి కోర్టు సమన్లు.. ఈనెల 28న హాజరు కావాలని ఆదేశం.. ఏ కేసులోనో తెలుసా..?

  తిమింగలం సంగత ఎలా ఉన్నా.. కచ్చిడి చేప మాత్రం మత్స్యాకారుల పంట పండేలా చేస్తుంది. ఈ చేపకు అంత డిమాండ్ ఉన్నా.. చాలా అరుదుగానే ఇది మత్స్యకారులకు లభిస్తుంది. కచిడి చేపను సముద్రంలో గోల్డెన్ ఫిష్‌గా పిలుస్తారు. ఆ చేప పేరులో ఉన్నట్లుగా నిజంగానే అది బంగారం. మత్స్యకారులకు కాసులు కురిపిస్తుంది. కచిడి చేప ఎక్కడా ఓ చోట స్థిరంగా ఉండదు. సముద్రంలో ఒక చోట నుంచి మరో చోటికి ప్రయాణిస్తూనే ఉంటుంది. అలా ఎక్కడెక్కడో సుదీర్ఘ ప్రాంతాలకు తిరుగుతుంది. చాలా అరుదుగా ఈ చేపలు మత్స్యకారుల వలకు చిక్కుతుంటాయి.

  First published:

  Tags: Andhra Pradesh, AP News, Fish, Fishermen

  ఉత్తమ కథలు