హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag: ఆర్థిక రాజధాని విశాఖలో మరో మెగా ఈవెంట్.. విదేశాల నుంచి ప్రముఖ వైద్యుల హాజరు.. ఎందుకో తెలుసా?

Vizag: ఆర్థిక రాజధాని విశాఖలో మరో మెగా ఈవెంట్.. విదేశాల నుంచి ప్రముఖ వైద్యుల హాజరు.. ఎందుకో తెలుసా?

విశాఖలో మరో మెగా ఈవెంట్

విశాఖలో మరో మెగా ఈవెంట్

Vizag: ఆర్థిక రాజధానిగా విశాఖనగరం మరో ప్రపంచ స్థాయి సదస్సు నిర్వహణకు వేదికైంది. మూడేళ్ల తరువాత విశాఖ వేదికగా ఈ గ్లోబల్ హెల్త్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు పలు దేశాలకు చెందిన వైద్యనిపుణులు హాజరుకానున్నారు. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Setti Jagadeesh, News 18, Visakhapatnam

సువిశాల సాగర తీరం.. అందమైన పర్యాటక నగరం.. ఇంతేనా విశాఖకు ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఏపీకి ఆర్థిక రాజధానిగా కూడా గుర్తింపు పొందింది. అలాంటి నగరం ఇప్పుడు మరో  ప్రపంచ స్థాయి సదస్సు నిర్వహణకు వేదికైంది. గ్లోబల్ హెల్త్ సమ్మిట్ ను మూడేళ్ల తరువాత విశాఖలో నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు పలు దేశాలకు చెందిన వైద్యనిపుణులు హాజరుకానున్నారు. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఇండియా ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మాకంగా రేపటి నుంచి మూడు రోజుల పాటు  ఈ సదస్సు నిర్వహించనున్నారు. సుమారు 500 మంది స్పెషలిస్టు వైద్యులు హాజరుకానున్నారు.

విశాఖ ఆంధ్రా మెడికల్ కళాశాలలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శటీ మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ టి.రవిరాజు ఆధ్వర్యంలో కమిటీ సభ్యుల బృందం సమావేశమైంది.  6,7.8 తేదిల్లో విశాఖలో నొవెటల్ వేదికగా ఈ సదస్సును నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమానికి తొలి రోజు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనీ, రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్ నాథ్, రెండో రోజు సదస్సుకు తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందర్యరాజన్, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, స్థానిక మంత్రులు, పలు దేశాలకు చెందిన వైద్యనిపుణలు హాజరవుతారన్నారు.

కొవిడ్ కారణంగా మూడేళ్లు పాటు ఈ సదస్సులు నిర్వహించలేదని, ఈ ఏడాది విశాఖ వేదికగా ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సదస్సు ద్వారా విదేశాల్లో అమలవుతున్న వైద్య విధానాలు, భారత్ లో అందుబాటులో ఉన్న వైద్య విధానాలు తదతర అంశాలపై నిష్టాణుతులైన వైద్యులతో సమావేశాలు నిర్వహించడంతో పాటు, మానసిక వైద్యం, ఇతర నూతన వైద్యవిధానాలపై సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు.

ఇదీ చదవండి : ఏపీలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఏర్పాట్లు.. జాతీయ ప్రధాన కార్యదర్శి ఎవరంటే..?

మహిళల్లో రోజు రోజుకి పెరుగుతున్న సర్వెకిల్ క్యాన్సర్ నివారణకు సంబంధించిన ఏపీవీపీ వ్యాక్సిన్ అందించడంతో పాటు, మహిళా సాధికారత, వైద్యరంగంలో వస్తున్న మార్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై సదస్సులో చర్చిస్తామన్నారు.

ఇదీ చదవండి : చంద్రబాబుకు పవన్ ఫుల్ సపోర్ట్.. జగన్ సర్కార్ తీరుపై ఫైర్

అదే విధంగా కార్డియాలజీ, న్యూరోలజీ, డయాబెటిస్, న్యూబోర్న్ హెల్త్, కిడ్నీ సంబంధిత వ్యాధులు, గ్యాస్ట్రోయాంట్రాలజీ, అంకాలజీకు సంబంధించిన విభాగాలపై ఈ సదస్సుల్లో కీలక ఉపన్యాసాలు ఉంటాయన్నారు. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ రవి కొల్లి మాట్లాడుతూ మన దేశంతో పాటు, అమెరికా దేశాలకు చెందిన సుమారు 100 మంది వైద్య నిపుణులు హాజరవుతారన్నారు. ఈ సదస్సు ద్వారా సర్వికల్ క్యాన్సర్పై విస్తృత ప్రచారం కల్పించేలా ప్రత్యేకంగా వంద మంది వ్యాక్సిను ఉచితంగా అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఇదీ చదవండిరెండో రోజూ సేమ్ సీన్.. ఆంక్షలు అడ్డగింతలపై ప్రత్యేక సమావేశం.. కుప్పంలో చంద్రబాబు విశ్వరూపం

గ్రామ స్థాయి నుంచి ఈ వ్యాధిపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తామన్నారు. అంతేకాకుండా మానసిక వైద్యంపై ఉన్న అపోహలు తొలగించేందుకు విస్తృత ప్రచారం కల్పిస్తామన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా సదస్సు నిర్వహించి వైద్యరంగంలో వస్తున్న మార్పులు, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై కూడా ప్రత్యేకంగా చర్చించి, అవగాహన కల్పిస్తామన్నారు. కేజీహెచ్ సూపరిండింటెంట్ డాక్టర్ పి. అశోక్ కుమార్, ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.బుచ్చిరాజు, మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ టి. రాధ, కమిటీ చైర్మన్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ నవీన్, డాక్టర్ శేఖర్, డాక్టర్ మోహన్ మహారాజ్, వైద్యులు పాల్గొన్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Local News, Visakhapatnam, Vizag

ఉత్తమ కథలు