Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM VERY FAMOUS BELLAM VINAYAKA TEMPLE IN VISAKHAPATNAM ABH BRV VSJ

Visakhapatnam: బెల్లం వినాయకుడుని ఎప్పుడైనా దర్శించుకున్నారా: బెల్లమే నైవేద్యంగా స్వీకరించే గణనాధుడు

విశాఖ

విశాఖ నగరం కొత్త జాలరిపేటలో వెలసిన బెల్లం వినాయకుడు

పత్రం, ఫలం అంటూ అనేక రకాల నైవేద్యాలతో, ఎన్నో రూపాల్లో పూజలందుకుంటాడు విగ్నేశ్వరుడు. భక్తులు భక్తితో సమర్పించే గడ్డి పరకైనా తాను ఆనందంతో స్వీకరిస్తాడు ఆ గణనాధుడు. అటువంటి గణపయ్యకు ఇక్కడి భక్తులు మాత్రం కేవలం బెల్లంను నైవేద్యంగా సమర్పిస్తుంటారు

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India
    (Setti Jagadesh, News 18, visakapatnam}

    పత్రం, ఫలం అంటూ అనేక రకాల నైవేద్యాలతో, ఎన్నో రూపాల్లో పూజలందుకుంటాడు విగ్నేశ్వరుడు. భక్తులు భక్తితో సమర్పించే గడ్డి పరకైనా తాను ఆనందంతో స్వీకరిస్తాడు ఆ గణనాధుడు. అటువంటి గణపయ్యకు ఇక్కడి భక్తులు మాత్రం కేవలం బెల్లంను నైవేద్యంగా సమర్పిస్తుంటారు. పురాణాల ప్రకారం సాక్షాత్తు చంద్రుడు ప్రతిష్టించినట్లుగా చెప్పుకునే ఈ గణపయ్య దేవాలయం విశాఖ నగరం నడిబొడ్డున ఉంది. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే వినాయకుడికి చెరుకు అంటే చాలా ఇష్టం. అందుకే చెరుకుతో తయారుచేసిన బెల్లంను ఇక్కడ నైవేద్యంగా సమర్పిస్తారు. అందుకే ఈ గణనాథుడిని బెల్లం వినాయకుడు అని కూడా పిలుస్తారు.

    ఈ బెల్లం గణపయ్య ఆలయం గురించి విశాఖ జిల్లా వాసులకు తెలుసు. వినాయకుడి విగ్రహాలు అన్ని ఒకలా ఉంటే, ఇక్కడి బెల్లం వినాయకుడు మాత్రం ప్రత్యేకంగా ఉంటాడు. విశాఖపట్నం కొత్త జాలరి పేటలో వెలసిన ఈ బెల్లం వినాయకుడి ఆలయానికి విశిష్టమైన చరిత్ర ఉంది. ఈ వినాయకుడి విగ్రహాన్ని స్వయంగా చంద్రుడు ప్రతిష్టించాడని చెబుతారు. ఈ విగ్రహం అన్ని రూపాలకన్నా భిన్నంగా ఉంటుంది. స్వామివారి తొండం ఇక్కడ కుడివైపు తిరిగి ఉంటుంది. ఈ బెల్లం వినాయక స్వామిని దర్శించుకుంటే ఆనందాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఈ బెల్లం గణపతిని అంతా ఆనంద గణపతి అని పిలుస్తారు.

    ఈ గణనాథుడు కేరళ తరహాలో తాంత్రిక పూజలందుకుంటాడని పూజారులు చెబుతున్నారు. ఆనంద గణపతి పక్కనే రామలింగేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. వినాయక పండగ సమయాల్లో నవరాత్రుల్లోనే కాదు, ప్రతి బుధవారం నాడు స్థానికులు, భక్తులు బెల్లం సమర్పిస్తారు. అందుకే దేవాలయం చుట్టూ బెల్లం అమ్మే వర్తకులు ఉంటారు. ఈ దేవాలయాన్ని 11వ శతాబ్దలంలో చోళరాజులు కట్టినట్లుగా చరిత్ర చెబుతోంది. ఈ దేవాలయానికి ఎదురుగా సముద్రం ఉంటుంది. ఈ సముద్ర గర్భంలో వైశాఖేశ్వరుడు పేరుతో ఉన్న ఈశ్వరుడ్ని దేవతలు ప్రతిష్టాంచారని పురాణాలు చెబుతున్నాయి. ఈశ్వరుడ్ని దేవతులు నిత్యం పూజించేవారట. కాలక్రమంలో సముద్రం ముందుకు చొచ్చుకురావటంతో వైఖాశేశ్వరుడి దేవాలయం సముద్రంలో కలిసిపోయింది. దీంతో చంద్రుడు ఎంతో వేదన చెంది శివుడి గురించి ఘోర తపస్సు చేయగా..శివుడు ప్రత్యక్ష్యమయ్యాడట. అప్పుడు చంద్రుడు శివుడిని 'అయ్యా..నీ దేవాలయం సముద్రంలో కలిసిపోయింది..కాబట్టి నువ్వు ఇక్కడ వెలిసి భక్తులతో పూజలందుకోవాలని' కోరాడట. దీంతో శివుడు...ఇక్కడే ఉన్న వినాయకుడి దేవాలయం వద్ద స్వయంభూవుగా వెలవగా.. శివుడికి గుడి కట్టిన చంద్రుడు... ఆయన కుమారుడైన వినాయకుడికి కూడా దేవాలయాన్ని నిర్మించాడట.

    ఈ గణపతికి ప్రసాదంగా బెల్లం పెడతారు. ఉదయం 6 నుంచి 11.30 వరకు, తిరిగి సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ఆలయం తెరిచి ఉంటుంది. విశాఖ నగరంతో పాటు సమీప ప్రాంతాల ప్రజలు స్వామి వారిని దర్శించుకునేందుకు వస్తుంటారు.



    ఎలా వెళ్లాలి .. విశాఖపట్నం ఆర్.టి.సి కాంప్లెక్స్ నుండి కె.జి.హెచ్ వద్దకు చేరుకోవాలి. అక్కడ నుండి 100 మీటర్లు దూరంలో కొత్త జాలరి పేట ఉంటుంది. స్థానికులను అడిగి వినాయక గుడికి చేరుకోవచ్చు. Adress: P834 QX5, కొత్త అగ్రహారం, కృష్ణ నగర్, జాలరి పేట, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ 530001, దేవాలయం టైమింగ్స్: ఉదయం 6:00 గం. నుండి 11:30 వరకు, సాయింత్రం 5:00 గంల నుండి రాత్రి 8:00 గం. వరకు.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Devotional, Local News, Visakhapatnam, Vizag

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు