Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM VERY DANGEROUS FISH FOUND IN VISAKHAPATNAM UNDER SEA NGS VSP

Dangerous Fish: సముద్ర తీరంలో వింత జీవి.. అది ఎంత డేంజరో తెలుసా?

సముద్ర తీరంలో విషపూరితమైన వింత జీవి

సముద్ర తీరంలో విషపూరితమైన వింత జీవి

Dangerous Fish: ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల వింత జీవుల టెన్షన్ పెరిగింది. ముఖ్యంగా సముద్ర గర్భంలో ఉన్న జీవులతో ప్రమాదం పొంచి ఉందనే హెచ్చరికలు అందుతున్నాయి. తాజాగా పూర్తి విషయంతో

 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam
  P Anand Mohan, Visakhapatnam, News18

  Dangerous Fish:  ఆంధ్రప్రదేశ్  (Andhra Pradesh) లో ఇటీవల వింత జీవుల భయం పెరుగుతోంది. ముఖ్యంగా సముద్ర గర్భంలో తరచూ విషాదకరమైన జీవులు కనిపిస్తుండడం కలకలం రేపుతోంది. సాధారణంగానే సముద్ర గర్భంలో ఎన్నో రకాల జీవులు ఉంటాయి. అందులో మనకు తెలిసినవి కొన్ని మాత్రమే. ఇక ఎప్పుడైనా సముద్రగర్భంలో ఏవైనా కొత్త జీవులు కనిపించాయి అంటే చాలు అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియా (Social Media)లో పెట్టడం.. ఆ కొత్త రకమైన జీవుల గురించి పరిశోధనలు జరపడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా వింత ఆకారం లో ఉన్న జీవులు ఏవైనా బయట పడితే అవి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయ్. ఈ క్రమంలోనే ఇలాంటివి చూసిన తర్వాత అటు సముద్ర గర్భం అంతుచిక్కని జీవరాశులకు నిలయంగా మారింది.

  విశాఖపట్నం (Visakhapatanam) సముద్ర తీర ప్రాంతంలో ఒక అరుదైన జీవి ఇటీవల కనిపించింది.  శాస్త్రవేత్తలు ఈ వింతైన జీవిని కనుగొన్నారు. ఇక ఈ వింత జీవిని చూసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. ఈ వింత జీవి పేరు ప్లాట్ వార్మ్. భారతదేశం తూర్పు తీరంలో ఉండే ఈ జీవి విశాఖలో తొలిసారిగా  కనిపించింది అంటున్చనారు.  దీని ఆకారం చూస్తే.. చెట్టునుంచి రాలిన ఓ ఆకులా ఉంటుంది ఇది. అందుకే ఇది జీవి అనే అనుమానమే ఎవరికీ రాదు. రక్తనాళాలు లేని ఈ జీవి లేత ముదురు నీలం రంగు మధ్యలో పొడవైన పసుపు రంగు వెన్నుతో అందరిని ఆశ్చర్యపరుస్తోంది.

  ఇదీ చదవండి : ఈ చిత్రం చూశారా? అన్ సీజన్ లో చెట్టు నిండా గుత్తులు.. గుత్తులుగా మామిడి కాయాలు.. ప్రత్యేకత ఏంటంటే?

   సాధారణంగా సముద్రతీరంలో ఆటుపోట్లు సంభవించిన సమయంలో ఇలాంటి జీవులు కనిపించడం జరగడం కామన్.  ఇక ఈ జీవి సముద్రగర్భంలో కొన్ని అరుదైన జాతులకు సంబంధించినదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  గత కొంత కాలం నుంచి కూడా ఈస్ట్ కోస్ట్ కన్జర్వేషన్ టీం ఆంధ్రప్రదేశ్ తీరంలో రెండు వారాలకు ఒకసారి మైరాన్ వాక్ చేపడుతున్నారు. ఎవరికైనా ఆసక్తి ఉంటే ప్రజలు కూడా వచ్చి పాల్గొనేందుకు అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఇలాంటి వాక్ చేపడుతున్న సమయంలో 3 సెంటీ మీటర్ల పొడవున్న ఫ్లాట్ వార్మ్ అనే వింత జీవి ని కనుగొన్నారు.  ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

  ఇదీ చదవండి : తిరుమల శ్రీవారిని కూడా వదలరా? మా వాటా మాకివ్వాల్సిందే? కేంద్రంపై విజయసాయి ఫైర్

  ఇలా ఈసీసీటీ, గ్రీన్‌ పా సంస్థలకు చెందిన మెరైన్‌ బయాలజిస్టులు ఇంటర్‌ టైడల్‌ బయోడైవర్సిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రాజెక్టులో భాగంగా విశాఖ రుషికొండ బీచ్‌లో గతేడాది జూలైలో వాక్‌ చేస్తున్నప్పుడు మూడు సెంటీమీటర్ల పొడవున్న మెరైన్‌ ఫ్లాట్‌వార్మ్‌ (సాంకేతిక నామం సూడోసెరోస్‌ గలాథీన్సిస్‌ –Pseudoceros galatheensis) కనిపించింది. ఏదైనా అరుదైన జీవి కనిపించినప్పుడు దాని గురించి సైంటిఫిక్‌ జర్నల్‌లో ప్రచురించాల్సి ఉంటుంది. ఇలా ఈ ఫ్లాట్‌వార్మ్‌ గురించి ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ క్రియేటివ్‌ రీసెర్చ్‌ థాట్‌కు పంపగా ఈ జూలై మొదటి వారంలో దీన్ని ప్రచురించింది.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Fish, Visakhapatnam

  తదుపరి వార్తలు