Neelima Eaty, News18, Visakhapatnam.
TU-142 Aircraft Museum: విశాఖ (Visakha) అంటే అందాల సుందర నగరం.. అడుగు అడుగునా కళ్లు తిప్పుకోకుండా చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో..? ముఖ్యంగా విశాఖ బీచ్ (Vizag Beach) అంటే ఎంత క్రేజ్ ఉంటుంది అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంటే విశాఖ బీచ్ అంటే కేవలం అలల హోరు.. సముద్ర తీరాన ఉండే రెస్టారెంట్లు.. పార్కులు.. విగ్రహాలే కాదు.. మ్యూజియంలు కూడా ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. అలాంటి వాటిలో ఎక్కువగా పిల్లలను ఆకర్షిస్తోంది.. టియు-142 విమాన మ్యూజియం (TU-142 Aircraft Museum) .. ఇందులో టుపోలెవ్ టు 142 విమానం భద్రపరిచారు. విశాఖ నగర పర్యాటక ప్రచారంలో భాగంగా ఈ ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియానికి 2017 అక్టోబరులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) శంకుస్థాపన చేశారు. తర్వాత 2017 డిసెంబర్‌లో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (Ramnath Kovind) అధికారికంగా ప్రారంభించారు. ఇప్పుడు టీయూ 142 విమాన ప్రదర్శనశాల విశాఖపట్నం మెట్రోపలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ సంస్థ ఆధ్వర్యంలో ఉంది. దీనిని ఫుల్ సెక్యూరిటీతో మెయింటైన్ చేస్తున్నారు.
భారత నావికా దళంలో 29 సంవత్సరాల పాటు పనిచేసిన ఈ విమానం 2017, మార్చి 29న అరక్కోణంలోని ఐఎన్‌ఎస్ రాజాలిలో విరమణ చేయబడింది. ప్రమాదం ఎరగని ఈ విమానం విరమణ సమయానికి 30,000 గంటలు ఎగిరింది. మొదటగా ఇది భారత యుద్ధ భూమి కోసం రష్యాలో తయారు చేయబడింది. 1968 నుంచి TU 142 విమానం మన భారతదేశానికి సేవలు అందిస్తోంది. దాదాపు 30 సంవత్సరాలు యుద్ధ రంగంలో ఎన్నో సేవలను అందించింది. ఎన్నో విన్యాస ప్రదర్శనలు ఇచ్చింది. మన త్రివిధదళాలలో ఒకటైన ఈ ఎయిర్‌క్రాఫ్ట్ గురించి భవిష్యత్ తరాలకు తెలిపేందుకే సాగరతీరంలో ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు.
మ్యూజియం లోపల ఏం ఉంటాయి!
ఈ మ్యూజియంలోని ఒక హాలులో వివిధ పరికరాలు, విమాన భాగాల ప్రదర్శనను చూడవచ్చు. చివరిలో విఆర్ హెడ్‌సెట్‌ల ద్వారా ఆనందించగల ఫ్లైట్ సిమ్యులేటర్ ప్లాట్‌ఫారమ్ ఉంది. ఎయిర్ క్రాప్ట్‌కు సంబంధించిన సమాచారం, ఫైరింగ్, బాంబ్స్, మిస్సైల్స్, పైలేట్స్, సోనోబాయిస్, ప్రొపెల్లర్, ఇంజన్, సర్వైవల్ కిట్, యాంటీ సబ్‌మెరైన్ మిస్సైల్, డేట్ రికార్డర్, కాక్‌పిట్ వంటి పరికరాలు అన్ని వివరాలతో సహా ప్రదర్శించబడ్డాయి. చివరిలో విఆర్ హెడ్‌సెట్‌ల ద్వారా ఆనందించగల ఫ్లైట్ సిమ్యులేటర్ ప్లాట్‌ఫారమ్ ఉంది. విమాన భాగాలను అధ్భుతంగా భద్రపరిచి ప్రదర్శనలో పెట్టారు. ఆ విమానాన్ని నడిపిన పైలెట్‌ల వివరాలు కూడా అక్కడ ఉంటాయి.
ఇదీ చదవండి : వైసీపీ నేతల బస్సుయాత్రకు.. టీడీపీ కీలక నేత బస్సు.. మ్యాటర్ ఏంటంటే..?
పర్యాటకుల సందడి
వైజాగ్ అందాలను వీక్షించేందుకు వచ్చే పర్యాటకులు సాయంసంధ్య వేళ బీచ్‌లో ఎంజాయ్‌చేసి…సాయంత్రానికి ఎదురుగా ఉన్న ఈ మ్యూజియాన్ని సందర్శిస్తుంటారు. ముఖ్యంగా లోపల పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ల కోసం గేమింగ్ జోన్ కూడా ఉంటుంది. ఎయిర్ క్రాఫ్ట్ ముందు నిలబడి పర్యాటకులు ఫొటోలకు ఫోజులిస్తుంటారు.
ఇదీ చదవండి : నాన్ వెజ్ ప్రియులకు షాక్.. చికెన్ ను మరిచిపోవాల్సిందే..? ఎందుకో తెలుసా..?
టికెట్ లేనిదే నో ఎంట్రీ!
మ్యూజియంలోకి వెళ్లాలంటే టికెట్ తీసుకోవాల్సిందే. పెద్దవాళ్లకు- 70/-, పిల్లలకు- 40/- .అయితే టీ యూ 142 ఎయిర్ క్రాప్ట్ మ్యూజియం టైమింగ్స్ : మధ్యాహ్నం 2 గంటలు నుంచి రాత్రి పూట 8:30 వరుకు మాత్రమే ఉంటుంది.
ఇదీ చదవండి : నేడు ఢిల్లీకి సీఎం జగన్.. ముందస్తు పై క్లారిటీ..? షెడ్యూల్ ఇదే?
మ్యూజియం అడ్రస్:
బీచ్ రోడ్, ఒప్పోసిట్, కురుసర సబ్‌మెరైన్ మ్యూజియం, ఏయూ నార్త్ క్యాంపస్, పాండురంగపురం, విశాఖపట్నం ఆంధ్ర ప్రదేశ్- 530003. లోకేషన్ కోసం క్లిక్ చేయండి.
ఎలా చేరుకోవాలి?
విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి 18 కిలోమీటర్ల దూరంలో TU 142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఉంది. సమీప రైల్వే స్టేషన్ 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖపట్నం వద్ద ఉంది. సబ్ మెరైన్ మ్యూజియం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది, ప్రజలు బస్సు, ఆటో, క్యాబ్ మొదలైన వాటి ద్వారా ఈ ప్రదేశానికి చేరుకోవచ్చు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AIRCRAFT, Andhra Pradesh, AP News, Vizag