Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM TWO WORKERS DIED AFTER TOXIC GAS LEAK AT A PLANT IN PARAWADA PHARMA CITY IN VISAKHAPATNAM MKS

vishakapatnam gas leak : విశాఖలో మరో గ్యాస్ విషాదం -పరవాడ ఫార్మా సిటీలో ఇద్దరు కార్మికులు మృతి

పరవాడ ఫార్మా సిటీ

పరవాడ ఫార్మా సిటీ

విశాఖపట్నంలో మరో గ్యాస్ లీకేజీ విషాద ఘటన చోటుచేసుకుంది. సిటీ శివారు పరవాడ ఫార్మా సిటీలో సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చిన ఘటనలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

విశాఖపట్నంలో మరో గ్యాస్ లీకేజీ విషాద ఘటన చోటుచేసుకుంది. సిటీ శివారు పరవాడ ఫార్మా సిటీలో సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చిన ఘటనలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వ్యర్థజలాల పంప్ హౌజ్ లో గ్యాస్ లీక్ కావడంతో ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులు మరణించారు. చనిపోయినవారిని పాయకరావుపేటకు చెందిన మణికంఠ(25), దుర్గాప్రసాద్ (25) గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

గతేడాది విశాఖలోని వెంకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ ఫార్మా కంపెనీలో ప్రమాదకర స్టెరీన్ వాయువు లీకై ఊరంతా వ్యాపించిన ఘటనలో ఏకంగా 11 మంది చినిపోవడం తెలిసిందే.  ఆ తర్వాత కూడా విశాఖ చుట్టుపక్కల్లోని పలు కంపెనీల్లో గ్యాస్ లీక్ ఉదంతాలు చోటుచేసుకున్నాయి. తాజాగా పరవాడలో జరిగిన గ్యాస్ లీకేజీలో ఇద్దరు చనిపోయారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Published by:Madhu Kota
First published:

Tags: Gas leak, Visakhapatnam, Vizag gas leak

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు