ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) కొత్తగా తీసుకొచ్చిన జీవో నం 1 ఇప్పుడు అనేక మందికి ఇబ్బందిగా మారింది. తాజాగా ఈ జీవో ఎఫెక్ట్.. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నయా మూవీ వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ను విశాఖలో గ్రాండ్ గా నిర్వహించాలని సినిమా యూనిట్ నిర్ణయించింది. ఆ ఏర్పాట్లలో ఉండగానే బిగ్ షాక్ తగిలింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం.. విశాఖ ఆర్కే బీచ్‌లో 8న వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలి అనుకున్నారు. కానీ దానికి బ్రేక్ లు పడ్డాయి. ఈవెంట్ కోసం సన్నాహాలు జరుగుతుండగా.. అందుకు సంబంధించిన స్టేజ్ పనులు నిలుపు వేయాలని అధికారులు నిర్వాహకులను ఆదేశించారు. దీంతో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖలో (Visakhapatnam) ఉండదని అంతా షాక్ కు గురయ్యారు. అయితే తాజాగా ప్రభుత్వ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు లైన్ క్లీయర్ చేసినట్టు తెలుస్తోంది.
ఆంధ్ర యూనివర్శిటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాట్లు చేసుకోవాలి సూచించినట్టు తెలుస్తోంది. ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో వేదిక ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచించారు.
మరోవైపు వాల్తేరు వీరయ్యతో పాటు సంక్రాంతి బరిలో నిలుస్తున్న బాలకృష్ణ సినిమా వీరసింహారెడ్డి(Veerasimha Reddy) ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో నేడు జరగనుంది. అయితే మొదట ఒంగోలులో (Ongole) ఏబీఎన్ గ్రౌండ్స్ లో నిర్వహించాలని చిత్ర బృందం నిర్ణయించుకుంది. కానీ పోలీసులు మాత్రం సెక్యూరిటీ రీజన్స్ కారణంగా దీనికి పర్మిషన్ ఇవ్వలేదని తెలుస్తోంది.. ఆంధ్రప్రదేశ్ లో మొన్న జరిగిన తొక్కిసలాట తరువాత పోలీసులు ఎక్కువమంది వచ్చే ఈవెంట్లకు పర్మిషన్లు ఇవ్వడం లేదు. కానీ సినిమా ఫంక్షన్లకు కూడా అనుమతి ఇవ్వకపోవడ.. ఒక సినిమాకు అనుమతిచ్చి.. మరో సినిమాకు అనుమతి ఇవ్వకపోతే విమర్శలు తప్పవని భావించి.. నిర్ణయం మార్చుకున్నట్టు ప్రచారం ఉంది.
ఇదీ చదవండి : మొన్న అనం.. నిన్న వసంత కృష్ణప్రసాద్.. నేడు మాజీ మంత్రి..? వారి టార్గెట్ అదేనా..?
పలు నిబంధనలు పెట్టి పోలీసులు వీరసింహారెడ్డి రిలీజ్ ఈవెంట్‌కు పర్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తుంది. నిర్వాహకులు ఒంగోలు బైపాస్ రోడ్డు దగ్గర బీఎంఆర్ అర్జున్ ఇన్‌ఫ్రా ప్రాంతంలో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులు నేడు ఒంగోలులోని ఈవెంట్‌కి హాజరవడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ ఈవెంట్‌కి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఇదీ చదవండి: పెద్దిరెడ్డి గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా..? చంద్రబాబు సవాల్ ను మంత్రి స్వీకరిస్తారా?
మరోవైపు ఈ జీవోపై దుమారం మాత్రం ఆగడం లేదు. విపక్షాలన్నీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నాయి.. సభలు.. సమావేశాలు నిర్వహించుకోవద్దు అంటే ఎలా అని మండిపడుతున్నారు. ఇప్పుడు సినిమా ఈవెంట్లకు కూడా ఆటంకాలు కలిగిస్తే.. భవిష్యత్తులో ఏపీలో ఫంక్షన్లు చేయడానికి ఎవరూ ముందుకు రారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Megastar Chiranjeevi, Waltair Veerayya