Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM VERY BIG TWIST IN VIZAG MARRIADE WOMEN SAI PRIYA MISSING CASE SUSPECT SHE JUMP WITH HER LOVER NGS VSP

Twist in Missing Mystery: వివాహిత మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. పెళ్లిరోజు నాడే భర్తకు షాక్.. లవ్వర్ తో జంప్..! గాలించేందుకు ఖర్చెంతైందో తెలుసా?

వివాహిత మిస్సింగ్ కేసులో ట్విస్ట్

వివాహిత మిస్సింగ్ కేసులో ట్విస్ట్

Twist in Missing Mystery: ఉదయం భర్తతో కలిసి సింహాచలం గుడికి వెళ్లింది.. రెస్టారెంట్లో కమ్మని ఫుడ్ తింది.. సాయంత్రం సరదగా సాగరతీరానికి వెళ్లి చేతిలో చేయి వేసి సెల్ఫీలు దిగింది.. పెళ్లి రోజు సెలబ్రేషన్స్ అంటూ భర్తను ఫుల్ హ్యాపీ చేసింది. కానీ క్షణాల్లోనే అక్కడనుంచి మాయమై ట్విస్ట్ ఇచ్చింది.. పాపం ఆమె గల్లంతైది అనుకున్న భర్త రోజుల తరబడి బీచ్ ఒడ్డున ఎదురుచూసేలా చేసింది. ఆమె గల్లంతైందనే అనుమానంతో గాలించడానికి ప్రభుత్వానికి ఎంత ఖర్చైందో తెలిసా..?

ఇంకా చదవండి ...
  P Anand Mohan, News18,Visakhapatnam.

  Twist in Missing Mystery:  సరిగ్గా ఏడాది క్రితం గ్రాండ్ గా వారి వివాహమైంది.. దీంతో తొలి పెళ్లి రోజు (Marriage Day) అంటూ.. భర్త శ్రీనివాస్ (Husband Srinivas) తో కలిసి భార్య సాయి ప్రియ (Wife Sai Priya) పెళ్లి రోజు వేడులను గ్రాండ్ గానే జరుపుకుంది. ఉదయం 11 గంటలకు దంపతులు ఇంటి నుంచి బయలుదేరారు. 12 గంటలకు సింహాచలం గుడి (Simhachalam Temple) కి వెళ్లొచ్చారు. భక్తితో స్వామి దర్శనం చేసుకున్నారు. ఒకటిన్నరకు హ్యాపీగా లంచ్ చేశారు. సాయంత్రం నాలుగన్నర గంటలకు బీచ్ కు చేరుకున్నారు. 5గంటల 15 నిమిషాల వరకు బీచ్ మెట్లపై కూర్చుని.. ముచ్చట్లు చెప్పుకుంటూ సెల్ఫీలు దిగారు. చేతిలో చేయి వేసి ప్రేమలోకలం విహరించారు. అంతా హ్యాపీగా సాగిపోతోంది అనుకుంటూ.. 5 గంటల 20 నిమిషాలకు బీచ్ లో కి వెళ్లారు. గంటకు పైగా ఇద్దరూ నీటిలో ఎంజాయ్ చేశారు. కానీ 6.30 గంటలకు తన వస్తువులను భర్తకు ఇచ్చిన సాయిప్రియ ఇంకొంత లోపలికి వెళ్లింది. 6 గంటల 50 నిమిషాలకు ఓ మేసేజ్ రావడంతో అది చూసి వెనక్కి తిరిగి చూసేలోపే సాయిప్రియ మిస్ అయ్యింది. అప్పటి వరకు ప్రేమగా తనతో ఆడిపాడిన సాయి ప్రియ ఎలా మిస్ అయ్యిందో అర్థం కాలేదు. రాకాసి అలలు ఆమెను మింగేసేయాని భయపడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.. ప్రేమకురిపించిన తన భార్త తిరిగి క్షేమంగా వస్తుందని ఎదురు చూశాడు.

  భర్త ఫిర్యాదు మేరకు.. విశాఖపట్నం (Visakhapatnam) అధికార యంత్రాంగం మొత్తం బీచ్ కు చేరింది. సాయి ప్రియ ఆచూకీ కోసం హెలీకాఫ్టర్ సాయంతో రెండు రోజుల పాటు గాలించారు. విశాఖ మేయర్ సైతం వచ్చి గాలింపు ఏర్పాట్లను చూశారు. అయినా ఆచూకీ లేదని అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న సమయంలో అనూహ్యంగా ట్విస్ట్ చోటు చేసుకుంది. మిస్ అయిన సాయి ప్రియ మిస్సింగ్ మిస్టరీని సవాలుగా తీసుకున్న వైజాగ్ పోలీసులు అహర్నిశలు శ్రమిస్తూ... సంచలన నిజం తెలిసింది.  సాయిప్రియ నెల్లూరులో ఉన్నట్లు బంధువులు గుర్తించారని పోలీసులు చెబుతున్నారు. ప్రియుడితో సాయిప్రియ వెళ్లిపోయినట్లు స్పష్టం చేశారు. నెల్లూరుకు చెందిన రవితో కొన్నాళ్లుగా సాయిప్రియ ప్రేమ వ్యవహారం నడుపుతోందని తెలిపారు. పెళ్లి రోజు సందర్భంగా భర్తతో ఆర్కే బీచ్‌కు వెళ్లిన క్రమంలో భర్త మొబైల్ చూస్తున్న సమయంలో సాయిప్రియ లవర్‌తో పరారైందని అనుమానిస్తున్నారు. అయితే సముద్రంలో గల్లంతైనట్లు భర్త శ్రీనివాస్ భావించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సాయిప్రియ కోసం రెండ్రోజులుగా నేవీ హెలికాప్టర్‌తో అధికారులు సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ఎట్టకేలకు ఆమె నెల్లూరులో లవర్‌తో ఉన్నట్టు పోలీసులు సమాచారం అందుకున్నారు.

  ఇదీ చదవండి : సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. కేంద్రంతో యుద్ధం చేస్తున్నాం.. పరిహారం కుదరదంటే రాష్ట్రమే ఇస్తుంది

  సాయిప్రియకు శ్రీనివాస్ అనే వ్యక్తితో రెండేళ్ల క్రితం వివాహమైంది. శ్రీనివాస్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఎన్‌ఏడీ దగ్గర ఓ కాలేజీలో సాయిప్రియ డిగ్రీ సెకండియర్ చదువుతోంది. ఈనెల 25న తమ పెళ్లిరోజు కావడంతో భర్త శ్రీనివాస్‌, ఆయన భార్య సాయిప్రియ కలిసి విశాఖలోని ఆర్కే బీచ్ కు వెళ్లారు. ఇక్కడి వరకు అంతా హ్యాపీగా సాగినా.. ఆ తరువాతే అనుకున్న ప్లాన్ ప్రకరామే సాయి ప్రియ భర్తకు ట్విస్ట్ ఇచ్చిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మొదట ఈ మిస్సింగ్ కేసులో అందరూ మొదట భర్తను అనుమానించారు. అతడే ఏదో చేసి తప్పుడు కేసు పెట్టాడని అనుమానించారు.. కానీ అసలై మాస్టర్ బ్రయిన్ సాయి ప్రియదే అని.. భర్తను నమ్మించి మోసం చేసిందని గుర్తించారు.

  ఇదీ చదవండి : వలతో పని లేదు.. చేపలు ఎలా పడుతున్నారో చూడండి.. ఎన్ని దొరికాయంటే?

  గాలింపు కోసం కోటి రూపాయల ఖర్చు..
  మరోవైపు సాయి ప్రియ గాలింపు కోసం అధికారులు సుమారు కోటి రూపాయలు ఖర్చు చేసింది ప్రభుత్వం. ఈ విషయమై విశాఖ నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌ మాట్లాడుతూ.. వివాహిత ఆచూకీ కోసం ప్రభుత్వ శాఖలన్నీ తీవ్రంగా శ్రమించాయని తెలిపారు. ప్రస్తుతం సాయి ప్రియ నెల్లూరులో ఉన్నట్లు సమాచారం వచ్చిందని, ఆమెను నెల్లూరు నుంచి విశాఖకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, Vizag, Women missing

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు