హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Dussehra 2022: ప్రయాణికులకు పండుగ ఆఫర్.. ఏపీఎస్ఆర్టీసీ సంచలన నిర్ణయం.. ఏంటో తెలుసా?

Dussehra 2022: ప్రయాణికులకు పండుగ ఆఫర్.. ఏపీఎస్ఆర్టీసీ సంచలన నిర్ణయం.. ఏంటో తెలుసా?

ఏపీ ప్రజలకు ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్

ఏపీ ప్రజలకు ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్

Dusshera 2022: ఏపీలో ప్రయాణికులకు ఆర్టీసీ దసరా పండుగ ఆఫర్ ప్రకటించింది. గతానికి భిన్నంగా సంప్రదాయాన్ని ఈ సారి పక్కన పెట్టింది. ప్రయాణికుల సౌకర్యం కోసం కేవలం ప్రత్యేక బస్సులు నడపడమే కాదు.. అదనపు ఛార్జీలను విరమించుకుంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Anand Mohan Pudipeddi, Visakhapatnam, News18.

  Dusshera 2022: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఆర్టీసీ ప్రయాణీకులకు శుభవార్త. దసరా పండుగ (Dusshera Special) స్పెషల్‌ పేరుతో అదనపు చార్జీల సంప్రదాయాన్ని ఈసారి ఆర్టీసీ విరమించుకుంది. గత రెండేళ్లు కరోనా ప్రభావంతో పండుగను ఎక్కువమంది జరపుకోలేకపోయారు. ప్రయాణాలు కూడా తగ్గాయి. ఈ సారి భారీగా ప్రజలకు సొంతూళ్లకు వెళ్లే అవకాశం ఉంది. దీంతో రద్దీ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీనిలో భాగంగా దసరాకు ఆర్టీసీ 4,500 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఈ నెల 29 నుంచి అక్టోబర్‌ 7వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులోకి తీసుకొస్తోంది. అయితే గతంలో ఉన్న అదనపు ఛార్జీలను రద్దు చేసినట్లు ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు చెప్పారు. సాధారణ రేట్లకే ప్రత్యేక సర్వీసులు (Special Services) నడుపుతున్నందున ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గతంలో పండుగలొస్తే ప్రత్యేక బస్సుల్లో ఆర్టీసీ 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తుందనే ప్రచారంతో సంస్థకు తీరని నష్టం జరుగుతోందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఆదాయం కంటే ప్రయాణికుల సేవే ముఖ్యమని భావించి సాధారణ ఛార్జీలనే వసూలు చేయనున్నామన్నారు.

  మరోవైపు దసరా పేరుతో.. ఇప్పటికే ప్రైవేటు ట్రావెల్స్‌ నిర్వహకులు భారీగా ఛార్జీలు పెంచినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. కానీ ఆర్టీసీలో అదనపు ఛార్జీలు లేవని.. అన్నిటికన్నా ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా ప్రయాణం చేయాలని కోరారు. ప్రత్యేక బస్సుల్లో చిల్లర సమస్య తలెత్తకుండా ఈ-పోస్‌ను అందుబాటులో పెడుతున్నామన్నారు. ఇదే సమయంలో నిరంతరం పని చేసే విధంగా 0866-2570005 కాల్‌ సెంటర్‌, జీపీఎస్‌ ట్రాకింగ్‌ ద్వారా ప్రయాణికులకు సమచారం అందిస్తాయని ప్రకటించారు.

  అలాగే విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రులు, తిరుమలలో టీటీడీ బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకొని ప్రయాణి కులకు అసౌకర్యం లేని విధంగా ముందస్తు ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 పట్టణాలతో పాటు హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నై నుంచి కూడా అదనపు సర్వీసులు నడపాలని నిర్ణయించారు. దసరా పండుగకు ముందు 2,100 బస్సులు, తిరుగు ప్రయాణంలో 2,400 బస్సులు అదనంగా అందుబాటులో ఉంచామన్నారు.

  ఇదీ చదవండి : పేదలు, సామాన్యులకు బిగ్ షాక్.. ఇక అన్నం గురించి మరిచిపోవాల్సిందేనా..?

  గతంలో ఓ వైపు వంద శాతం ఆక్యుపెన్సీ, మరోవైపు జీరో ఆక్యుపెన్సీని దృష్టిలో ఉంచుకొని 50 శాతం ఛార్జీలు అదనంగా వసూలు చేసేవారని తెలిపారు. ఆదాయం అటుంచి ఆ ప్రచారంతో సంస్థకు భారీ నష్టం చేకూరుతున్న నేపధ్యంలో ప్రస్తుతానికి అదనపు ఛార్జీలను వసూలు చేయడం లేదని ప్రకటించారు. కానీ భవిష్యత్‌లో ఈ తరహా నిర్వహణ కష్టమైతే ఆయా పరిస్థితులను సమీక్షించి నిర్ణయం మార్చుకుంటామని ఆయన పేర్కొన్నారు.

  ఇదీ చదవండి : ఫ్లూటు బాబు ముందు ఊదు.. జగన్ ముందు కాదు.. అక్కడ ఉన్నది జ"గన్".. రోజా సంచలన వ్యాఖ్యలు

  ముఖ్యంగా ఈసారి ప్రయాణికులకు చిల్లర సమస్య ఎదురు కాకుండా బస్సుల్లో ఈ-పోస్‌ యంత్రాలు అందుబాటులో ఉంచామని, క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల స్వైపింగ్‌తో పాటు ఫోన్‌ పే, గూగుల్‌ పే క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి టిక్కెట్లు పొందొచ్చని తెలిపారు. అలాగే ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా దసరా నుంచి స్టార్‌ లైనర్‌ నాన్‌ ఏసీ స్లీపర్‌ బస్సులను అందుబాటులోకి తేనున్నామని తిరుమలరావు పేర్కొన్నారు. రద్దీ రూట్లలో 62 బస్సులు ప్రవేశ పెడుతున్నామని చెప్పారు. అవసరాన్ని బట్టి భవిష్యత్‌లో మరిన్ని స్టార్‌ లైనర్‌ సర్వీసులు పెంచనున్నట్లు తెలిపారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Apsrtc, Dussehra 2022, Vizag

  ఉత్తమ కథలు