Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM VERY FAMOUS TEMPLE IN VISAKHAPATNAM BRAHMALINGESHWARA THIS IS THE HISTORY NGS VSJ NJ

Vizag : సాక్షాత్తూ బ్రహ్మ ప్రతిష్టించిన శివలింగం.. ఎక్కడ ఉంది.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా? ఉందంటే..?

బ్రహ్మ

బ్రహ్మ ప్రతిష్టించిన శివలింగం

భారత దేశంలో ఎన్నో ఏళ్ల చరిత్రకలిగిన ప్రముఖ దేవాలయాలలో బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి. ఆ ఆయలం బ్రహ్మచే ప్రతిష్టింపబడిన శివలింగం కలిగిన ఆలయం. అందువల్ల ఈ ఆలయం చారిత్రక ప్రసిద్ధి చెందింది...ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుందంటే..?

  setti Jagadeesh, News 18, Visakhaptnam

  Famous Temple in Visakhapatnam:  భారత దేశంలో ఎన్నో ప్రముఖ పుణ్యక్షేత్రాలు.. ఆలయాలు ఉన్నాయి. ఒక్కో హిందూ దేవలాయానికి ఒక్కో చరిత్ర.. ఇంకా ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఆయ ఆలయాల్లో భక్తుల నమ్మకాలు కూడా వేరువేరుగా ఉంటాయి. అయితే కొన్ని ఆలయాలకు ఎంతో చరిత్ర ఉన్నా.. అంత ప్రాముఖ్యమైనవి అయినా.. మిగిలిన వాటికి ఉన్న గుర్తింపు రావడం లేదు. అలాంటి ఆలయాల్లో ఒకటి విశాఖపట్నం జిల్లాలో ఉంది. అలా ఏళ్ల చరిత్ర కలిగిన ప్రముఖ దేవాలయాలలో బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి. ఆ ఆయలం ప్రత్యేకత ఏంటంటే.. అక్కడి శివలింగాన్ని స్వయంగా బ్రహ్మే ప్రతిష్టించాడని చెబుతారు. అందుకే ఈ ఆలయం చారిత్రక ప్రసిద్ధి చెందింది. బ్రహ్మలింగేశ్వర ఆలయం విశాఖ జిల్లా నర్సీపట్నానికి మూడు కిలోమీటర్ల దూరంలోని బలిఘట్టంలో ఉంది. ఈ దేవాలయం అతి పురాతనమైనది. కృతయుగంలో రాక్షస రాజైన 'బలిచక్రవర్తి' అనేక యజ్ఞ యాగాదులు చేసినట్టు పురాణములు చెబుతున్నాయి. ఈశ్వరుడు పశ్చిమ ముఖంగా ఉండి పక్కన ఉన్న వరహానది ఉత్తరంగా ప్రవహించడంతో దక్షిణకాశీగా ఈ క్షేత్రంగా కూడా గుర్తింపు పొందింది.

  ఆలయ స్థల పురాణం
  లోక కళ్యాణార్ధం తలపెట్టిన యజ్ఞానికి శివారాధన నిమిత్తం బలిచక్రవర్తి బ్రహ్మను ప్రార్ధించి శివలింగాన్ని భువికి రప్పించారు. ఈ కొండ మీద బలిచక్రవర్తి తన ఇష్ట దైవమైన పరమేశ్వరుని ప్రతిష్టించ తలపెట్టి... సృష్టి విధాత అయిన బ్రహ్మ గురించి తపస్సు చేస్తాడు.  బలిచక్రవర్తి తపస్సుకు మెచ్చి సాక్షాత్తూ ఆ బ్రహ్మదేవుడే వచ్చి శివలింగ ప్రతిష్ట చేశారని పూర్వీకులు చెప్పిన మాట.   బ్రహ్మ ప్రతిష్టించడంతో  శ్రీ స్వామి వారికి  బ్రహ్మలింగేశ్వర స్వామి  అనే పేరు వచ్చింది. ఈ పర్వత శ్రేణిలోని మూడు పర్వతము త్రిశూల ఆకృతిలో వరుసగా ఉంటాయి. శివలింగాన్ని త్రిశూల పర్వతములకు అభిముఖముగా అంటే పశ్చిమ ముఖముగా ప్రతిష్టించారు.


  సహజ సిద్ధమైన విభూతి గనులు…!
  బలిచక్రవర్తి యజ్ఞ్నము చేసినట్లు ఆధారంగా ఇక్కడ సహజ సిద్ధమైన విభూతి గనులు కలవు. ఇవి ఆనాటి హోమ గుండములుగా చెబుతుంటారు. బలిచక్రవర్తి యజ్ఞము చేసిన ప్రాంతము కావడంతో బలిఘట్ట అను గ్రామము ఈ పర్వత ప్రాంతములో ఏర్పడినది. ఘటము అనగా యజ్ఞం.

  ఇదీ చదవండి : వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభం.. 30 ఏళ్ల పాటు రాబడి..? ఇంకా ప్రయోజనాలు ఎన్నో
  వరాహా నది
  ఆలయానికి సమీపంలో వరహానది ఉత్తర వాహినిగా పేరుపొంది విష్ణుదేవుని ప్రసాదంగా వినుతి కెక్కింది. హిరాణ్యాక్షుని వెంటాడుతూ విష్ణువు వరాహారూపంలో భూమిని చేరుకుని పయనించడం వల్ల ఆ సమయంలో బలిచక్రవర్తి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రసాదించిన శివలింగానికి అభిషేకం నిమిత్తం నీరు కావాలని విష్ణుమూర్తిని కోరగా వరాహా రూపంలో ఉన్న విష్ణు ఈ మార్గం గుండా నదిని ఏర్పరడటంతో వరహానదిగా పేరుగాంచినట్లు చెబుతున్నారు.

  ఇదీ చదవండి : వేసవిలో సైతం చల్లని ఆహ్లాదాన్ని పంచే ప్రాంతం.. విశాఖ మణిహారమైన కైలాసగిరికి మరో పేరు ఉందని తెలుసా..?

  దక్షిణ కాశీగా పేరు ఎలా వచ్చింది?
  ఇక్కడ వరాహి నది ఉత్తర దిక్కుగా ప్రవహించడంతో ఉత్తరవాహినిగానూ.. ఇక్కడ శివలింగం పశ్చిమ ముఖంగానూ ఉండటం వల్ల ఈ ప్రాంతం దక్షిణ కాశీగానూ చరిత్రలో నిలిచింది. ఉత్తర భారతదేశములో కాశీ (వారణాసి) శ్రీ విశ్వశ్వరస్వామి వారి ఆలయంలోలాగే ఇక్కడ కూడా శివుడు పశ్చిమాభిముఖముగా ఉన్నందున బలిఘట్నం ఆలయాం దక్షిణ కాశీగా పేరుగాంచినది. ఇచ్చలు శివలింగము స్పటిక శిలతో ఉండటం వల్ల స్వామి బహు శోభాయమానంగా కనబడుతుంది.

  ఇదీ చదవండి : ఏయూలో గిరిజన జాతర.. ఆకట్టుకున్న సంప్రదాయ నృత్యాలు.. ప్రత్యేకత ఏంటంటే?

  కార్తీక మాసంలో ప్రత్యేక రోజులు
  మహాశివరాత్రి మూడు రోజుల పాటు ఆలయంలో శివునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. అలాగే రుద్రాభిషేకాలు, ఏకవారాభిషేకాలు కూడా నిర్వహిస్తారు. ఈ శివలింగానికి ప్రతి సోమవారం భక్తులు వచ్చి అభిషేకాలు చేయించుకుంటారు. అలాగే ప్రతీ ఏటా కార్తీమాసంతో పాటు మహాశివరాత్రి పర్వదినాన పూజా కార్యక్రమాలు అత్యంత ఘనంగా జరుపుతుంటారు. శ్రీ బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీరాజరాజేశ్వరి అమ్మవారు, శ్రీ గణపతి, నందశ్వరుడు, ద్వారపాలకులు, చండీశ్వరుడు, క్షేత్రపాలకుడు కలరు. కార్తీక శుద్ధ ఏకాదశినాడు శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి వారికి శ్రీ రాజరాజేశ్వరి అమ్మ వారికి కళ్యాణోత్సవము నిర్వహిస్తారు. ఆ తర్వాత తిరువీధి ఉత్సవము జరుపుతారు.

  ఇదీ చదవండి : సాగర తీరంలో సాగర కన్యలు...సెల్పీలతో టూరిస్టుల సందడి.. ప్రత్యేకత ఏంటంటే?

  వాహినిలో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలుగుతాయ్‌..!
  ఆయా పర్వదినాల్లో లక్షలాదిమంది ఉత్సవాల్లో భక్తులతో కోలాహలంగా ఉంటుంది. జిల్లాలోని ఇతర దూర ప్రాంతాల నుండి సైతం లక్షలాదిమంది భక్తులు బ్రహ్మలింగేశ్వరస్వామిని దర్శించుకుని పునీతులవుతారు. ఉత్తర వాహినిలో స్నానం ఆచరించడం సర్వ పాప పరిహారంగా భక్తులు భావిస్తారు.

  ఇదీ చదవండి : పిల్లలు ఫోన్‌ వదలడం లేదా..? బుక్ పట్టుకోవాలంటే చిరాకు పడుతున్నారా? అయితే అక్కడకు తీసుకెళ్లండి..

  బ్రహ్మలింగేశ్వరస్వామికి అభిషేకాలు
  ఈ దేవాలయాన్ని దేవాదాయ శాఖ ఆధీనంలోనే కొనసాగుతుంది. దేవాలయానికి గల ఆస్తులతోనే నిత్య ధూప, దీప, నైవేధ్యాలను సమకూర్చుతున్నారు. ఇక్కడకు వచ్చే భక్తులు తమకు తోచిన రీతిలో కానుకలు సమర్పించుకుంటారు. బ్రహ్మలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు రుద్రాభిషేకాలు, ఏకవారాభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.

  ఇదీ చదవండి : సలామ్ రాఖీ.. పోలీసు డాగ్ కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియులు.. ఎంత సేవ చేసిందంటే?

  ఆలయ నిర్మాణ శైలి
  బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయం పూర్తిగా రాతితోనే నిర్మితమైంది. రాతి స్తంభాలు , పై కప్పులు సైతం రాతితోనే నిర్మించారు. వేల సంవత్సరాల క్రితమే ఈ దేవాలయం పూర్తి స్థాయిలో నిర్మితమైనట్లు స్థానికులు చెబుతుంటారు. ఈ దేవాలయములో అన్ని మండపములు మొత్తం 108 స్థంభములతో నిర్మించబడినవి. ఈ స్తంభాలు అన్ని ఒక్కొక్కటి ఒక్కో తీరుగా అద్భుతంగా మలిచారు శిల్పులు. ప్రస్తుతము ఈ దేవాలయం దేవాదాయ, ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఉంది.


  టైమింగ్స్‌: భక్తుల సందర్శనార్థం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరిచి ఉంటుంది. తిరిగి సాయంత్రం 4:30 నుంచి రాత్రి 07:30 వరకు ఆలయం తెరిచే ఉంటుంది. సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ సమయంలో ఈ ఆలయానికి వెళ్తే..అటు స్వామి దర్శనంతో పాటు ప్రకృతి కూడా రమణీయంగా ఉంటుంది.
  అడ్రస్‌: బలిఘట్టం, నర్సీపట్నం, విశాఖపట్నం జిల్లా ఆంధ్రప్రదేశ్‌ - 531116

  ఫోన్‌ నెంబర్‌ : +91 98494 71850

  ఇదీ చదవండి : అలలపై కలల జర్నీ.. తక్కువ ఖర్చుతో ఫైవ్ స్టార్ రేంజ్ లగ్జరీ ప్రయాణం.. ధర ఎంతంటే?
  ఎలా వెళ్లాలి?
  విశాఖపట్నం నుంచి 75కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. రోడ్డు మార్గం ద్వారా వెళ్లొచ్చు. బలిఘట్టానికి రైలు మార్గం లేదు. విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ వరకు వెళ్లి అక్కడ నుంచి రోడ్డుమార్గం ద్వారా వెళ్లాల్సిందే..
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Local News, Vizag

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు