Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM TRIBAL OLD WOMAN BUILT CHECK DAM IN PADERU OF VISAKHAPATNAM AGENCY IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN VSP

Araku Agency: ఈ బామ్మ చేసిన పనికి దండం పెట్టాల్సిందే..! సింగిల్ హ్యాండ్ తో చెక్ డ్యామ్ కట్టేసింది.. వంద ఎకరాలకు నీరిచ్చింది..!

కోడా చిన్నాలమ్

కోడా చిన్నాలమ్

Vizag News: గిరిజనులు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని మరోసారి నిరూపించారు. ప్రభుత్వ సాయం లేదు. కేవలం ఆమె వ్యవసాయం కోసమే చెక్ డ్యామ్ కట్టేసింది. తనకి తెలిసిన వారి సహాయ సహకారాలతో గిరిజన తండాల్లో పొలాలకు నీళ్లని ఇచ్చేసింది

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India
    P Anand Mohan, News18, Visakhapatnam

    గిరిజనులు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని మరోసారి నిరూపించారు. ప్రభుత్వ సాయం లేదు. కేవలం ఆమె వ్యవసాయం కోసమే చెక్ డ్యామ్ కట్టేసింది. తనకి తెలిసిన వారి సహాయ సహకారాలతో గిరిజన తండాల్లో పొలాలకు నీళ్లని ఇచ్చేసింది. కేవలం కొద్దిరోజుల్లో చెక్ డ్యామ్ పూర్తి చేసి.. ఎవరి సహాయం తమకు అవసరం లేదని చాటిచెప్పింది. పోనీ ఇంతటి కార్యక్రమం చేసిన ఆమెది నడివయసు అనుకుంటే పొరపాటే. ఆ గిరిజన తండాలో చెక్ డ్యామ్ కట్టిన ఆమె వయసు డెబ్బై పైనే. ఈ వయసులో కూడా ఓ పెద్ద కార్యాన్ని ఆమె సాధించేసింది. తన డబ్బుతో.. కొంత తన వాళ్ల నుంచీ పోగేసిన డబ్బుతో ఈ మొత్తం పని పూర్తి చేసింది.

    ఇదిగో ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధనారి గురించే మనం చెప్పుకునేది. ఈ 75 ఏళ్ల పెద్దావిడ పేరు కోడా చిన్నాలమ్. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఉమ్మడి విశాఖపట్నం జిల్లా (Visakhapatnam District) పాడేరు ఏజెన్సీలోని కిముడుపల్లి గ్రామానికి చెందిన రైతు. పెద్దగా చదువులేదు. కానీ ఒక ఓ పెద్ద ఇంజనీరులా ఆలోచించి.. దాదాపు 100 ఎకరాలకు నీటిని అందించే చెక్ డ్యామ్ ని సొంత నిధులు, గ్రామస్థుల చందాలతో నిర్మించేశారు. ఇప్పుడు ఊర్లో అంతా ఈమెను ఇంజనీర్ చిన్నాలమ్మ అని పిలుస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇంజనీర్ లా ఆలోచించి.. చెక్ డ్యామ్ నిర్మాణం పూర్తి చేసిందీమె.

    ఇది చదవండి: ఒక్కసారి అప్పుచేస్తే జీవితాంతం కట్టాల్సిందే.. వీళ్ల వడ్డీలకు అంతే ఉండదు..!



    పక్కా ప్లానింగ్ తో  16 ఎంఎం రాడ్లుతో కాంక్రీట్ వేసి చెక్ డ్యామ్  నిర్మించారు. పెద్ద పెద్ద వరదలొచ్చినా ఈ చెక్ డ్యామ్ ను ఏం చేయలేవు. పెద్ద మిషన్ తీసుకుని వచ్చి దీని నిర్మాణం చేపట్టారు. గతంలో అనంతగిరి మండలంలో పినకోట గ్రామంలో గిరిజనులే స్వయంగా 14 కిలోమీటర్ల మట్టి రోడ్డు నిర్మించుకున్నారు. ఇప్పుడు ఇక్కడ చెక్ డ్యాంను గిరిజనులే నిర్మించుకున్నారు. ఐటీడీఏ చేయాల్సిన పనులను గిరిజనులే చేసుకుంటున్నారు.

    ఇది చదవండి: కల్యాణమస్తు రద్దు.. టీటీడీ అనూహ్య నిర్ణయం.. కారణం ఇదే..!


    ఎగువ కొండల నుంచీ జోరుగా కిందకు పారుతున్న గెడ్డ సమీపంలోనే కిముడుపల్లి గిరిజన గ్రామం ఉంటుంది. వీటికి సమీపంలోనే నాలుగైదు ఇతర గ్రామాలు ఉన్నాయి. కిముడుపల్లి గ్రామస్థులంతా పంటనీటి కోసం ఈ గెడ్డ పైనే ఆధారపడతారు. దీనికి అనుసంధానంగా గతంలో ఉన్న కాలువలు 2007లో కొట్టుకుపోయాయి. అప్పటీ నుంచి చెక్ డ్యాం కోసం స్థానికులంతా ప్రభుత్వానికి ఆర్జీలు పెడుతూనే ఉన్నారు. ఏళ్లు గడిచినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో చిన్నాలమ్మ గ్రామస్థులతో సమావేశం ఏర్పాటు చేసి తాను ఆర్థిక సాయం చేస్తానని, మనమే సొంతంగా చెక్ డ్యాం కట్టుకుందామంటూ తన ఆలోచన చెప్పారు. దాని ఫలితమే ఈ చెక్ డ్యాం నిర్మాణం పూర్తయింది. ఇక్కడ పంట భూమి ఉన్నవారందరిని ఒక దగ్గర కూర్చోబెట్టి చిన్నాలమ్మచెక్ డ్యామ్ అవసరం తెలిపారు. అందరి సహకారం ఉంటే తాను మిగతా పని నడిపిస్తానని ధైర్యం చెప్పారు. అందుకే ఇలా పూర్తయింది.

    ఇది చదవండి: ఏపీలో మళ్లీ మంకీపాక్స్ కలకలం.. లక్షణాలున్న యువకుడు మిస్సింగ్..


    ఇక పాడేరు ఐటిడిఏకి ఈ సమాచారం చేరడంతో గిరిజనుల్ని అభినందించారు. ఇక మిగతా పనులకు మేం ఉన్నామంటున్నారు. ఇక్కడ ఐటిడిఏ పరిధిలో చెక్ డ్యాంలకు సంబంధించి రూ. 8.64 కోట్లు మంజూరయ్యాయని ఐటిడిఏ అధికారులు చెబుతున్నారు. ప్రాధాన్యతా క్రమం ప్రకారం చెక్ డ్యామ్ లను నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నామని, కిమిడిపల్లి చెక్ డ్యాం వివరాలు సేకరించి, మిగతా పనిని ప్రభుత్వం పూర్తి చేస్తుందని ఐటిడిఏ పీఎ రోణంకి గోపాలకృష్ణ తెలిపారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Tribes, Visakhapatnam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు