• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • VISAKHAPATNAM TWO CRYOGENIC CONTAINERS EACH CARRYING 20 MT OF LIQUID OXYGEN STARTED FROM DURGAPUR STEEL PLANT TO VISAKHAPATNAM NGS VZM

Oxygen: ఏపీకి ఊపిరి.. దుర్గాపూర్ ప్లాంట్ నుంచి రాష్ట్రానికి తొలి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌

Oxygen: ఏపీకి ఊపిరి.. దుర్గాపూర్ ప్లాంట్ నుంచి రాష్ట్రానికి తొలి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌

ఏపీకి ఆక్సిజన్ తీసుకువస్తున్న తొలి ఎక్స్ ప్రెస్

ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ఇక ఊపిరి పీల్చుకోవచ్చు.. పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌ ప్లాంట్‌ నుంచి.. సుమారు 40 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను నింపుకొని ఏపీకి వస్తోంది.

  • Share this:
    ఆక్సిజన్.. ఇప్పుడు అందరి నోటా ఇదే మాట.. దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ అవసరం పెరిగిపోయింది. కేవలం ఆక్సిజన్ అందక చనిపోయిన వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీంతో అంతా ఆక్సిజన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొందరైతే ఎంత ఖర్చు చేసి అయినా ఆక్సిజన్ కొనుక్కోవాలి అనుకుంటున్నారు. మరికొందరు దేశంలోనూ, ఆయా రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరతను క్యాష్ చేసుకుంటూ కాసులు దండుకుంటున్నారు. దీంతో ఆక్సిజన్ సరఫరాను పెంచడంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఫోకస్ చేశాయి. కేంద్రం సైతం దీనికోసం వివిధ మార్గాలు అన్వేషిస్తోంది. విదేశాల నుంచి సైతం ఆర్మీ యుద్ధ విమనాలతో.. నావికాదళం షిప్ లతో ఆక్సిజన్ ను తెప్పించి వివిధ రాష్ట్రాలకు సరఫరా అయ్యేలా చూస్తోంది..

    ఇందులో భాగంగా తాజాగా ఏపీలో మెడికల్‌ ఆక్సిజన్‌ అవసరాలను తీర్చేందుకు తొలిసారిగా ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఏపీకి వస్తోంది. పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌ ప్లాంట్‌ నుంచి.. సుమారు 40 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను నింపుకొని ఏపీకి వస్తోంది. రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రులకు పంపిణీ చేసేందుకు వీలుగా ఈ ఆక్సిజన్‌ను విశాఖపట్నం, నెల్లూరులో స్టేషన్లలో అన్‌లోడ్ చేయనున్నారు.



    ప్రాణవాయువు అవసరాలు తీర్చేందుకు ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఏపీకి రావడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో రోజుకు దాదాపు 600  టన్నుల ఆక్సిజన్‌ అవసరమవుతున్నప్పటికీ.. రోడ్డు మార్గాల ద్వారానే తమిళనాడు, ఒడిశా నుంచి సరఫరా అవుతోంది. తాజాగా రవాణా సమయాన్ని తగ్గించేలా ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ను నడిపేందుకు రైల్వేశాఖ సమ్మతించింది. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ సైతం ఆక్సిజన్ ను భారీగా ఉత్పత్తి చేస్తోంది. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్ ను సరఫారా చేస్తోంది.

    ఇటీవల సముద్ర మార్గం ద్వారా ఆక్సిజన్ విశాఖకు చేరుకుంది. సింగపూర్ నుంచి బయలుదేరిన యుద్దనౌక ఐ ఎన్ ఎస్ ఐరావత్ ఇవాళ విశాఖ తీరం చేరుకుంది. ఆపరేషన్ సముద్ర సేతు- 2 లో భాగంగా కోవిడ్ రిలీఫ్ ఆపరేషన్ లో పాల్గొంటున్న 9 నౌకలలో ఐ ఎన్ ఎస్ ఐరావత్ ఒకటి. ఆపరేషన్ సముద్ర సేతు-II లో భాగంగా గల్ఫ్, ఆగ్నేయ ఆసియా లోని ఫ్రెండ్లీ దేశాలనుంచి మెడికల్ లిక్విడ్ ఆక్సిజన్ తో పాటు వైద్యపరికరాలను ఐరావత్ తీసుకొచ్చింది. కోవిడ్‌-19 చికిత్సలో ఎదురవుతున్న ఆక్సిజన్‌ కొరతను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం ఇలా తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. సింగపూర్‌, యూఏఈల నుంచి అత్యధిక సామర్థ్యం గల ట్యాంకర్లను కొనుగోలు చేస్తోంది. ఆయా దేశాలతో జరిపిన చర్చలు ఫలించడంతో క్రయోజినిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు మన దేశానికి చేరుకుంటున్నాయి.
    Published by:Nagesh Paina
    First published: