Setti Jagadeesh, News 18, Visakhapatnam
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న విశాఖపట్నం (Visakhapatnam) లో సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీ నృసింహస్వామి ఆలయం (Simhachalam Temple) లో బుధవారం ఉగాది పర్వదినం (Ugadi Festival) వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. తెలుగు సంవత్సరాదిని పురస్కరించు కొని సింహాద్రినాథుడి ఆలయం అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దారు. అనంతరం గంగధార నుంచి తీసుకువచ్చిన పవిత్ర జలాలుతో అభిషేకం జరిపి అనంతరం ప్రత్యేకంగా తయారు చేసిన ఉగాది పచ్చడిని స్వామికి నివేదించనున్నారు. అనంతరం భక్తులకు స్వామి దర్శనం కల్పించి ఉగాది పచ్చడిని వితరణ చేయనున్నారు. ఉగాది నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు సింహాద్రినాధుడిని దర్శించుకోవడానికి తరలి వచ్చారు.
సాయంత్రం పంచాంగ శ్రవణం, పెళ్లి రాట:
సింహాద్రి నాయుడి ఆలయంలో ఉగాది పర్వది నాన్ని పురస్కరించుకొని మధ్యాహ్నం4 గంటల కు పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామి ఆదాయం, ఖర్చు, రాజపూజ్యంతో పాటు పాడిపంటలు పండేతీరు ఇలా అన్నీ కూడా పంచాంగం ద్వారా వివరించారు. ఈ సందర్బంగా పండితులకు, దాతలకు సత్కారాలు నిర్వహించారు.
ఏప్రిల్ 2న జరగనున్న సింహాద్రినాథుడి వార్షిక కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం ఉత్తర ద్వారం, రాజగోపురం, కల్యాణ వేదిక వద్ద పెళ్లిరాటలు వేశారు. భక్తులు భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే స్వామి పాదాలను, సూర్యకిరణాలు తాకనుండగా ఈ అపురూపమైన ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉగాది పర్వదినం నుంచి సింహాద్రినాథుడి పెళ్లి పనులు ప్రారంభం కానున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam