Setti Jagadeesh, News 18, Visakhapatnam
భారత దేశంలో ఎంతో ప్రాముఖ్యం కలిగిన నారసింహ పుణ్యక్షేత్రాల్లో అతి ప్రాచీనమైనది విశాఖపట్నం (Visakhaptanm) జిల్లాలోని సింహాచలం క్షేత్రం (Simhachalam Temple). శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం.. విశాఖపట్నానికి సమీపంలోని 11 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమలలో ఉన్న పర్వత శ్రేణి పై హిందూ పుణ్యక్షేత్రము వుంది. శ్రీ లక్ష్మీనరసింహస్వామిని భక్తులు సింహాద్రి అప్పన్నగా పిలుస్తూ కొలుచుకుంటారు. సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో ఈ ఏడాది శ్రీ లక్ష్మీ నరసింహ దీక్షలు సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆ మేరకు దీక్షధారణకు సంబంధించిన వివరాలను ఆలయ స్థానా చార్యులు టి.పి. రాజగోపాల్ వెల్లడించారు.
మార్గశిర శుద్ధ విదియను పురస్కరించుకుని ఈ నెల 25వ తేదీన మండల దీక్షతో మాలధారణలు ప్రారంభమవుతాయని తెలిపారు. 32రోజుల దీక్షలు డిసెంబరు 3వ తేదీ నుంచి ఆరంభమవుతాయని వివరించారు. ఈ రెండు దీక్షలు స్వామివారి మాస జయంతిని పురస్కరించుకుని జనవరి 5న పుష్య శుద్ధ చతుర్దశి రోజున విరమించడం జరుగుతుందని తెలియజేశారు.
నేటి నుంచి సింహగిరిపై శ్రీ లక్ష్మీనరసింహస్వామి మండపంలో భక్తులకు మాలధారణ జరుగుతుందన్నారు. జనవరి 5న ఆలయ కల్యాణ మండపంలో తెల్లవారు జామున 5గంటలకు శ్రీ లక్ష్మీనరసింహ హోమం, 9. 30 గంటలకు శాంతి కల్యాణం జరుగుతాయని వివరించారు.
ఇదీ చదండి : సీఎం వైఎస్ఆర్ ఆదేశాలను కిరణ్ కుమార్ రెడ్డి తిరస్కరించారా..? ఆ రోజు ఏం జరిగింది అంటే?
మాల విసర్జన సరికాదు..
శ్రీ లక్ష్మీ నరసింహ దీక్షలు చేపట్టిన భక్తులు మాల విసర్జన చేయడం సరికాదని స్థానా చార్యులు రాజగోపాల్ తెలిపారు. దీక్షలు పూర్తయిన తరువాత భక్తులు తులసి మాలలను విసర్జించకుండా తమ వెంటే ఉంచుకో వాలని సూచించారు. ఆ మాలను పవిత్రంగా ఎప్పుడైనా ధారణ చేయవచ్చని సూచించారు. నిత్య ధారణ చేయలేని వారు పూజ సమయంలోనైనా ధరించి మిగిలిన రోజుల్లో పూజా మందిరంలో భద్రపరచుకోవచ్చన్నారు.
ఇదీ చదండి: తిరుచానూరుకు చేరిన లక్ష్మీకాసులహారం.. వైభవంగా అమ్మవారి వసంతోత్సవం
తిరుముడి సంప్రదాయం లేదు...
శ్రీ లక్ష్మీ నరసింహ దీక్షల్లో భాగంగా భక్తులు అనుసరిస్తున్న తిరుముడి సంప్రదాయం అప్పన్న ఆలయంలో లేదని స్థానాచార్యులు రాజగోపాల్ పేర్కొన్నారు. తిరుముడికి బదులు స్వామికి ప్రీతిపాత్రమైన శీతలాన్ని. (పంచదార పానకం) సమర్పించుకోవచ్చని పేర్కొన్నారు. దీక్ష చేపట్టనున్న భక్తులకు దేవస్థానం ఉచితంగా తులసి మాలలు సమ కూర్చుతుందని ఆయన వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Local News, Visakhapatnam