Setti Jagadeesh, News 18, Visakhapatnam
బోయ, వాల్మికి కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆదివాసీ, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitharama Raju District) ఏజెన్సీ ప్రాంతంలో బంద్ కి పిలుపునిచ్చారు. ఆదివాసీ సంఘాలు ఇచ్చిన రాష్ట్ర బంద్ విజయవంతం చేయాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలను వారు కోరారు. అయితే చాలా కాలం వరకూ ఎటువంటి అలజడి లేకుండా ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీలో ఒక్కసారిగా ప్రభుత్వ వ్యతిరేకతపై గిరిజన సంఘాలు నిరసనలు చేపడుతున్నారు. బంద్ నేపధ్యంలో పోలీసులు అప్రమత్తమైయ్యారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ సతీష్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బలగాలను మోహరించి అడుగు డుగునా గాలింపు చర్యలు చేపడుతున్నారు. మావోలు సైతం గిరిజనుల బందుకు మద్దతు తెలపడంతో పోలీస్ అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్న గిరిజనుల మనోభావాలను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంది అని గిరిజనులు, గిరిజన సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా శాసనసభలో బోయ, వాల్మికి, బొంతిరియ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై ఆదివాసీలు భగ్గుమంటున్నారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని ఆదివాసీల హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండి పడుతున్నారు.
బోయ, వాల్మీకులు, బొంతిరియ కులాలను ఆదివాసీ జాబితాలో చేర్చడం ద్వారా వారిని బినామీలుగా చేసుకొని అటవీ సంపదను, గిరిజనుల ఆస్తులను కొల్లగొట్టేందుకు కార్పొరేట్ శక్తులతో ప్రభుత్వం చేతులు కలిపిందని ఆదివాసీ, గిరిజన సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం తెలియజేసినప్పటి నుంచి ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గిరిజనులు ఆందోళనలు చేపడుతు న్నారు. ప్రజాప్రతినిధులు, ఎస్బీకమిషన్ వ్యవహిరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మావోల లేఖలో మరింత అప్రమత్తం
గిరిజన సంఘాలు చేస్తున్న ప్రభుత్వ వ్యతిరేక పనితీరుకు నిరసనతో పాటు, తాజాగా ఈస్ట్ డివిజన్ కమిటీ పేరిట గిరిజనులు మనోభావాలను పట్టించుకోకుండా ప్రభుత్వ తీరుపై మావో యిస్టులు సైతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖను విడుదల చేశారు. ఈ మవోలు విడుదల చేసిన ఆ లేఖ ఏజెన్సీ ప్రాంతంలో అలజడిని సృష్టించింది. అటు పోలీసులను, ఇటు రాజకీయ నేతలను పరుగులు పెట్టించింది.ఆదివాసీల హక్కులను కాలరాచి వేసే కుట్రలో భాగమే బోయవాల్మీకులను ఎస్జీటీ జాబితాలో చేరుస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆ లేఖలో ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని రద్దు చేసేవరకు తాము గిరిజన ప్రజల పక్షాన, న్యాయం పక్షాన పోరాడుతా మని స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam