Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM TWO ACCUSED ARRESTED FOR RAPING MINOR GIRL IN VISAKHAPATNAM SNR VZM

Minor Girl Rape: తిరునాళ్లకు వెళ్లిన మైనర్ బాలిక మాయమై..పోలీసులకు అక్కడ దొరికింది

(మైనర్‌పై అత్యాచారం)

(మైనర్‌పై అత్యాచారం)

Minor Girl Rape: విశాఖ గాజువాకలో ఓ మైనర్‌ బాలికపై అత్యాచారం జరిగింది. పరిచయస్తులైన ఇద్దరు యువకులు మాటమాటలు చెప్పి తీసుకెళ్లి బలత్కారం చేశారు. మద్యం తాగిన మైకంలో బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించారు. బాధితురాలి ఫిర్యాదుతో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇంకా చదవండి ...
విశాఖపట్నం (Visakhapatnam)గాజువాకలో ఓ మైనర్‌ బాలిక(Minor girl)పై ఇద్దరు యువకులు కిరాతకానికి ఒడిగట్టారు. జాతరకు వెళ్లిన అమాయకురాలిని పరిచయం అడ్డుపెట్టుకొని ఇద్దరు యువకులు మాయమాటలు చెప్పి బైక్‌పై నిర్మాణుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మద్యం తాగి బాలికపై ఒకడు అత్యాచారం చేస్తుంటే మరొకరు సహాకరించాడు. ఆలస్యంగా ఈ దారుణం బయటపడింది. బాలిక తల్లిదండ్రుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరు నిందితుల్ని పట్టుకున్నారు పోలీసులు. విశాఖ పెద్దగంట్యాడలో 9వ తరగతి చదువుతున్న 14ఏళ్ల బాలిక(14 Years girl)తో పాటు నిందితుల్లో ఒకడైన గణేష్‌ సిద్దేశ్వరం (Siddeswaram)కాలనీలో నివాసముంటున్నారు. 19సంవత్సరాల గణేష్ (Ganesh)ఐటీఐ చదువుతున్నాడు. బాధితురాలు, గణేష్‌కి మధ్య పరిచయం ఉంది. బుధవారం(Wednesday)రాత్రి పెదగంట్యాడ (Pedagantyada)లో తిరునాళ జరుగుతుంటే అక్కడికి బాధిత బాలిక తన సోదరితో కలిసి వెళ్లింది. గణేష్‌ కూడా అదే జాతరకు వచ్చి మైనర్‌ బాలికతో మాటలు కలిపాడు. దీంతో బాధితురాలి సోదరి ఇంటికి వెళ్లాం రమ్మని కోరడంతో కాసేపు ఆగి వస్తానని చెప్పి పంపించింది. ఆ తర్వాత గాజువాక సమీపంలోని గంగవరం(Gangavaram)గ్రామానికి చెందిన 27సంవత్సరాల మైలపల్లి రాజు (Milapalli raju)కూడా జాతరకు వచ్చాడు. రాజు , గణేష్‌ ఇద్దరూ స్నేహితులు. వీళ్లిద్దరూ కలిసి మైనర్‌ బాలికకు మాట మాటలు చెప్పారు. తమ దగ్గరున్న బైక్‌పై ఆమెను యారాడ కొండపైకి తీసుకెళ్లారు. మైనర్ బాలికకు తోడుగా ఒకరు ఉండగా మరకొరు మద్యం సీసాలు తీసుకొచ్చేందుకు వెళ్లాడు. మద్యం తెచ్చుకున్న తర్వాత ఇద్దరూ తాగి మైకంలో మైనర్‌ బాలికను అక్కడ పాడుబడిన షెడ్డులోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో మైనర్ బాలిక ప్రతిఘటించడంతో ఇద్దరిలో రాజు ఆమెపై అత్యాచారం చేయగా..గణేష్‌ అతనికి సహాకరించాడు. ఆమెపై అత్యాచారం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మైనర్‌ బాలికపై అత్యాచారం..
రాత్రి అయినప్పటికి మైనర్ బాలిక ఇంటికి ఫోన్ చేసింది. వాళ్లు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చింది. నైట్ పెట్రోలింగ్‌కి వెళ్లిన పోలీసులు బాధితురాలిని యారాడ కొండ సమీపంలో గుర్తించి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. ఆమె ఇచ్చిన వివరాల ఆధారంగా రాజు, గణేష్‌ అనే ఇద్దరు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపై పోక్సో చట్టంతో పాటు అత్యాచారం కేసు నమోదు చేశారు. కేసుని దిశా పోలీసులకు అప్పగించారు.

ఇల్లు దాటితే ఆడపిల్లకు భద్రత లేదు..
మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో న్యూపోర్టు పోలీసులు ఇద్దరు నిందితులైన రాజు, గణేష్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై చేసిన అఘాయిత్యానికి సంబంధించిన వివరాలు రాబడుతున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్‌ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మైనర్ బాలిక తల్లిదండ్రులు నిందితుల్ని వదలవద్దంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇద్దరికి కఠిన శిక్షవేయాలని జైలు నుంచి విడుదల కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Minor rape, Vishakaptnam

తదుపరి వార్తలు