Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM VERY DANGEROUS FISH IN EAST GODAVARI DISTRICT THAT FISH HAD POISON ITS KILLS MAN NGS

Rare Fish: ఇలాంటి చేపను ఎప్పుడైనా చూశారా..? మనిషాలగే ఉండి మనిషి ప్రాణం తీస్తుంది

ఈ చేప మహా డేంజర్

ఈ చేప మహా డేంజర్

Rare Fish: అప్పుడప్పుడు కొన్ని చేపలు మత్స్యాకారుల జీవితాన్నే మార్చుస్తుంటాయి.. కొన్ని కాసుల పంట పండిస్తాయి.. మరి కొన్ని భయపెడతాయి.. ఇటీవల ఓ చేపపై హత్యా కేసు కూడా నమోదైంది.. తాజాగా మరో అరుదైన చేప.. వార్తల్లో నిలిచింది.

    Rare Fish: సముద్రంపై ఆధారపడి జీవిస్తుంటారు మత్స్యకారు. రోజుల తరబడి సముద్రంలో వేటసాగిస్తే వారికి అరకొర ఆదాయమే దక్కుతుంటుంది. ఒక్కోసారి వలకు అధృష్టం కూడా చిక్కుతుంటుంది. సాధారణంగా మత్స్యకారులు (Fisherman) చాలామంది ప్రాణాలకు తెగించి వేట కొనసాగిస్తారు. ఒక్కోసారి చేపలు చిక్కక.. దొరికిన వాటికి సరైన ధర పలుకకా పస్తులు ఉండే రోజులు కూడా ఉంటాయి. అయితే కొంతమందికి మాత్రం అప్పుడడప్పుడూ లక్ ఫేవర్ చేస్తుంటుంది. చాలా అరుదైన చేప (Fish)లు వారి వలకు చిక్కి.. భారీ ధర పలికేలా చేస్తాయి. ఇటీవల కాలంలో మత్స్యకారులకు పంట పండిస్తున్నాయి. కొన్ని అరుదైన చేపలు అప్పుడప్పుడు మత్య్సకారులకు దొరికి.. ఆశ్చర్యపరుస్తుంటాయి. పైగా ఇవి భారీ రేటు పలుకుతుండడంతో జాలర్లకు కాసుల వర్షం కురుస్తోంది.

    ఇప్పటి వరకు దొరికిన చేపలు ఓ లెక్క.. ఈ చేప మరో లెక్క.. చూడ్డానికి భయనకంగా, రాక్షసంగా ఉంది కదూ..! మనిషి ఆకారంలో ఉంది.. కానీ ఈ చేప నిజంగానే చాలా డేంజర్.. మనిషి మోమును పోలిన రూపంతో కనిపిస్తున్నఈ చేపను బొంక చేపని పిలుస్తారు. బెలూన్ ఫిష్, పఫర్ ఫిష్, గ్లోబ్ ఫిష్ అంటూ రకరకాల పేర్లతో పిలుస్తారు. నార్మల్‌గా నీటిలో ఉన్నప్పుడు మామూలు చేపలానే ఉంటుంది. కానీ ఎవరైనా పట్టుకున్నా, ప్రమాద సంకేతాలు కనిపించినా గాలి పీల్చుకుని బంతిలా ఉబ్బుతుంది. కేవలం కనిపించడమే కాదు.. ఇది చాలా ప్రమాదకరమైన చేప అని మత్స్యకారులు చెబుతున్నారు.



    తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో ఈ అరుదైన చేప మత్స్యకారుల వలకు చిక్కింది. ఉప్పలగుప్తం మండలంలోని వాసాలతిప్ప దగ్గర జాలర్లు చేపల వేటకు వెళ్లగా.. ఈ బొంక చేప వలలో పడింది. దీని గురించి ఉప్పలగుప్తం మత్స్యశాఖాధికారి వివరిస్తూ.. టెట్రాంటిడీ కుటుంబానికి చెందినదని. దీని శాస్త్రీయనామం టెట్రాడాన్ అని అన్నారు. ఇది ప్రపంచంలో రెండో విషపూరితమైన చేపని, దీనిలో విషం మనిషిని చంపేంత ఉంటుందని తెలిపారు. అందుకే ఇలాంటి చేప ఎప్పుడైనా కనిపిస్తే కాస్త జాగ్రత్తగా ఉండండి.

    విశాఖ (Visakha) సముద్రంలో ఓ చేప (Fish).. మత్స్యకారుడ్ని హత్య చేసింది.. దీంతో మత్స్యకారుడిపై దాడి చేసిన సముద్రం చేప కొమ్ము కోనెం పై హత్య కేసు నమోదైంది. సెక్షన్ ఐపిసి 302 కేసును నమోదు చేశారు పరవాడ పోలీసులు. దీంతో మత్స్యకారుడిపై దాడి చేసిన చేపపై పోలీసులు ఏ చర్యలు తీసుకుంటారోనన్నదానిపై సర్వత్రా ఆసక్తి ఉంది. అయితే ఈ చేప చాలా డేంజర్ కూడా. మనుషుల్ని కూడా అటాక్ చేసి చంపేయగల శక్తి దీని సొంతం. ఇలాంటి చేపలు ఇప్పుడు విశాఖ సముద్ర జలాల్లో ఉన్నాయనే వార్తే మత్స్యకారులను భయపడేలా చేస్తోంది. తీరానికి ఎనభై నాటికల్ మైళ్ల దూరంలో ఈ చేప, తన సంతతితో జీవిస్తోందట.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, East Godavari Dist, Fishermen

    తదుపరి వార్తలు