Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM TOOLLYWOOD STAR NANDAMURI BALAKRISHNA ONCE AGAIN PROVED HIS SENTIMENT ON SIMHACHALAM VARAHA LAXMINARASIMHA SWAMY FULL DETAILS HERE PRN VSP

Nandamuri Balakrishna: బాలకృష్ణ-నరసింహస్వామి.. సెంటిమెంట్ మొదలైంది ఇక్కడే..! అందుకే అంత భక్తి..

Photo/ Twitter

Photo/ Twitter

సినీ హీరో బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ (Nandamuri Bala Krishna).. NBK అంటూ పరిచయవాక్యాలు అక్కర్లేని పేరు. ఆయన తర్వత సినిమా పై అందరిలోనూ మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఆయనకు ఉన్న సెంటిమెంట్ సంగతి చెప్పడానికే ఇక్కడ ప్రయత్నం. ఆయనకు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నృసింహస్వామి అంటే ఎంతో భక్తి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India
    P Anand Mohan, News18, Visakhapatnam

    సినీ హీరో బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ (Nandamuri Bala Krishna).. NBK అంటూ పరిచయవాక్యాలు అక్కర్లేని పేరు. ఆయన తర్వత సినిమా పై అందరిలోనూ మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఆయనకు ఉన్న సెంటిమెంట్ సంగతి చెప్పడానికే ఇక్కడ ప్రయత్నం. ఆయనకు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నృసింహస్వామి అంటే ఎంతో భక్తి. అలాగే ఆయనంటే బాగా సెంటిమెంట్, నమ్మకం కూడా. అందుకే ఆయన సినిమాలన్నీ కూడా ఆ సింహాచలేశుని పేరుతోనే వస్తుంటాయి. సింహభాగం బాలకృష్ణ సినిమాకు ఆ పేర్లే ఉండటానికి కారణం ఇదేనంటారు ఇక్కడి భక్తులు. విశాఖకి ఆయన వస్తే కచ్చితంగా సింహాచలం అప్పన్నని దర్శించుకుంటారని అంటున్నారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైన సింహాద్రి అప్పన్న కోరిన కోర్కెటు తీర్చే బంగారు స్వామిగా నమ్మిక. శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామిగా సింహాచలంలో కొలువుదీరిన సింహాచలేశుడు ఆ స్వామి.

    బాలకృష్ణ సినిమా అంటే ముందుగా గుర్తొచ్చేది టైటిల్లో సింహ ఉంటుంది. అందుకే ఆయన సినిమాలోని అన్ని కూడా లక్ష్మీనరసింహ, సింహా సమరసింహారెడ్డి, బొబ్బిలి సింహం, సీమ సింహం టైటిల్ ఉండేలాగా బాలకృష్ణ సినిమాలను ప్లాన్ చేసి చూస్తారు. అంతేకాకుండా ప్రతి సినిమా రిలీజ్ కి ముందు స్కిప్ట్ గాని డైరెక్టర్ గాని నిర్మాతలు గాని సింహాద్రి అప్పన్న దర్శనం చేసుకుంటారు. లేకపోతే ఒక చిన్న సీనైనా సింహాద్రి అప్పన్న సన్నిధిలో జరగవలసిందే. ఆయనకి శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారంటే అంత నమ్మకం. ఈ నమ్మకం ఇప్పటిది కాదంటారు ఇక్కడి అర్చకులు.

    ఇది చదవండి: 40 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ మాట.. ఇప్పుడు బాబు నోట.. మారిన టీడీపీ వ్యూహం.. ఇకపై వారికే పెద్దపీట


    ఈ నమ్మకం ఆదిత్య 369 సినిమా నుంచే ఉందట. ఆ పేరు సింహాద్రి అప్పన్న సన్నిదైన ప్రహ్లాదపురం వద్దే తీసుకున్నారు. ఇక్కడి ఓ ప్రముఖ సంఖ్యా శాస్త్రం జ్యోతిష్యుడు ఆ సినిమాకి టైటిల్ ఇవ్వడం, ఆ సినిమా హిట్ అయ్యి బాలకృష్ణ కెరీర్లోనే ఆణిముత్యంగా నిలవడం అందరికీ తెలిసిందే. అప్పటినుండి ఇప్పటివరకు సింహాద్రి అప్పన్న అంటే ఎంతో నమ్మకమట బాలయ్యకి. సమరసింహారెడ్డి సినిమా ముహూర్త సన్నివేశం కూడా సింహాద్రి అప్పన్న సన్నిధిలోనే జరిగింది. లక్ష్మీనరసింహస్వామి ఉగ్రరూప అవతారం. ఆయన్ని వేడుకుంటే ఎంతో కరుణ చూపిస్తారని బాలయ్య నమ్మకమట. అందుకే ఆయన తన సినిమాల్లో కచ్చితంగా సింహాచలం ఉండేలా డైరక్టర్లకి, నిర్మాతలకు చెబుతారట.

    ఇది చదవండి: తిరుమలలో అనూహ్య రద్దీ.. టీటీడీ కీలక నిర్ణయం.. భక్తులకు అలర్ట్..


    ఇక బాలయ్యతో సినిమా చేసే ప్రతి డైరెక్టర్ కూడా సినిమా హిట్ అయిన తర్వాత స్వామివారిని దర్శించుకుంటారు. మరికొంత డైరెక్టర్లు మాత్రం బాలకృష్ణ సంబంధించి సినిమా స్క్రిప్టులు తయారు చేసుకునికి ఇక్కడికి వస్తారు. కొంతమంది స్వామివారి పాదాలు వద్ద సినిమా స్క్రిప్టు కూడా పెట్టి సినిమా ప్రారంభిస్తారు. బాలకృష్ణ సినిమాకి నరసింహస్వామి ప్రతి సినిమాలో కనపడతారనేది ఎంత నిజమో ఆయనకు స్వామి అనుగ్రహం ఉందనేది అంతే నిజమని అంటారు ఇక్కడి అర్చకులు. ఇక సినిమా హిట్ అయిన తర్వాత స్వామివారిని బాలకృష్ణ దర్శించుకుంటారు.



    కొద్దిరోజుల క్రితమే సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనరసింహ స్వామిని యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శించుకున్నారు. ఆయన నెక్ట్స్ ప్రాజెక్టు బాలకృష్ణతో అన్నది సినీ ప్రియులకు, బాలయ్య అభిమానులకు తెలిసిందే. ఆలయ అధికారులు వేదమంత్రాలతో అనీల్ రావిపూడికి ఘన స్వాగతం పలికారు. స్వామి దర్శనం అనంతరం కప్పస్తంభాన్ని ఆలింగనం చేయించారు. నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రం స్క్రిప్ట్ స్వామివారి పాదాల చెంత పెట్టి, ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు. సినిమా హిట్ కావాలని అనీల్ రావిపూడి దేవదేవుడ్ని కోరారు. ఇలా చాలా మంది డైరెక్టర్ మరి కొంతమంది స్వామివారి సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు. ప్రత్యేకించి పెద్దపెద్ద సినిమా లెజెండ్ సింహం స్వామివారి అవతారం కనబడుతుంది. అందుకే డైరెక్టర్ స్వామి వారిని దర్శించుకొని సినిమాని ప్రారంభిస్తారు. అదీ బాలకృష్ణకి సింహాచలేశునికి ఉన్న భక్త సంబంధం.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Bala Krishna Nandamuri

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు