Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM VEHICLE FANCY NUMBER PRICE HIKE IN ANDHRA PRADESH THIS IS THE LATEST PRICE HOW TO GET NUMBER NGS

Fancy Numbers: ఫ్యాన్సీ నెంబర్ కావాలనుకుంటున్నారా..? 5 వేలు నుంచి మొదలు.. ఆ నెంబర్ మాత్రం 2 లక్షలు

ఫ్యాన్సీ నెంబర్ ధర ఎంతంటే?

ఫ్యాన్సీ నెంబర్ ధర ఎంతంటే?

Vehicale Numbers: తమ సొంత వహనానికి ఫ్యాన్సీ నెంబర్లు ఉంటే బాగుటుందని చాలామంది భావిస్తుంటారు. కానీ నచ్చిన ఫ్యాన్సీ నెంబర్ కావాలంటే కొత్త రేట్ల గురించి తెలుసుకోవాల్సిందే.. ఏపీలో తాజాగా ఫ్యాన్సీ నెంబర్ల రేట్లు పెంచారు.. మొన్నటి వరకు 50 వేలు ఉండే ధర 2 లక్షలకు పెరిగింది. కానీ ఆ నెంబర్ల కోసం 5 వేల రూపాయలు ఖర్చు చేస్తే చాలు..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India
    Vehicle Numbers: వాహనం కొనుగోలు చేసిన వెంటనే అంతా తమకు వచ్చే నెంబర్ కోసం ఎదురుచూస్తుంటారు. తమ సెంటిమెంట్ కు ఉపయోగపడేదో.. లేదా క్యాచీగా ఉండే నెంబరో కావాలి అనుకుంటున్నారు. అయితే కాస్త డబ్బులు ఉన్నవాళ్లు అయితే.. కచ్చితంగా ఫ్యాన్సీ నెంబర్ (Fancy Number) తమ వాహనానికి (Own Vehicle) కావాలి అని కోరుకుంటారు.. అలాంటి వారికి ఏపీ ప్రభుత్వం (AP Government) షాకిచ్చింది. తాజాగా  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో  వాహనాల ఫ్యాన్సీ నంబర్ల ఫీజులు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మొన్నటి వరకు 50 వేల రూపాయలు ఉండే ధరను.. ఇప్పుడు 2 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఈ మేరకు కొత్తగా నిర్ణయించిన ఫీజులు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. కొత్తగా పెరిగిన ధరలు చూస్తే షాక్ తగలాల్సిందే. తాజా నిర్ణయంతో నంబర్లపై ఏటా 20 కోట్ల రూపాయల వరకు అదనంగా వసూలు అవుతాయని భావిస్తున్నారు. ముఖ్యంగా అత్యధిక డిమాండ్ ఉండే వాహనాల కోసం ఎంత ఖర్చు చేసేందుకైనా కొందరు వెనుకాడరు. బాగా డిమాండ్‌ ఉండే 9999 నంబర్‌ కావాలనుకునేవారు.. గతంలో 50 వేల రూపాయలు చెల్లించి ఆన్‌లైన్‌ ద్వారా వేలంలో పాల్గొనేవారు. ఈ నంబర్‌కు ఎవరు ఎక్కువ రేటుకు ఆసక్తి చూపిస్తే ఆ నంబర్‌ వారికి దక్కుతుంది. అయితే 50 వేలఉ ఉండే ఆ రేటును ఇప్పుడు కనీస మొత్తాన్ని రెండు లక్షల రూపాయలకు పెంచింది. 2 లక్షల రూపాయలు బేస్ ప్రైజ్ కు.. వేలం మొదలుపెట్టాలి.. అక్కడ నుంచి అత్యధికంగా ఎవరు ఎక్కువకు పాడుకుంటారో వాళ్లకు ఆ నెంబర్ వెళ్తుంది. అయితే 50 వేల రూపాయలు బేస్ ప్రైజ్ ఉన్నప్పుడు.. గతంలో 7 లక్షల 20 వేలకు వరకు ధర పలికింది. మరి ఇప్పుడు కనీస ధర 2 లక్షలు పెడితే.. వేలంలో ఎంతకు పలుకుతుందో అనే ఆసక్తి పెరిగింది. ఈ నెంబర్ కు ఉండే డిమాండే అందుకు కారణం. ఇదీ చదవండి : కొడాలి నానికి లైన్ చెప్పిన జూనియర్ ఎన్టీఆర్ .. మరి మాజీ మంత్రి స్పందిస్తారా..? వీటితో పాటు వివిధ ఫ్యాన్సీ నెంబర్ల రేట్లను ప్రభుత్వం ప్రకటించింది. 1, 9, 999 నంబర్లు కావాలంటే లక్ష రూపాయలు చెల్లించి ఆన్‌లైన్‌ వేలంలో పాల్గొనాలి. ఆ తరువాత 99, 3333, 4444, 5555, 6666, 7777 వంటి ఫ్యాన్సీ నంబర్లు కావాలనుకుంటే.. కనీసం 50 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక 5, 6, 7, 333, 369, 555, 666, 777, 1111, 1116, 1234, 2277, 2345, 2727, 3339, 3366, 3456, 3699, 4455, 4545, 4599 వంటి నంబర్ల విషయానికి వస్తే.. 30 వేల రూపాయలు చెల్లించి.. వేలంలో పాల్గొనాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఈ నెంబర్లు లక్ష ధరకు కూడా పొందే అవకాశం ఉంటుంది. అప్పుడు ఉండే డిమాండ్ బట్టి. ఇదీ చదవండి : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై తారక్ సంచలన ట్వీట్.. ఏమన్నారంటే? ఇక 3, 111, 123, 234, 567, 1818, 2222 లాంటి నంబర్లకు కేవలం 20 వేలు.. 11, 55, 456, 1212, 2525, 6786, 7979లాంటి నంబర్లకు రూ.15వేలు చెల్లించాలి. 2, 4, 8, 18, 143, 444 వంటి నంబర్లకు 10 వేల రూపాయలు చెల్లించి వేలంలో పాల్గొనొచ్చు. ఇక పుట్టిన రోజు, పెళ్లిరోజులు కలిసొచ్చే నంబర్‌కు కేవలం 5 వేలు రూపాయలు చెల్లించి.. వేలంలో పాల్గొనొచ్చు.. అయితే ఆ సమయంలో ఎవరైనా పోటీలో నిలిస్తే వేలంలో పాల్గొనక తప్పదు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Fancy numbers, Visakhapatnam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు