హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Big Shock: రేషన్ కార్డ్ హోల్డర్ కు బిగ్ షాక్.. ఇకపై నుంచి అవి కూడా కట్..! ఎందుకంటే..?

Big Shock: రేషన్ కార్డ్ హోల్డర్ కు బిగ్ షాక్.. ఇకపై నుంచి అవి కూడా కట్..! ఎందుకంటే..?

రేషన్ కార్డు దారులకు మరో షాక్

రేషన్ కార్డు దారులకు మరో షాక్

Big Shock: ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్.. మొన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వం బియ్యంతో పాటు పంచదార, కందిప్పు కూడా అందించేది.. అయితే ఇప్పటికే పంచదార సరఫారా నిలిచిపోయింది. ఇప్పుడు మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఎందుకంటే..?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Anand Mohan Pudipeddi, Visakhapatnam, News18.

  Big Shock: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఇంటికి ఇంటికి రేషన్ సరఫరా కార్యక్రమం కొనసాగుతూనే ఉందే.. రేషన్ వాహనం (Ration Vehicle) సముదాయంలోకి వచ్చి ఆగితే.. ఆ చట్టు పక్కల వారు.. అక్కడకే వెళ్లి రేషన్ తీసుకుంటున్నారు. ఆరంభంలో ఈ రేషన్ సరఫరా అంతా సవ్యంగానే సాగినా.. ఇప్పుడు విమర్శలు తప్పడం లేదు. త్వరలో రేషన్ కార్డు దారులకు (Ration Card Holders) మరో షాక్ తగలదని ప్రచారం జరుగుతోంది. అది ఏంటంటే..? బియ్యం కార్డుదారులకు కంది పప్పు సరఫరా నిలిపివేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని రేషన్ డీలర్లే అంగీకరించినట్టు సమాచారం. మొదట రేషన్ లో బియ్యంతో పాటు పంచదార ప్యాకెట్, కందిపప్పు ప్యాకెట్ కూడా అందించేవారు. కానీ రాను రాను పంచదార సరఫరాను మొదట అరకొరగా అందిస్తూ ఇప్పుడు పూర్తిగా నిలిపివేశారు.

  గత కొన్ని నెలలుగా అరకొరగా కందిపప్పు సరఫరా చేస్తున్నారు. అయితే వచ్చే నెల నుంచి పూర్తిగా కంది పప్పు నిలిపేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలకు సంబంధించి బియ్యం, పంచదార మాత్రమే ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి డీలర్లకు పంపుతున్నారని టాక్. కందిపప్పు గురించి డీలర్లు అడిగితే నో స్టాక్‌ అని చెబుతున్నారంట.. దీంతో డీలర్లు బియ్యం, పంచదారకు మాత్రమే డీడీలు తీస్తున్నారు.

  గత కొన్ని నెలలుగా ప్రభుత్వం కందిపప్పును అరకొరగా మాత్రమే జిల్లాలకు సరఫరా చేస్తోంది. ప్రతి నెలా ఎంతో కొంత సరఫరా చేసే పౌర సరఫరాల సంస్థ అక్టోబరు నెలకు సంబంధించి పూర్తిగా నిలిపివేసింది. కందిపప్పు సరఫరా చేసే మిల్లులకు భారీగా బకాయి పడినందున సంబంధిత యాజమానులు స్టాకు ఇవ్వడం లేదని తెలుస్తోంది. బహుశా భవిష్యత్తులో కందిపప్పు సరఫరా నిలిపివేసే అవకాశం వుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

  ఇదీ చవండి : విశాఖ ప్రజలకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి మరో కొత్త రైలు.. దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?

  రాష్ట్ర స్థాయిలో రేషన్‌ పంపిణీ విధివిధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం పండుగ రోజులు వస్తున్నాయన్న ఉద్దేశ్యంతో అందరికీ పంచదార, కందిపప్పు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబరులో ఇచ్చేందుకు డీడీలు తీయాలంటే రేషన్‌డీలర్లకు దిశానిర్దేశం చేసింది. వచ్చేనెలకు సంబంధించి ఈనెల 25వ తేదీలోపు డీడీలు సమర్పించాలి.

  ఇదీ చవండి : ఫ్లూటు బాబు ముందు ఊదు.. జగన్ ముందు కాదు.. అక్కడ ఉన్నది జ"గన్".. రోజా సంచలన వ్యాఖ్యలు

  ఇదే ఇప్పుడు డీలర్లలో గుబులు రేకెత్తిస్తోంది. బియ్యానికి కొద్దిపాటి సొమ్ములు చెల్లిస్తే సరిపోతుంది. కానీ పంచదార, కందిపప్పులకు పెద్దమొత్తంలో చెల్లించాలి. పైగా కార్డుదారులనుంచి స్పందన అంతంత మాత్రమే ఉంటోంది. నాణ్యత లేకపోవడంతో కందిపప్పు తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. దీనివల్ల నష్టపోతున్నామంటూ డీలర్లు ఆందోళన చెందుతున్నారు.

  ఇదీ చవండి : అబ్బాయి నీరు.. బాబాయ్ ఫైర్.. ఎన్టీఆర్ , బాలయ్య ట్వీట్ల వెనుక లెక్క ఏంటి..?

  ప్రభుత్వం అందిస్తున్న కందిపప్పు నాణ్యత ఉండడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి రేషన్‌కార్డుకు కిలో వంతున వచ్చే పప్పు కేటాయిస్తున్నారు. లబ్ధిదారులు కిలో 67 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. బహిరంగ మార్కెట్‌లో 90 రూపాయలకు పైగా ఉన్నప్పటికీ రేషన్‌ పప్పుపై ఆసక్తి చూపడంలేదు. దీంతో డీలర్ల దగ్గర నిల్వ ఉండిపోవడంతో పప్పునకు పురుగు పట్టేస్తుంది. దీంతో డీలర్లు ఆర్థికంగా నష్టపోతున్నారు. జిల్లాలో ప్రతి ఒక్కరికీ రేషన్‌లో కందిపప్పు తప్పనిసరి చేస్తే 643 టన్నుల అవసరం కానుంది. పంచదార అయితే 322 టన్నులు కేటాయించాలి. పంచదారను లబ్ధిదారులకు అరకిలో వంతున 17కు ఇస్తున్నా రు. బహిరంగ మార్కెట్‌లో అరకిలో 20 ఉంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమైతే కందిపప్పు కోసం డీలర్లు కిలోకు 66చొప్పున దాదాపు 4.24 కోట్లు చెల్లించాలి. వినియోగదారులు తీసుకోకుంటే ఆ మొత్తాన్ని డీలర్లే భరించాలి. అదే ఇప్పుడు జిల్లాలో రేషన్‌ డీలర్లను ఆందోళనకు గురిచేస్తోంది.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Ap welfare schemes

  ఉత్తమ కథలు