హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag: పది, ఇంటర్ పాసైన విద్యార్థలకు గుడ్‌న్యూస్‌..! దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ఏయూ

Vizag: పది, ఇంటర్ పాసైన విద్యార్థలకు గుడ్‌న్యూస్‌..! దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ఏయూ

విద్యార్థులకు శుభవార్త

విద్యార్థులకు శుభవార్త

Vizag: వివిధ కారణాలతో చదువు మధ్యలో ఆపేశారు.. టెన్త్, ఇంటర్ తరువాత కాలేజ్ కు వెళ్లేే పరిస్థితి లేదా.. అయితే మీ అందరికీ గుడ్ న్యూస్ చెబుతోంది ఆంధ్రా యూనివర్శిటీ.

 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Setti Jagadeesh, News 18, Visakhaptnam

  సాధారణంగా చాలా మందికి కాలేజ్ (College) కు వెళ్లి చదుకోవాలి అనిపించినా.. అది అందరికీ సాధ్యం కాదు.. కొన్ని కారణాలతో చాలామంది పది లేద ఇంటర్ లోనే విద్యను ఆపేస్తారు.. పరిస్థితులు అనుకూలించక పోవడంతో.. వారంతా కాలేజ్ కు వెళ్లలేకపోవడంతో.. విద్యాను మధ్యలోనే ఆపేస్తారు. అయితే అలాంటి వారికి ఆంధ్ర యూనివర్శిటీ (Andhra University) గుడ్ న్యూస్ చెప్పింది. కళాశాలకు వెళ్లలేని విద్యార్థులకు, జాబ్స్ చేసుకుంటూ డిగ్రీ కోర్స్ చేసే యువకులకు ఇది సువర్ణ అవకాశం. డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ (Distance Education) చదుకుకోవాలని ఎదురుచూస్తున్న వారికి ఆంధ్రాయూనివర్సిటీ ఆహ్వానం పలుకుతోంది.

  దూర విద్యా విధానం ప్రొసెస్ ప్రారంభం కావడంతో ఆన్‌లైన్ అప్లికేషన్‌లు జోరందుకున్నాయి. దూర విద్య విధానం ద్వారా అందరికీ నాణ్యమైన విద్యను చేరువ చేయడమే లక్ష్యంగా ఆంధ్రా విశ్వవిద్యాలయం పనిచేస్తోంది. విద్యార్థులు దేశంలో ఎక్కడ నుంచైనా సేవలు పొందే దిశగా మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే విద్యార్థులకు ఆన్‌లైన్‌లో బీకామ్, ఎంఏ సోషియాలజీ కోర్సులను అందిస్తున్న ఏయూ దూరవిద్య కేంద్రం మరిన్ని సేవలను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది.

  ప్రస్తుతం విద్యార్థులకు అందిస్తున్న డిగ్రీ, పీజీ కోర్సుల ప్రవేశాలు, పరీక్షలకు దరఖాస్తు, ఫీజుల చెల్లించడం వంటి వాటిని ఆన్‌లైన్‌లోనే చేసేలా చర్యలు తీసుకుంది. ఏయూ ఇప్పటికే సెప్టెంబర్ 5న ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేయగా ఆన్‌లైన్‌లో దాదాపు 250 మంది దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబర్ 25 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశముంది.

  ఇదీ చదవండి : ఆ గార్డెన్స్ లో దొరకని మొబైల్ ఉండదు.. ఇంకా ప్రత్యేకత ఏంటంటే?

  ఈ దూర విద్యా కోర్సులకు రెగ్యులర్ కోర్సుల తరహాలోనే సెమిస్టర్ విధానం ఉంటుంది. అదే విధంగా గ్రేడింగ్ విధానం కూడా ప్రవేశపెట్టారు ఏయూ అధికార యంత్రాంగం.

  ఇదీ చదవండి : : బిడ్డకు ప్రాణం పోసిన మెడిసన్ విద్యార్థి.. ట్రైన్ లో నిండు గర్భిణికి డెలివరీ..

  విద్యార్థుల ముంగిటకే సేవలు.. ఎలా అప్లై చేయాలి..?                      గ్రామీణ, పట్టణ ప్రాంతాల విద్యార్థులు సైతం సులువుగా తమకు నచ్చిన కోర్సులను అభ్యసించేలా ఆన్‌లైన్‌లో ప్రవేశాలు పొందే అవకాశం ఏయూ కల్పిస్తోంది. దీనిలో భాగంగా విద్యార్థులు andhrauniversity.edu.in లో నిర్దేశిత లింక్ క్లిక్ చేయాలి. అనంతరం లెర్నర్ ఎన్‌రోల్‌మెంట్‌ని క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. అక్కడ విద్యార్థులు తమ వ్యక్తిగత సమాచారం, సామాజిక, విద్యా సంబంధ వివరాలు ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

  ఇదీ చదవండి : : బీచ్‌రోడ్‌కు వెళ్తున్నారా.. ఈ స్నాక్‌ ఐటమ్‌ అస్సలు మిస్‌ కావద్దు..! స్పెషల్‌ ఏంటో తెలుసా..?

  అలాగే పదో తరగతి, కులధ్రువీకరణ, విద్యార్హత తెలిపే సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేయాలి. దీంతో దరఖాస్తు చేయడం పూర్తి అవుతుంది. ఫీజు కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. ఆ తర్వాత కోర్సులు వారీగా నిర్దేశిత ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత వర్సిటీ అధికారులు, విద్యార్థుల దరఖాస్తు, తదితర వివరాలను ధ్రువీకరిస్తారు. విద్యార్థులు దూర విద్య కేంద్రానికి రావాల్సిన అవసరం లేదు. ఫోన్‌, ఇంటర్నెట్ ద్వారా కూడా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

  అడ్రస్: ఆంధ్రా యూనివర్సిటీ, వాల్తేర్‌ మెయిన్‌ రోడ్‌, కిర్లంపూడి లేఅవుట్‌, చిన్న వాల్తేర్‌, విశాఖపట్నం , ఆంధ్రప్రదేశ్‌- 530003.

  ఎలా వెళ్లాలి?

  విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి బస్సు ఆటో సౌకర్యం కలదు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, EDUCATION, Local News, Visakhapatnam

  ఉత్తమ కథలు