Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM TOURIST SERVICE WILL BE STOP TO HOPE ISLAND IN KAKINADA DUE TO THESE REASONS FULL DETAILS HERE PRN VSP

Kakinada Hope Island: హోప్ ఐలాండ్ కథ ముగిసినట్లేనా..? అందమైన ద్వీపం ఇక అందదా..?

హోప్ ఐలాండ్ (ఫైల్)

హోప్ ఐలాండ్ (ఫైల్)

చుట్టూ సముద్రం... మధ్యలో దీవి.. అందులో ముచ్చటగొలిపే ఇసుక దిబ్బలు.. అక్కడే ఓ మంచినీటి బావి.. వేలల్లో జనాభా.. చూస్తే ఏదో విదేశీ ద్వీపకల్పం తరహాలో అద్భుత అందాలు. ఇవన్నీ కాకినాడ (Kakinada) హోప్‌ ఐలాండ్‌ (Hope Island) సొంతం. నగరానికి రక్షణ కవచంలా ఉన్న దీన్ని చూసేందుకు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)తో పాటు ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు పోటెత్తుతారు.

ఇంకా చదవండి ...
    P. Anand Mohan, Visakhapatnam, News18

    చుట్టూ సముద్రం... మధ్యలో దీవి.. అందులో ముచ్చటగొలిపే ఇసుక దిబ్బలు.. అక్కడే ఓ మంచినీటి బావి.. వేలల్లో జనాభా.. చూస్తే ఏదో విదేశీ ద్వీపకల్పం తరహాలో అద్భుత అందాలు. ఇవన్నీ కాకినాడ (Kakinada) హోప్‌ ఐలాండ్‌ (Hope Island) సొంతం. నగరానికి రక్షణ కవచంలా ఉన్న దీన్ని చూసేందుకు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తో పాటు ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు పోటెత్తుతారు. సముద్రం మధ్యలో ద్వీపకల్పం తరహాలో ఉండే ఈ హోప్‌ ఐలాండ్‌ లాంటిది రాష్ట్రంలో ఎక్కడా లేదు. దీంతో ఈ ప్రాంతాన్ని సందర్శించాలనుకునే వాళ్లు వేలల్లోనే ఉంటారు. కానీ.. ఇప్పుడు ఇదే హోప్ ఐలాండ్ సందర్శన ఇక కష్టమే. భవిష్యత్తులో ఇక్కడ పర్యాటకం జరగబోదని తెలుస్తోంది. హోప్ ఐలాండ్ చాలా అందమైన పర్యాటక ప్రదేశం. ఈ పర్యాటక యాత్రపై ఇకపై ఆశలు వదులుకోవాల్సిందే.

    ఇప్పట్లో హోప్‌ ఐలాండ్‌కు బోట్లు తిరిగే పరిస్థితి కనుచూపుమేరలో కనిపించడం లేదు. ఉన్న ఒక్కగానొక్క బోటు సముద్రంలో ప్రయాణించడానికి అసలే మాత్రం పనికి రాదని తాజాగా పోర్టు అధికారులు తేల్చేశారు. చేసేదిలేక ఈ బోటును పర్యాటకశాఖ గోదావరికి తరలించేసింది. సవరించిన కొత్త నిబంధనల ప్రకారం ఆధునిక ప్రమాణాలతో కొత్త బోటు కొంటే తప్ప హోప్‌ఐలాండ్‌ కు పర్యాటక బోటు నడిచే పరిస్థితి లేదు. నిధులలేమితో సతమతమవుతున్న పర్యాటకశాఖకు కొత్త బోటు కొనుగోలుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం అనుమానమే. 2019 సెప్టెంబరులో కచ్చులూరు బోటు ప్రమాదం తర్వాత కాకినాడ నుంచి హోప్‌ ఐలాండ్‌కు ప్రభుత్వం పర్యాటక బోట్లు నిలిపివేసింది.

    ఇది చదవండి: ఏపీలో కొవిడ్ ఆంక్షలు మరింత కఠినం.. ప్రభుత్వం కీలక ఆదేశాలు..


    గతంలో కాకినాడ హార్బర్‌ నుంచి హోప్‌ ఐలాండ్‌కు పర్యాటకశాఖ బోట్లు నడిపేది. రూ.200 టిక్కెట్‌ తో ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరే ఈ బోటు గంటన్నర వ్యవధిలో అక్కడకు వెళ్లి తిరిగి సాయంత్రానికి హార్బర్‌కు చేరుకునేది. మధ్యలో కాకినాడ పోర్టు, విదేశీ నౌకలు, కోరంగి అభయారణ్యం మీదుగా యాత్ర సాగేది. అక్కడకు చేరుకోగానే సముద్రం మధ్యలో హోప్‌ఐలాండ్‌ కనిపిస్తుంది. చిన్నపాటి కెరటాలతో పర్యాటకులను ఎంత గానో ఆకట్టుకుంటుంది.

    ఇది చదవండి: పాపికొండలు టూర్ ఫ్లాప్.. ఖాళీగా దర్శనమిస్తున్న బోట్లు.. ఆ భయమే కారణమా..?


    2019 సెప్టెంబర్‌లో గోదావరిలో కచ్చులూరు వద్ద బోటు ప్రమాదం జరిగి 51 మంది చనిపోవడంతో అప్పటినుంచి హోప్‌ఐలాండ్‌కు వెళ్లే బోటును ప్రభుత్వం నిలిపివేసింది. ఆ తర్వాత ఏడాదిన్నరకు కొత్త నిబంధనలు రూపొందించింది. సముద్రం, నదిలో ప్రయాణించే బోట్లకు ఎలాంటి ప్రమాణాలు అవసరమో అందులో పేర్కొంది.

    ఇది చదవండి: ఆ గ్రామంలోని వారికి ప్రభుత్వ పథకాలు కట్.. అధికారుల ఆదేశాలు.. కారణం ఇదే..!


    అవి పాటించే బోట్లకే అనుమతులు ఇవ్వాలని పేర్కొంది. అందులోభాగంగా అప్పటివరకు హోప్‌ఐలాండ్‌ మార్గంలో తిరుగుతున్న బోటుకు తిరిగి లైసెన్సు తెచ్చేందుకు పర్యాటకశాఖ ప్రయత్నించింది. అయితే దీన్ని పరిశీలించిన కాకినాడ పోర్టు అధికారులు సముద్రంలో ప్రయాణించేందుకు ఈ బోటుకు అర్హత లేదని తాజా గా లైసెన్సు తిరస్కరించారు. మారిన నిబంధనల ప్రకారం సముద్రంలో ప్రయాణించే పర్యాటక బోటులో ఎకో సౌండర్‌ ఏర్పాటుచేయాలి. ఇది సముద్ర ప్రయాణంలో ఎప్పటికప్పుడు లోతు తెలుపుతూ అప్రమత్తం చేస్తుంది. జీపీఎస్‌, డీజీఎస్‌ తదితర పరికరా లు కూడా తప్పనిసరిగా ఉండాలి. కానీ ఈ బోటుకు అవేవీ లేదు. దీంతో లైసెన్సు రాకపోవడంతో చేసేదిలేక ఇటీవల దీన్ని పర్యాటకశాఖ గోదావరికి తరలించింది. అక్కడ వినియోగానికి సిద్ధం చేస్తోంది.

    ఇది చదవండి: కేంద్రాన్ని ఇరుకునపెట్టే పనిలో జగన్.. ఇకపై ఆ నినాదంతో ముందుకు.. అండగా థర్డ్ ఫ్రంట్..?


    హోప్‌ఐలాండ్‌ కు పర్యాటకులను తీసుకువెళ్లేందుకు ఆ శాఖకు బోటులేని పరిస్థితి. తాజా ప్రమాణాల ప్రకారం లైసెన్సు పొందాలంటే కొత్త బోటు కొనాల్సిందే. ఇందుకు కోట్లలో ఖర్చవుతుందని అంచనా. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో కొత్త బోటుకు ప్రభుత్వం నిధులిచ్చేలా లేదు. అప్పు తెచ్చి కొనుగోలు చేయాలని పర్యాటకశాఖ భావిస్తున్నా అనుమతి ఇచ్చేలా కనిపించడం లేదు. ఫలితంగా హోప్‌ఐలాండ్‌ పర్యాటక యాత్ర ఇప్పట్లో ప్రారంభం అయ్యేలా కనిపించడం లేదు.

    ఇది చదవండి: సైబర్ క్రైమ్ లో ట్రైనింగ్.. ప్రాక్టికల్స్ పేరుతో జనానికి టోకరా.. వీళ్లది మామూలు బుర్రకాదు..!


    మరోపక్క ఈ రూట్లో ప్రైవేటు బోట్లకు మొదటి నుంచీ అనుమతులు ఇవ్వడం లేదు. దీంతో పర్యాటక బోటు వస్తే తప్ప హోప్‌ఐలాండ్‌ యాత్ర మొదలవడం కష్టం. కాగా పెరిగిన పర్యాటకుల రద్దీ మేరకు 2017లో స్వదేశీ దర్శన్‌ పథకం కింద కేంద్రం రూ.67 కోట్లతో హోప్‌ఐలాండ్‌, కోరంగి, కాకినాడ బీచ్‌, కోనసీమలో పలుప్రాంతాలను అభివృద్ధి చేసింది. ఐలాండ్‌లో విశ్రాంతి గదులు, లైటింగ్‌, జెట్టీల మరమ్మతు చేసింది. తీరా యాత్ర ప్రారంభమయ్యే కనిపించకపోవడంతో ఆ ఖర్చంతా వృథా అయినట్టే.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, East Godavari Dist, Kakinada

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు