Anand Mohan Pudipeddi, Visakhapatnam, News18
Python: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో గిరిజన గ్రామాల్లో పరిస్థితి ఇప్పటికీ మారలేదు. పాలకులు మారుతున్నారు.. కొత్త ప్రభుత్వాలు వస్తున్నాయి. అయినా గిరిజనుల కష్టాలు వీడడం లేదు.. కొన్ని గ్రామాల్లో పరిస్థితి తెలిస్తే.. ఈ రోజుల్లోనూ అలాంటి గ్రామాలు ఉన్నాయా అని షాక్ అవ్వాల్సి వస్తుంది. అలాంటిదే విశాఖ జిల్లా (Visakha District) మాడుగుల నియోజకవర్గం లోని అవరవాడ పంచాయతీలో పశువుల బంధ ఆదివాసి గిరిజన గ్రామం .. అక్కడ ఉండేది కేవలం 20 మంది మాత్రమే.. కానీ ఆ గ్రామానికి మంచినీట సదుపాయం లేదు. ఇప్పటికీ విద్యుత్ సదుపాయం (Current Fecility) లేదు. రాత్రి వేళల్లో విష ర్పలు.. ఘోరమైన అడవుల మధ్య జీవనం సాగిస్తున్నారు. ఈ రాత్రి వేళల్లో బయటకు వెళ్లాలంటే. కాగడలు పట్టుకుని వెళ్లాలి.. అయితే ఇటీవల వారు రాత్రి అడుగు తీసి బయపెట్టాలి అంటే భయపడుతున్నారు. బయటకు వెళ్లడమే కాదు.. ఇంట్లో ఉండాలి అన్నావణుకుతున్నారు. ఎందుకో తెలుసా..?
నేడు తెల్లవారు జామున 11 గంటల సమయంలో కొండ చిలువ ఇంటి దగ్గర ప్రత్యక్షమవ్వడంతో గిరిజనులు వణికిపోతున్నారు. అడవి మధ్యలో జీవిస్తూ కనీస సౌకర్యాలు వేసుకున్న ఆదివాసి గిరిజనులు కోరుతున్నారు. జంతువుల మధ్య నిరంతరం పోరాటం చేస్తూ బతుకుతూ ఉన్న పరిస్థితి. నేటికీ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా.. ఈ గ్రామానికి కరెంట్ సౌకర్యం రోడ్డు సౌకర్యాలు అంటూ లేవు.
తక్షణమే మాడుగుల నియోజకవర్గం డిప్యూటీ సీఎం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. విద్యుత్ సౌకర్యం.. రహదారి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామ పెద్దలు సేదర అప్పారావు . s కామేశ్వరరావు. ఎస్ చిలకమ్మ తదితరులు కొండచిలువను చూపించారు. ఒకవేళ అది ఎవరిపైనైనా దాడి చేస్తే ఏంటి పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి : ఉగాది పచ్చడి ఎందుకు తినాలి..? అసలు విషయం తెలిస్తే ఎగబడి తింటారు..
వచ్చే జిల్లా పరిషిత్ సమావేశంలో కాగడాలతో ఆందోళన నిర్వహిస్తామని స్పష్టం చేశారు.. ఆ పరిస్థితి తెప్పించుకోవద్దు అంటే.. విద్యుత్, రోడ్డు, మంచినీరువంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. సౌకర్యాలు కల్పించాలి అంటున్నారు. ఇక వైద్యం చేయించుకోవాలి అంటే.. సాధ్యం కావడం లేదంటున్నారు. డోలీ మోతలతోనే వైద్యానికి కొన్ని కిలోమీటర్లు మోసుకెళ్లాల్సి వస్తోందని. ఇక వర్షాలు పడితే ప్రాణాలపై ఆశలు వదులుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికలు జరిగే సమయంలో నాయకులు వచ్చి.. ఓటు వేయండి మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నారని.. కానీ ఎన్నికలు అయ్యాక తమ గురించి పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు తాము రాష్ట్రంలో ఉన్నట్టే ప్రభుత్వాలు గుర్తించడం లేదని.. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తొస్తామని.. ఇకనైనా ఆ పరిస్థితి మారాలి అని డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Snake, Visakhapatnam