హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

జగన్ ఫ్లెక్సీలు ధ్వంసం చేసిన గిరిజనులు.. ఆగ్రహానికి కారణం ఇదే..!

జగన్ ఫ్లెక్సీలు ధ్వంసం చేసిన గిరిజనులు.. ఆగ్రహానికి కారణం ఇదే..!

X
ఏపీ

ఏపీ ప్రభుత్వంపై గిరిజనుల ఆగ్రహం

బోయ వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్పించేందుకు మార్చి 24న సీఎం జగన్ (AP CM YS Jagan) అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ప్రభుత్వ తీర్మానతో అర్హులు కానీ బోయ వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్పించేందుకు సిద్ధం చేస్తున్నారంటూ గిరిజనులు, గిరిజన ప్రజాసంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Setti Jagadeesh, News 18, Visakhapatnam

బోయ వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్పించేందుకు మార్చి 24న సీఎం జగన్ (AP CM YS Jagan) అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ప్రభుత్వ తీర్మానతో అర్హులు కానీ బోయ వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్పించేందుకు సిద్ధం చేస్తున్నారంటూ గిరిజనులు, గిరిజన ప్రజాసంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitharamaraju District) ప్రధాన కూడలి పాడేరులో గిరిజనులు సీఎం జగన్ ఫ్లెక్సీలు ధ్వంసం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బోయ వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చొద్దంటూ నిరసనలు తెలిపారు. రాష్ట్రముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మార్చి 24న బోయవాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి సిపార్సు చేస్తామని ప్రకటించారు.

అసెంబ్లీలో ఉన్న ఏడుగురు గిరిజన ఎమ్మేల్యేలు ఉత్సవ విగ్రహాలుగా ఉండిపోయారంటూ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి.అప్పలనర్స ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల వాణిని శాసనసభలో హత్య చేశారు. వైకాపాప్రభుత్వం ప్రకటించే ప్రతి విధానం పట్ల ఎమ్మెల్యేలు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తూ ముఖ్యమంత్రి ప్రకటనను అసెంబ్లీలో వ్యతిరేకించకపోవడం వారి అవకాశవాద రాజకీయాల కోసం గిరిజనులను బలిచేయడం అన్యాయం. ఈ నేపథ్యంలో గిరిజన ఎమ్మెల్యేలు తమవైఖరిని ప్రకటించాలని గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి.అప్పలనర్స డిమాండ్ చేశారు.

ఇది చదవండి: కోడలిపై కన్నేసిన మామ.. ఇద్దరు అత్తలు అదే టైప్.. చివరికి..!

అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ బోయవాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్పిస్తే ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు ఎటువంటినష్టంలేదని అసెంబ్లీ సాక్షిగా అబద్దపు ప్రచారం చేయడం తన స్థాయికి తగ్గింది కాదు. ఏజెన్సీ ప్రాంతంలో భూమి, అడవిపై ఆదివాసులకే క్రయ, విక్రయాలో హక్కువుంది. బోయవాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్పిస్తే ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల భూములు అన్యాక్రాంతమై నిరాశ్రయులుగా మిగులుతారు. 5వ షెడ్యూల్డ్ ఏరియాలో ఇప్పటికే 7 అసెంబ్లీ స్థానాలు, 1 పార్లమెంట్ స్థానం గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్ను రాజ్యాంగం కల్పించబడింది.

ఆ స్థానాల్లో బోయవాల్మీకులు గిరిజన ప్రజాప్రతినిధులుగా పోటీచేయడానికి అర్హత పొందుతారు. వివిధ రాజకీయ పార్టీలు గిరిజన సహజ సంపదను దోచుకోవాలనే కుట్రతో వున్న నాయకులు బోయవాల్మీకిలకు ఎన్నికల్లో పోటీచేయడానికి అవకాశం కల్పిస్తే గిరిజనుల అస్థిత్వానికే ప్రమాదం ఏర్పడుతుంది. ఎస్టీ రిజర్వేషన్లో లేనప్పుడే వివిధ రాజకీయ పార్టీలను ప్రభావితం చేస్తూ బోయలకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేయించుకున్నారు. ఎస్టీ జాబితాలో చేరి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతే గిరిజనులకు రక్షణకవచంగా వున్న చట్టాలను రద్దుచేసి గిరిజనులను అన్యాయానికి గురిచేస్తారని గిరిజన సంఘం జిల్లా నాయకులు ఎల్.సుందరరావు తెలిపారు.

First published:

Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam

ఉత్తమ కథలు