Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM TRIBAL WOMEN DHARNA IN VISAKHAPATNAM DISTRICT SAYS OUR LANDS WERE GIVEN TO MINING SNR

Visakhapatnam:ఉపాధి లేకపోతే ఉరే..వైరల్ అవుతున్న ఉత్తరాంధ్ర గిరిజన మహిళల ధర్నా ఫోటోలు

Photo Credit:Youtube

Photo Credit:Youtube

Photo Viral:విశాఖ జిల్లాలో గిరిజన మహిళలు చేసిన వినూత్న ధర్నా వీడియోలు వైరల్ అవుతున్నాయి. అనకాపల్లి సమీపంలోని జీడి తోటల్ని ప్రభుత్వం మైనింగ్‌కి అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలియడంతో న్యాయం చేయమని చెట్లకు ఉరివేసుకున్నట్లుగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇంకా చదవండి ...
ఉత్తరాంధ్ర ప్రాంత మహిళలు చేపట్టిన వినూత్న ధర్నాకు సంబంధించిన ఫోటోలు వైరల్(Viral photos) అవుతున్నాయి. మెడలకు చీర కొంగులు, తాళ్లను చుట్టుకొని చెట్టుకు ఉరివేసుకున్నట్లుగా కనిపిస్తున్న ఫోటోలు కలకలం రేపుతున్నాయి. ఇంతకీ ఈ ఫోటోలు ఎక్కడివో కాదు ఉత్తరాంధ్రకు గుండెకాయ లాంటి విశాఖపట్నం (Visakhapatnam) జిల్లా మాడుగల( Madugala)మండలం ఉరవకొండ (Uravakonda)కు చెందిన మహిళలు వీళ్లంతా. చెట్లకు ఉరివేసుకోవాల్సినంత కష్టం ఏమి వచ్చిందంటే ఈ ప్రాంతలోని నివసిస్తున్నవాళ్లు పొట్టకూటి కోసం గత కొన్నేళ్లుగా జీడి తోటలను సాగు చేసుకుంటున్నారు. ఇప్పుడు తమ ప్రాంతంలో జీడి సాగు చేస్తున్న తోటలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనింగ్‌కు అప్పగించే యోచనలో ఉన్నట్లు వార్త బయటకురావడంతో విశాఖపట్నం జిల్లా అనకాపల్లి (Anakapalli)కి చెందిన కొందరు గిరిజన మహిళ (Tribal women)రైతులు ఈ విధంగా మెడలకు ఉచ్చు తాళ్లు బిగించుకొని చెట్లకు ఉరివేసుకుంటున్నట్లుగా నిరసన వీడియో, ఫోటోలు సోషల్ మీడియా (Social media)లో వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వం ఉపాధి కల్పన కింద తమకు అప్పగించిన భూముల్లో జీడి సాగు చేసుకొని బతుకుతున్నామని ..ఇప్పుడు షడన్‌గా స్థానికంగా పలుకుబడి ఉన్న వాళ్లు తమ దగ్గర భూములను అక్రమంగా లాక్కొని మైనింగ్‌ కంపెనీ(Mining Company)కి అప్పనంగా దోచి పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

మా భూముల్ని మైనింగ్‌ ఇస్తారా..
జీడి తోటల చుట్టు పక్కల ఉన్న భూములు మైనింగ్‌కి కేటాయించడంతో ఇప్పుడు రోడ్డు వేయడానికి తమ తోటల్ని ధ్వంసం చేస్తున్నారని గిరిజన మహిళల ప్రధాన ఆరోపణ. ఎవరైనా గ్రానైట్ కంపెనీకి అప్పగించిన భూములు తమవేనని..కాకపోతే వాటికి సంబంధించిన పత్రాలు లేకపోవడంతో అధికారుల్ని ఆశ్రయిస్తే స్థానిక రెవెన్యూ అధికారి కార్యాలయం సిబ్బంది తమను బెదిరించారని మైనింగ్‌ కంపెనీ పనుల్ని అడ్డుపడితే అఖ్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతామని బ్లాక్ మెయిల్ చేశారని గిరిజన మహిళలు ఆరోపిస్తున్నారు. అంతే కాదు ఎంఆర్‌ఓ, ఇతర అధికారులు మైనింగ్ కంపెనీకి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

గిరిజన ఆడబిడ్డల ఆవేదన..
ఇంత కాలం తాము సాగు చేస్తున్న జీడి తోటల మధ్యలో రోడ్లు వేస్తే తమ పంటలు పూర్తిగా నష్టపోయి..జీవినోపాధి కోల్పోతామంటున్నారు. అందుకే అప్పుడు పనులు లేక చనిపోయే కంటే ఇప్పుడు బలవంతంగా ప్రాణాలు తీసుకోవడమే మంచిదని ఈవిధంగా నిరసన తెలియజేస్తున్నట్లుగా తమ వాదనను వినిపించారు గిరిజన మహిళలు. తమ భూముల్ని అక్రమంగా లాక్కొని మైనింగ్ కంపెనీలకు కట్టబెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని..ఈవ్యవహారంపై జిల్లా జాయింట్ కలెక్టర్‌తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు గిరిజన మహిళలు. మహిళల వాదనలో ఎంత వరకు న్యాయం ఉంది..వాళ్లు చెబుతున్న దాంట్లో ఎంత వాస్తవం ఉందనే విషయం కంటే వాళ్లు ఉపాధి కోసం చేసిన వినూత్న నిరసన అందర్ని ఆకర్షించింది.
Published by:Siva Nanduri
First published:

Tags: VIRAL NEWS, Vishakaptnam

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు