Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM TRAFFICKING OF GANJA IN PUSHPA MOVIE STYLE IN VISAKHAPATNAM FULL DETAILS HERE PRN VSJ NJ

Vizag: పుష్ప సినిమా స్టైల్లో గంజాయి అక్రమ రవాణా..! పోలీసులిచ్చిన ట్విస్ట్‌ మామూలుగా లేదు..!

విశాఖలో గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్ట్

విశాఖలో గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్ట్

పుష్పా సినిమా (Pushpa Movie) దేశవ్యాప్తంగా ఎంత సంచలం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అదే తరహాలో ఎర్రచందనం (Red Sandal) అక్రమ రవాణా చేస్తూ చాలామంది పట్టుబడ్డారు. తాజాగా విశాఖపట్నంలో అదే పుష్ప సినిమా స్టయిల్లో గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టురట్టయింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India
    Setti Jagadeesh, News 18, Visakhapatnam పుష్పా సినిమా (Pushpa Movie) దేశవ్యాప్తంగా ఎంత సంచలం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అదే తరహాలో ఎర్రచందనం (Red Sandal) అక్రమ రవాణా చేస్తూ చాలామంది పట్టుబడ్డారు. తాజాగా విశాఖపట్నంలో అదే పుష్ప సినిమా స్టయిల్లో గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. విశాఖపట్నం (Visakhapatnam) లో పోలీసులు మద్యం అక్రమ రవాణా కట్టడికి, నాటుసారా తయారీ నియంత్రణతో పాటు గంజాయి స్మగ్లింగ్ (Ganja Smuggling) పై పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని అన్ని సరిహద్దుల్లో ఎప్పటి కప్పుడు ముమ్మర తనిఖీలు జరుపుతూ అక్రమ రవాణాను అడ్డుకుంటున్నది విశాఖపట్నం సెబ్. ఎస్.కోట నుండి తమిళనాడుకు మినీ బస్సులో గంజాయి రవాణా జరుగుతుందని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో ముందుగానే కాపుకాసిన పోలీసులు ఆ వెహికల్‌ను ఆపి చెక్‌ చేశారు. అందులో ఎవరికీ అనుమానం రాకుండా సీలింగ్‌కి కన్నం పెట్టి సినిమా స్టైల్‌లో లోపల గంజాయితో నింపేశారు. మళ్లీ యధావిధిగా సీలింగ్ మూసేశారు. పోలీసులు చెకింగ్‌లో భాగంగా లోపలికి వెళ్లి చూసినా ఏమి ఆనవాళ్లు కనిపించనంత నీట్‌గా తయారు చేశారు గంజాయి స్మగ్లింగ్ ముఠా.

    ఇది చదవండి: మందు బాబుల గుండె పగిలే దృశ్యాలు..! మద్యం బాటిళ్లను రోడ్డురోలర్‌తో తొక్కించిన పోలీసులు..!

    పక్కా సమాచారం ఉండడంతో సీలింగ్‌కి కన్నం పెట్టి పైన ఉన్నటువంటి గంజాయి ప్యాకింగ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్ చేస్తున్న 120 కేజీల గంజాయిని సీజ్ చేసి ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేశారు. గంజాయికి అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్ఈబీ జేడీ శ్రీనివాసరావు హెచ్చరించారు.

    ఇది చదవండి: భర్తకు దగ్గరుండి రెండో పెళ్లి చేసిన భార్య.. ముగ్గురూ కలిసి కాపురం..! మరో ట్విస్ట్ ఏంటంటే..!

    గడచిన నాలుగు నెలల కాలవ్యవధిలో 42 అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ కేసులను ఛేదించి 137 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు ఎస్ఈబీ జేడీ శ్రీనివాసరావు తెలిపారు. సాంకేతిక టెక్నాలజీని వినియోగించి నిఘా ఏర్పాటుతో గస్తీని ముమ్మరం చేయడంతో పాటు ప్రభుత్వ లక్ష్యాలను సాధించే దిశగా నగర పోలీస్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ ఆదేశాల మేరకు విశాఖపట్నం స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో పోలీసులు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లపై ఉక్కు పాదం మోపుతున్నారు. యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తెలిపారు. తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని విద్యార్థులకు మరియు విశాఖ ప్రజలకు శ్రీనివాస్ సూచించారు. డ్రగ్స్, గంజాయి కి సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్ 14500 కు కాల్ చేయాలని తెలియజేశారు. ఫోన్ చేసిన వారి వివరాలు పూర్తి గోప్యంగా ఉంచుతామని శ్రీనివాసరావు తెలిపారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ganja smuggling, Local News, Visakhapatnam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు