హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag: ఏడాదికోసారి మాత్రమే దర్శన భాగ్యం..! అందుకే అస్సలు మిస్‌ కావద్దు..!

Vizag: ఏడాదికోసారి మాత్రమే దర్శన భాగ్యం..! అందుకే అస్సలు మిస్‌ కావద్దు..!

Vizag:

Vizag: ఏడాదికోసారి మాత్రమే కలిగే దర్శన భాగ్యం..! అస్సలు మిస్‌ కావద్దు..!

Vizag: విశాఖపట్నంలో కొలువైన శ్రీ కనక మహాలక్ష్మీ అమ్మవారు ఆలయం విజయదశమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుండి విశాఖ వాసులే కాకుండా వివిధ జిల్లాల నుండి భక్తుల తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ప్రత్యేకత ఏంటంటే?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Setti Jagadeesh, News 18, Visakhapatnam.

  విశాఖపట్నం (Visakhapatnam) లో కొలువైన శ్రీకనక మహాలక్ష్మీ (Srikanaka Maha Laxmi ) అమ్మవారు ఆలయం విజయదశమి (Vijaya Dasami) సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతుంది. తెల్లవారుజాము నుండి విశాఖ వాసులే కాకుండా వివిధ జిల్లాల నుండి భక్తుల తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ రోజు స్వర్ణ అలంకరణలో భక్తులకు అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. విజయదశమి సందర్భంగా అమ్మవారికి బంగారు ఆభరణాలు ధరించి, బంగారు పువ్వులతో పూజలు చేశారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ దర్శనం కలవడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

  విశాఖలో కొలువైన ఈ శ్రీ కనక మహాలక్ష్మీ అమ్మవారికి ఓ ప్రత్యేకత ఉంది. ఇతర ఆలయాల తరహాలో ఈ ఆలయానికి పైకప్పు గానీ, గోపురం గానీ ఏమి ఉండదు. ఇక్కడ అమ్మవారికి వామ హస్తం (ఎడమ చేయి) కూడా ఉండదు. ఈ ఆలయంలోని గర్భాలయంలోకి వెళ్లి భక్తులు నేరుగా అమ్మవారికి పూజలు అర్పించవచ్చు.

  ఆలయ చరిత్ర..!

  విశాఖపట్నంలో ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ఏలిన విశాఖ రాజుల బురుజులో ఈ అమ్మవారి ఆలయం ఉండేదని, శత్రువుల దాడి సమయంలో అమ్మవారి విగ్రహాన్ని సమీపంలోని బావిలో పాడేసి ఆ రాజు అమ్మవారిని రక్షించారని పెద్దలు చెబుతారు. ఇక్కడ బావిలో ఉన్న అమ్మవారు భక్తులకు కలలో ప్రత్యక్షమై.. తనను బావి నుంచి బయటకు తీసి తమ ఆలయం ఎలాంటి పైకప్పు, తలుపులు లేకుండా ప్రతిష్టించాలని కోరడం వల్లే ఈ ఆలయానికి పైకప్పు నిర్మించలేదని పెద్దలు మాట.

  ఇదీ చదవండి : ఆ ఆలయంలో కొబ్బరికాయ కొట్టకూడదు..? ఏం చేస్తారో తెలుసా..?

  మరో కథనం ప్రకారం.. ఓ బ్రాహ్మనుడు కాశీకి వెళ్తూ విశాఖ తీరం మీదుగా వన్ టౌన్‌లో గల బురుజుపేటకు చేరుకుంటాడు. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉన్న బావిలో స్నానమాచరించి సేద తీరుతాడు. ఆ సమయంలో అక్కడ అమ్మవారు ప్రత్యక్షమై.. తాను ఇక్కడ కలియుగంలో భక్తుల కోర్కెలను తీర్చేందుకు అవతరించానని, తన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్టించాలని అమ్మవారు కోరుతుంది.

  ఇదీ చదవండి : కనకదుర్గమ్మ సన్నిధిలో చంద్రబాబు , బాలయ్య.. అమరావతికి అమ్మవారి అండ..

  అయితే, ఆ బ్రాహ్మణుడు తాను కాశీకి వెళ్తున్నానని, మన్నించాలని బ్రతుమిలాడుకుంటాడు. దీంతో ఆగ్రహానికి గురైన కనక మహాలక్ష్మీ అమ్మవారు తన వామ హస్తంలోని పరిగ అనే ఆయుధంతో బ్రాహ్మణుడిని సంహరించేందుకు సిద్ధమవుతుంది. దీంతో బ్రాహ్మణుడు అక్కడే శివుడిని ప్రార్థిస్తాడు. అక్కడ జరగబోతున్న ప్రమాదాన్ని గ్రహించిన శివుడు.. అమ్మవారి వామ హస్తాన్ని మోచేతిపై వరకు ఖండిచి, అమ్మవారిని శాంతిపజేశాడట. అనంతరం ఇక్కడ అమ్మవారు ఇకపై కనక మహాలక్ష్మీగా భక్తులను అనుగ్రహించాలని ఆదేశిస్తాడు. అందుకే, ఈ ఆలయంలో కనక మహాలక్ష్మీ అమ్మవారికి వామహస్తం ఉండదు అని ప్రతీతి.

  ఇదీ చదవండి : అన్నయ్య మాటలతో తమ్ముళ్లకు బూస్ట్.. పగ్గాలు చేపట్టి తీరుతామంటున్న మెగా బ్రదర్

  మార్గశిర మాసం గురువారాలలో, వరలక్ష్మీ వ్రతం, దసర పండుగల సమయంలో ఇక్కడ అధిక సంఖ్యలో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడ సాక్షాత్తు కనక మహాలక్ష్మి అమ్మవారు స్వయంభూగా వెలిసిందని భక్తులు అపారంగా నమ్ముతారు.

  అడ్రస్‌ : బురుజుపేట, చెంగల్‌ రావు పేట, పోర్ట్‌ ఏరియా, విశాఖపట్నం , ఆంధ్రప్రదేశ్‌- 530001

  ఎలా వెళ్లాలి: విశాఖపట్నం బస్ కాంప్లెక్స్‌ నుంచి పూర్ణ మార్కెట్‌కి చేరుకోవాలి. అక్కడ అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది. అక్కడకు చేరుకునేందుకు బస్సు, ఆటో సౌకర్యం ఉంటుంది.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Dussehra 2022, Local News, Visakhapatnam

  ఉత్తమ కథలు