హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

రక్తంతో అక్షింతలు.. పొలంలో చల్లితే మంచిదంట..! దీనికి శాస్త్రీయత కూడా.. వింత పండగ ఎక్కడంటే..!

రక్తంతో అక్షింతలు.. పొలంలో చల్లితే మంచిదంట..! దీనికి శాస్త్రీయత కూడా.. వింత పండగ ఎక్కడంటే..!

విశాఖ ఏజెన్సీ గిరిజనుల వింత పండుగ

విశాఖ ఏజెన్సీ గిరిజనుల వింత పండుగ

గిరిజన ప్రాంతాల్లోని ఆచార, వ్యవహారాలు చాలా భిన్నంగా ఉంటాయి. మనం ఎప్పడూ చూడని పద్ధతులు, పూజలు అక్కడ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విశాఖపట్నం (Visakhapatnam) మన్యంలో ప్రతి ఆచార వైవిధ్యంగానే ఉంటుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Anand Mohan Pudipeddi, News18, Visakhapatnam
మన దేశంలో విభిన్న మతాలు, కులాలు ఉన్నాయి. సాంప్రదాయాలు కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లోని ఆచార, వ్యవహారాలు చాలా భిన్నంగా ఉంటాయి. మనం ఎప్పడూ చూడని పద్ధతులు, పూజలు అక్కడ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విశాఖపట్నం (Visakhapatnam) మన్యంలో ప్రతి ఆచార వైవిధ్యంగానే ఉంటుంది. అవేవో మూఢనమ్మకాలు అనుకుంటే పొరబాటే.. ప్రతి ఆచారం వెనుక.. శాస్త్రీయత ఉంటాయి. అలాంటి కోవకే చెందుతుంది గిరిజనులు జరుపుకునే జొల్డ పండుగ. మైదాన ప్రాంతాల కంటే భిన్నంగా ఉంటాయి గిరిజన ఆచారాలు. అవన్నీ ఇతరులకు మరింత ఆసక్తిని కలిగిస్తాయి. పండుగలు, ఆచార వ్యవహారాలపై గిరిజనులకు తరతరాలుగా విశ్వాసంఉంటుంది. ఇలాంటి ముఖ్యమైన ఘట్టాల్లో జొల్డ పండగ ముందువరుసలో ఉంటుంది.

ఏజెన్సీ ప్రాంతంలో వరి నాట్లు పూర్తయిన మూడు వారాలకు గిరిజనులు జొల్డ పండగను నిర్వహిస్తారు. ప్రతి గిరిజన రైతు విధిగా ఈ పండగను బుధవారం మాత్రమే నిర్వహించాలనే నిబంధన తరతరాలుగా కొనసుగుతోంది. దీంతో వరిసాగు చేసే ప్రతి రైతు నాట్లు పూర్తయిన మూడో బుధవారం ఈ పండుగను జరుపుకుంటారు.

ఇది చదవండి: ఈ గుహలోకి వెళ్తే నచ్చిన ఫుడ్ ఐటమ్స్ తినొచ్చు.. అక్కడ స్పెషాలిటీ ఇదే..! ఎక్కడంటే..!


గిరిజన ప్రాంతాల్లో వరినాట్లు పూర్తైన మూడు వారాల తర్వాత గిరిజనులంతా అడవిలోకి వెళ్తారు. అక్కడ కస్మి, సీడి, పెద్ద జొల్డ మొక్కల కొమ్మలను తీసుకొస్తారు. వాటిని ఇంటి దగ్గర లేదా గ్రామానికి చెందిన చావిడి వద్దకు పెడతారు. అనంతరం కోడిని కోసి రక్తాన్ని బియ్యంలో కలిపి అక్షింతలు చేస్తారు. అలాగే రక్తం, పసుపును అన్నంలో కలుపుతారు. వాటితో పాటు అడవి నుంచి తీసుకొచ్చిన కొమ్మలను పట్టుకొని ఇంటిల్లపాది పొలాలకు వెళ్తారు. అక్కడ దేవతలకు పూజలు చేసి మొక్కుతారు. ఆ తర్వాత కొమ్మలను పంట పొలాల్లో నాటి.. పూజ చేసి తీసుకొచ్చిన అక్షింతలు, అన్నాన్ని పంట పొలాల్లో వెదజల్లుతారు. ఇలా చేస్తే పంటలు బాగుంటాయని.. లేకుంటే చీడపీడలు పడతాయని గిరిజనుల నమ్మకం.


ఇది చదవండి: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు తిరుమలలో దర్శనాలు రద్దు.. వివరాలివే..!


ఈ పండుగ వెనుక శాస్త్రీయత కూడా ఉందని గిరిజనులు చెబుతుంటారు. నాట్లు పూర్తైన మూడు వారాల తర్వాత జొల్డ పండుగ జరుపుతారు. ఇందులో భాగంగా పాలాల్లో పాతే మొక్కల కొమ్మల్లో ఔషధ గుణాలుంటాయని అక్కడి రైతులు చెబుతున్నారు. ఔషధ గుణాలు కలిగిన కస్మి, సీడి, పెద్ద జొల్డ మొక్కల కొమ్మలను పంటనాటడం వల్ల లేత పైరును ఆశించాలనుకునే పలు రకాల పురుగులు, కీటకాలు.. ఆ కొమ్మలకు ఆకర్షితమవుతాయి. అలా పంటలు బావుంటాయంటున్నారు. సాగులో భాగంగా తీసుకోవాల్సిన చర్యను.. సాంప్రగాయంగా పాటించడాన్ని గిరిజనులు పండుగగా భావించాలనే పూర్వీకల ఆలోచనతోనే జొల్డ పండుగ పుట్టింది.

First published:

Tags: Andhra Pradesh, Tribes, Visakhapatnam

ఉత్తమ కథలు