హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

RRR: ఆర్ఆర్ఆర్ సినిమా థియేటర్ల యజమానుల్లో భయం భయం.. ఏం చేశారో తెలుసా..?

RRR: ఆర్ఆర్ఆర్ సినిమా థియేటర్ల యజమానుల్లో భయం భయం.. ఏం చేశారో తెలుసా..?

ఆర్ఆర్ఆర్ థియేటర్ల యజమానుల్లో భయం భయం

ఆర్ఆర్ఆర్ థియేటర్ల యజమానుల్లో భయం భయం

RRR Movie: ప్రపంచ వ్యాప్తంగా అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్.. రేపు గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. అయితే సినిమా రిలీజ్ అవుతున్న థియేటర్ల యజమానుల్లో భయం మెదలైంది. దీంతో స్క్రీన్లకు కంచె వేశారు.. ఎందుకో తెలుసా..?

RRR Movie: వరల్డ్ వైడ్ గా సినీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ (RRR Movie) విడుదలకు సిద్ధమైంది. శుక్రవారం రిలీజ్ కాబోతున్న మూవీ కోసం ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తున్నారు. ఇటు జూనియర్ ఎన్టీఆర్ (JR NTR).. అటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) అభిమానులతో పాటు.. ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) అభిమానులు.. తెలుగు సినిమా అభిమానులు.. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఫ్యాన్స్ హంగామా ఎలా ఉన్నా... థియేటర్ల యజమానులను మాత్రం ఓ భయం వెంటాడుతోంది.  శ్రీకాకుళం (Srikakulam)తో పాటు పలు  జిల్లాలోని థియేటర్లకు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా భయం పట్టుకుంది. అభిమానులను అదుపు చేసేందుకు యాజమాన్యాలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాయి. ప్రమాదకరమైన ఇనుప కంచెలు ఏర్పాటు చేసి ప్రేక్షకులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి.

శ్రీకాకుళంలోని సూర్యమహల్‌ థియేటర్‌లో తెర ముందు ఇనుప కంచెను ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది.  క్లాస్‌ టిక్కెట్ల సీట్లు ఉండే చోట ఇనుప కంచె ఏర్పాటు చేయడంతో ప్రమాదాలకు ఆస్కారం ఉందని మెగా , నందమూరి అభిమాన సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఇదేం పద్ధతి అని నిలదీస్తున్నారు. సినిమా చూసేందుకు వచ్చే అభిమానులకు ఏదైనా అయితే ఎవరిది బాధ్యత అని ప్రశ్నిస్తున్నారు.

ఇదీ చదవండి : సంతానం లేక ఇబ్బంది పడుతున్నారా..? ఆర్థిక సమస్యలు వేదిస్తున్నాయా? వారి కాలి స్పర్శ తగిలితే చాలా.. కోరికలు నెరవేరినట్టేనా..!

ధియేటర్ల యాజమాన్యాల వెర్షన్ వేరేగా ఉంది.  ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల సందర్బంగా అభిమానులు ఎలాంటి రచ్చ చేస్తారేమోనన్న భయం తమది అంటున్నారు.  అభిమానులను అదుపు చేసేందుకు యాజమాన్యాలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాయి. స్క్రీన్ కు ముందు ఉండే భాగంలో ఇనుప కంచెలు బిగించడం, మేకులు కొట్టడం వంటి ఏర్పాట్లు చేస్తున్నాయి.

ఇదీ చదవండి : : ఆ జపం చేయనిదే.. వారికి నిద్ర పట్టదు.. వైసీపీ తిట్ల దండకంపై నారా లోకేష్ కౌంటర్..

గతంలో అఖండ, రాధేశ్యామ్ సినిమాల విడుదల సమయంలో కొన్ని ధియేటర్లలో అభిమానులు చేసిన అత్యుత్సాహంతో హంగామా చేస్తూ ధియేటర్లలోని స్క్రీన్లను చించేసారు. కొన్ని చోట్ల ధియేటర్లలోని స్క్రీన్ లపై తమ అభిమాన హీరోలపై అభిమానంతో, ఆనందంతో పాలు పోయడం , డాన్సులు చేయడం, సీట్లు విరగ్గొట్టడం, హారతులు ఇవ్వడం లాంటి పనులు చేయడంతో పెద్ద ఎత్తున ధియేటర్ల యజమాన్యాలకు నష్టం కలిగింది.

ఇదీ చదవండి : కసరత్తు పూర్తి కాకముందే ఆ జిల్లాకు బ్రేకులు.. కారణం అదే..?

ఆ అనుభవాల కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని ఓ ధియేటర్ లో రాధేశ్యామ్ ఓపెనింగ్ రోజున స్క్రీన్ చించేయడంతో సినిమా షోను 15 నిమిషాలు నిలిపివేసారు. దీంతో అభిమానుల ఆవేశం కట్టలు తెంచుకొని ధియేటర్ లోని సీట్లను విరగ్గొట్టారు. దీంతో ధియేటర్ యజమానికి భారీగా నష్టం వాటిల్లింది. ఆ ప్రభావం ఆర్ఆర్ఆర్ విడుదలపై పడింది.  అందుకే థియేటర్ల యజమానులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఇదీ చదవండి : డిప్యూటీ సీఎంకు మద్యంతో అభిషేకం.. టీడీపీ నేతలు ఏమన్నారంటే..?

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని సూర్యమహల్ లో అభిమానులను అదుపు చేసేందుకు ధియేటర్ యాజమాన్యం ఇలాంటి ముందస్తు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. థియేటర్‌ లోని తెర ముందు ఇనుప కంచెను ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. ధియేటర్ లోని స్క్రీన్ కు ముందు భాగంపై అభిమానులు హంగామా ఎక్కకుండా,  స్క్రీన్ దగ్గరగా వెళ్లకుండా ఉండేందుకు ప్రమాదకరమైన ఇనుప కంచెలు ఏర్పాటు చేసారు. ఇలాంటి ఏర్పాట్లు చేయడం ద్వారా అభిమానులను కట్టడి చేయవచ్చని ధియేటర్ యజమానులు భావించారు.


ఇదీ చదవండి : కేంద్రంపై వైసీపీ-టీడీపీ ఉమ్మడి పోరాటం.. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం మొండి వైఖరిపై నిరసన

ఈ విషయంపై శ్రీకాకుళంలోని స్థానిక డీఎస్పీ ఎం.మహేంద్ర దృష్టికి అఖిల భారత చిరంజీవి, రాంచరణ్, జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమాన సంఘం నాయకులు తీసుకెళ్లారు. దీంతో డీఎస్సీ ఆదేశాల మేరకు సీఐ అంబేడ్కర్‌ చర్యలకు ఉపక్రమించారు. సినిమా విడుదల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా అభిమాన సంఘ నాయకులు చొరవ తీసుకోవాలని ప్రతినిధులకు సీఐ సూచించారు. పిచ్చి అభిమానంతో సిల్వర్ స్క్రీన్ ల వద్దకు వెళ్లకుండా, ధియేటర్లకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలలని ధియేటర్ల యాజమాన్యాలు పోలీసులను కోరుతున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Jr ntr, Ram Charan, RRR, SS Rajamouli, Visakhapatnam

ఉత్తమ కథలు