హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag: ఉప ముఖ్యమంత్రి ఇలాఖాలో గిరిజనుల కష్టాలు..! నేటికీ అటువైపు కన్నెత్తి చూడని ప్రభుత్వం..!

Vizag: ఉప ముఖ్యమంత్రి ఇలాఖాలో గిరిజనుల కష్టాలు..! నేటికీ అటువైపు కన్నెత్తి చూడని ప్రభుత్వం..!

డిప్యూటీ

డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో గిరిజనుల కష్టాలు

Anakapalli: మనిషి గుండెను నిమిషాల్లో రాష్ట్రాలు దాటిస్తున్న ఈ రోజుల్లో కూడా.., అమాయకులైన గిరిజన ప్రజల వైద్యం కోసం కాస్త సమయం కేటాయించ లేకపోతుంది ప్రభుత్వం. వైద్యం చేసి టాబ్లెట్ అందించేవారు లేక అనారోగ్యం పాలవుతున్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Anakapalle, India

  Setti Jagadeesh, News 18, Visakhapatnam

  మనిషి గుండెను నిమిషాల్లో రాష్ట్రాలు దాటిస్తున్న ఈ రోజుల్లో కూడా.., అమాయకులైన గిరిజన ప్రజల వైద్యం కోసం కాస్త సమయం కేటాయించ లేకపోతుంది ప్రభుత్వం. వైద్యం చేసి టాబ్లెట్ అందించేవారు లేక అనారోగ్యం పాలవుతున్నారు. ప్రాణాల మీదకు వస్తే ఆస్పత్రులకు వెళ్లేందుకు రోడ్డు మార్గం లేక అష్టకష్టాలు పడుతున్నారు. ఏదైనా అత్యవసరం అయితే డోలీ సహాయంతో కొండలపై నుంచి రోగులను, గర్భిణులను ఆస్పత్రులకు చేరుస్తున్నారు. అత్యవసర సమయంలో వైద్యం అందక ఎంతో మంది గిరిజనుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నా పట్టించుకునే నాయకులే కరువయ్యారు. అనకాపల్లి ఏజెన్సీలోని ఎన్నో గ్రామాలకు ఇప్పటికీ రోడ్డు లేని పరిస్థితి. గిరిజనులకు ఆరోగ్యం బాగోలేకపోతే వారే డోలిలు కట్టి కిందకి తీసుకువచ్చే లోపు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

  ఆ డోలి ప్రయాణాల్లోనే ప్రాణాలు పోవడం ఇక్కడ సర్వసాధారణం అయిపోయింది. తమ గ్రామాలకి రోడ్డు సదుపాయం కల్పించండని ఎన్నో ఏళ్లగా నాయకులను వేడుకున్నా, అధికారులకి అర్జీలు ఇచ్చినా... ప్రభుత్వం పట్టించుకున్న దాఖలు లేవు. అనకాపల్లి జిల్లా వి మాడుగుల నియోజకవర్గంలో రోడ్డు సదుపాయాలు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు సొంత నియోజకవర్గమైన వి మాడుగులలో ఏంటి ఈ దుస్థితి అని అక్కడి గిరిపుత్రులు వాపోతున్నారు.

  ఇది చదవండి: పచ్చని కోనసీమలోని ఆ ప్రాంతంలో ఉప్పు నీరే దిక్కు..! గుక్కెడు నీటి కోసం తంటాలు పడాల్సిందే..!

  మాడుగుల మండలం శంకరం పంచాయతి కొత్తవలస గ్రామానికి చెందినటువంటి చీమల కొండలరావు అనే గిరిజనుడు వైద్యం అందక మృతి చెందాడు. అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి వలన సరైన రోడ్లు లేక అక్కడున్న ఐదు గ్రామాల ప్రజలకి వైద్యం అందక ఇలాగే మృతి చెందుతున్నారు. తమ గ్రామాలకి రోడ్డు సౌకర్యం కల్పించి తమకు ప్రాణ బిక్షపెట్టమని గిరిజనులు వేడుకుంటున్నారు. దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయతీ చివారు వీలభద్రపేట గ్రామంలో వారం రోజుల వ్యవధిలో రోడ్డు సౌకర్యం లేక మెరుగైన వైద్యం అందక గమ్మేల ప్రవీణ్, ఇద్దరు చిన్నారులు మృతి చెందారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న తెలిపారు.

  ఇది చదవండి: కృష్ణం రాజుకు ప్రాణం పోసిన శిల్పి..! రాజసం ఉట్టిపడేలా విగ్రహ తయారీ..!

  తాజాగా గమ్మేల కావ్యకి ఆరోగ్యం బాగలేక పోవడంతో 108 వాహనానికి పోన్ చేయగా గ్రామంలోకి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో రాలేకపోయింది. దీంతో కిలోమీటరు దూరం చేతులు మీదుగా పాపను మోసుకొచ్చారు. అనంతరం కాశీపురం రోడ్డు రీపేంగ్‌ కోసం రోడ్డుపై అడ్డంగా రాళ్ళు కుప్పలు వేశారు. దీంతో వీరభద్రం పేట జంక్షన్ నుండి సీతం పేట వరకు 5 కిలోమీటర్లు దూరం బైక్‌పై పాపను తీసుకువచ్చి 108 వాహనంలో ఎక్కించారు.

  ఇన్ని కష్టాలు పడుతున్న ప్రభుత్వానికి, అధికారులకు, కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదని గిరిజనులు మండిపడుతున్నారు. 75 ఏళ్ళు స్వాతంత్రరం పండగ చేసుకున్న ప్రభుత్వానికి గిరిజనులకు కనీసం రోడ్డు సౌకర్యం కల్పించకపోవడం సిగ్గుచేటన్నారు. అసెంబ్లీలో రెండు రోజులు విద్యావైద్యం, రోడ్లు , నాడు- నేడు పనులపై సుదీర్ఘమైన చర్చలు జరిపిన ప్రభుత్వానికి గిరిజనుల ప్రాణాలపై లెక్కలేదన్నారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు సొంత మండలంలోని డోలిమొతలు మరణమృదంగాలు తప్పడం లెదన్నారు. జంతువుల ప్రాణాలకు ఉన్న విలువ కూడా గిరిజనులు ప్రాణాలకు లేదా అని ప్రశ్నించారు. వెంటనే గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని చిన్నారులు, గర్భిణీల మృతికి కారణాలను గుర్తించి ఇకపై మెరుగైన వైద్యం అందించాలని గిరిజనులు వేడుకుంటున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam

  ఉత్తమ కథలు