Vegetable Price: సామాన్యుడికి కూర’గాయాలు..’ ఈ ధరలు దిగిరావా..?

ప్రతీకాత్మకచిత్రం

Vegetable Price: కూరగాయలు సామాన్యుడి జేబుకు చిల్లుపెడుతున్నాయి. వారాలు గడుస్తున్నా ధరలు మాత్రం దిగిరావడం లేదు. దీంతో వినియోగదారుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు.

 • Share this:
  P.Anand Mohan, Visakhapatnam, News18

  కూరగాయలు సామాన్యుడి జేబుకు చిల్లుపెడుతున్నాయి. వారాలు గడుస్తున్నా ధరలు మాత్రం దిగిరావడం లేదు. దీంతో వినియోగదారుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. టమాటా కొనలేకపోతున్నారు.. ఉల్లి ధర ఘాటుకి భయపడుతున్నారు. తక్కువలో తక్కువ రెండొందలు పట్టుకెళ్తేనే.. రెండ్రోజలకు సరిపడా కూరగాయలు కొనగలుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradsh) లోని చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఇక ఇటీవల విశాఖపట్నంలో (Visakhapatnam) ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పోనీ ఉల్లి, టమాటో ఎలాగోలా సర్దుకుందామంటే.. మిగతా కూరగాయలు.. కేజీ నలబైకి తక్కువ లేవు. ఆకుకూరల్లో కొత్తమీర చిన్న కట్ట.. ఇరవై రూపాయలపైనే పలుకుతోంది. ఆ కట్టలో గట్టిగా మాట్లాడితే నాలుగు తురుములుండట్లేదు. ఇంతచేసినా..నాణ్యమైన తాజా కూరగాయలు దొరకట్లేదు. ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో సామాన్యుడు కడుపు నిండా భోజనం చేయలేని పరిస్థితి నెలకొంది.

  కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. ఉల్లి పాయలు, టమోటాలు సామాన్యుడికి అందుబాటులో లేవు. రెండువారాల క్రితం వరకూ కేజీ రూ.20–25 ఉన్న ఉల్లిపాయల ధరలు రూ.50లకు చేరుకున్నాయి. టమోటాల పరిస్థితి కూడా అంతే. రూ.20లోపు ఉన్న టమోటాలు ఒక్క సారిగా రూ.50లకు చేరుకున్నాయి. వంకాయలు ధరలు అమాంతంగా పెరిగి పోయి కేజీ రూ.40 వరకు అమ్ముతున్నారు. చిక్కుడు కాయలు కేజీ రూ.70–80 వరకూ పలుకుతోంది. బీరకాయలు రూ.50 రూపాయలు పైమాటే.

  ఇది చదవండి: నట్టింట్లో పాతిపెట్టిన నగదు మాయం… పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు..  కొన్నిరోజుల క్రితం వరకు రైతు బజారులో ఏ కూరగాయ అయినా కేజీ రూ.20 లోపే ఉండేవి. బహిరంగ మార్కెట్లో ఇంకో రూ.పది అదనంగా అమ్మేవారు. ఇప్పుడు ఒకసారిగా రూ.40–50లకు చేరుకున్నాయి. అక్టోబరులో గులాబ్‌ తుఫాన్‌ కారణంగా భారీ వర్షాలు కురవడం, ఆ తర్వాత కూడా వర్షాలు ముంచెత్తడంతో కూర గాయల పంటలు దెబ్బతిన్నాయి. అనంతరం కొత్త పంటలు వేశారు. ఈ పంటలన్నీ డిసెంబరులో అందుబాటులోకి వస్తాయి. అప్పటి వరకూ కూరగాయల ధరలు సామాన్యులకు అందు బాటులో ఉండే పరిస్థితులు కన బడడం లేదు.

  ఇది చదవండి: సీఎం జగన్ వైజాగ్ టూర్ రద్దుకు కారణం ఇదేనా…? రాజకీయకోణం ఉందా..?  మహారాష్ట్రలో భారీ వర్షాలు కారణంగా ఉల్లి పంట దెబ్బ తింది. ఫలితంగా ఉల్లి ఘాటెక్కింది. పెట్రోలు, డీజీల్‌ ధరలు పెరగ డం వల్ల రవాణా ఖర్చులు ఎక్కువయ్యాయి. కొత్త ఉల్లి వచ్చే సరికి డిసెంబరు, జనవరి మాసాలు వస్తాయి. క్యారెట్‌, బీట్‌రూట్‌, క్యాప్సికం హైదరాబాద్‌ నుంచి దిగుమతి అవుతాయి. అయితే హైదరాబాదు పరిసర ప్రాంతాలను ఇటీవల భారీ వర్షాలు ముంచెత్తాయి. దీనితో పంటలు దెబ్బతిని వీటి ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో లేకుండా పో యాయి. నవంబరులో కార్తీక మాసం రానున్న దృష్ట్యా కూరగాయలకు అధిక డిమాండ్‌ వచ్చే అవకాశం ఉంది. ఈ కారణంగా ధరలు మరింత పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ రెండు నెలలు ఈ ధరలను ప్రజ లు భరించాల్సిందేనని వ్యాపారులు పేర్కొంటున్నారు.
  Published by:Purna Chandra
  First published: