VISAKHAPATNAM TWO GROUPS INVOLVED IN CLASHES BECAUSE OF SOME CASTE BASED VIZIANAGARAM DISTRICT ANDHRA PRADESH FULL DETAILS HERE PRN VZM
Vizianagaram: కంచె సినిమా గుర్తుందా..? అలాంటిదే ఈ సీన్.. ఊరు రెండు ముక్కలైంది..!
కొట్టుకుంటున్న గ్రామస్తులు
Vizianagaram: ప్రపంచం టెక్నాలజీలో దూసుకుపోతున్నా నేటికీ కొన్ని గ్రామాల్లో కులాల కోసం కొట్టుకునే పద్ధతులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తమ కాలనీలో నీటిని ఓ దళితుడు తాగాడన్న కోపంతో మరో కులస్తులు వారిపై దాడికి దిగిన ఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో చోటు చేసుకుంది.
ప్రపంచం టెక్నాలజీలో దూసుకుపోతున్నా నేటికీ కొన్ని గ్రామాల్లో కులాల కోసం కొట్టుకునే పద్ధతులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తమ కాలనీలో నీటిని ఓ దళితుడు తాగాడన్న కోపంతో మరో కులస్తులు వారిపై దాడికి దిగిన ఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా (Vizianagaram District) నెల్లిమర్ల మండలం మల్యాడలో శనివారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలోని రెండు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ కాస్తా.. కర్రలు, రాళ్లతో పరస్పర దాడులు చేసుకునే స్దాయికి వెళ్లింది. ఈ దాడుల్లో 8 మందికి తలలు పగిలి గాయాలయ్యాయి. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. గ్రామంలోని బీసీ కాలనీలో ఉన్న ఓ బారుబావి వద్ద .. ఎస్సీ కాలనీకి చెందిన ఓ కుర్రాడు నీరు తాగడం ఈ దాడులకు కారణమైంది.
అలా తమ కాలనీలోని బావి వద్ద ఓ ఎస్సీ కులానికి చెందిన కుర్రాడు తాగడం నచ్చని బీసీ కులానికి చెందిన యువకులు అతనిపై దాడి చేశారు. దీంతో మాటామాటా పెరగడం, కర్రలు, రాళ్లతో దాడులకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరవర్గాలను అదుపులోకి తీసుకొని పికెట్లు ఏర్పాటు చేశారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు.
మల్యాడ గ్రామంలో ఇటీవల కాలంలో కొన్ని కులాంతర వివాహాలు జరిగాయి. దీంతో గ్రామ జనాభాలో అత్యధికంగా ఉండే బీసీలు, దళితుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కాగా, నాలుగు రోజుల క్రితం కూడా ఓ కులాంతర వివాహం జరిగింది. గ్రామంలో బీసీ కులానికి చెందిన అమ్మాయిని, అదే గ్రామంలోని ఎస్సీ కులానికి చెందిన యువకుడు వివాహం చేసుకోవడంతో.. రెండు వర్గాల మధ్య పరిస్థితి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. దీంతో అప్పటినుండి గ్రామంలో బీసీ కులానికి చెందిన వారు.. ఎస్సీ యువకులపై గుర్రుగా ఉన్నారు.
ఈ క్రమంలోనే బోరుబావి వద్ద దళిత వర్గానికి చెందిన కుర్రాడు.. నీటిని తాగాడన్న కోపంతో బీసీ వర్గానికి చెందిన యువకులు దాడి చేసారు. దీంతో రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగి దాడులకు కారణమైంది. ఇరు వర్గాలు కర్రలతో, రాళ్లతో దాడులు చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దాడికి సంబంధించి ఇరు వర్గాలపైనా కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అసలు విషయం రాబట్టేందుకు పోలీసులు గ్రామస్తులను విచారిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.