Setti Jagadeesh, News 18, Visakhapatnam
జీవితంలో సక్సెస్ అవ్వడానికి పెద్ద పెద్ద చదువులు చదవడం, లేకుంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వ్యాపారాలు చేస్తుంటాము. దీనికి భిన్నంగా తక్కువ చదువుకున్న లక్షల్లో బిజినెస్ చేస్తున్నారు విశాఖపట్నం కి చెందిన ఇద్దరు స్నేహితులు. చదివింది ఏడవ తరగతి, పదవ తరగతి అయినా ప్లాస్టర్ ఆఫ్ పారిస్, మట్టితో విభిన్న ప్రతిమలు తయారీతో మంచి బిజినెస్ చేస్తూ జీవితంలో సక్సెస్ అయ్యారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా (Visakhapatnam) కు చెందిన నర్సింగ్, కొత్తకోట గ్రామానికి చెందిన నక్కా రాజు ఇద్దరు స్నేహితులు. కొంతకాలం విశాఖపట్నంలో ఒకరి వద్ద ఈ వర్క్ చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఉన్నట్టుండి కరోనా రావడంతో ఎవరికి పని లేకుండా పోయింది. దీంతో ఇద్దరు స్నేహితులు కలిసి ఓ వ్యాపారం పెట్టుకుంటే బాగుంటుందని ఆలోచించారు.
ఇద్దరు కలిసి కొంత డబ్బు పెట్టి దొండపూడి గ్రామంలో స్థలం లీజికి తీసుకొని బిజినెస్ పెట్టడం జరిగింది. వివిధ రకాల విగ్రహాలు పార్కులలో కుర్చీలు , గ్రామ ఎంట్రన్స్ కు ఆర్చిలు, రైతు, ఎడ్ల బండ్లు ఇలా వివిధ రూపాలు విభిన్న ప్రతిమలు తయారు చేస్తూ వ్యాపారం పెంచుకున్నారు. ప్రారంభంలో తక్కువ మొత్తంలో ఆర్డర్స్ వచ్చేవి అయినా సరే వారి నైపుణ్యాన్ని చూపించేందుకు తక్కువ ఖర్చుతో నాణ్యతగా చేసేవారు. వారి నైపుణ్యాన్ని మెచ్చిన కొంతమంది ఆర్డర్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఒక్కో ఆర్డరు లక్ష రూపాయలు పైనే రావడం జరుగుతుంది దీంతో బిజినెస్ బాగా నడుస్తుంది అంటున్నారు.
ప్రస్తుతం ఈ స్నేహితులు ఇద్దరు లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. ఖర్చులు పోగా.. మంచి లాభాలు మిగులుతున్నాయని చెబుతున్నారు. కరోనా తర్వాత వ్యాపారం నష్టపోకుండా మరింత పెంచుకునేందుకు వీరు వేసిన ప్లాన్ బాగా వర్కవుట్ అయ్యింది. త్వరలో రకరకాల ప్రతిమలు, విగ్రహాలు, నూతన డిజైన్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం రెండు ఎడ్లతో కూడిన రైతు ప్రతిమను తయారు చేస్తూ బిజీగా ఉన్నారీ ఫ్రెండ్స్..!
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Business Ideas, Local News, Visakhapatnam