G20 Summit 2023: సువిశాల సాగర తీరం.. స్మార్ట్ సిటీ విశాఖ (Visakha) అంతర్జాతీయ నగరంగా మారుతోంది. అందుకే వరుసగా అంతర్జాతీయ ఈవెంట్లక వేదిక అవుతోంది. ఇప్పుడు భారదదేశం లీడ్ చేస్తున్న జీ20 దేశాల సదస్సుకు (G20 Summit) విశాఖ నగరం వేదిక అవుతోంది. అయితే ఈ సమ్మిట్ ఒక్కొక్క ఏడాది ఒక్కో దేశం ఏడాది పాటు జీ20 సదస్సును నిర్వహించడమే కాకుండా.. పూర్తి అధ్యక్ష బాధ్యతలు చేపట్టనుంది. ఈ ఏడాది 2023 జీ20 సదస్సు సారధ్య బాధ్యతలు ఇండియాకు దక్కాయి. అయితే జీ20 ప్రధాన సదస్సు సెప్టెంబర్ నెలలో ఢిల్లీ (Delhi) వేదికగా జరగనుంది. అంతకుముందు సన్నాహకాల్లో భాగంగా 50 ప్రధాన నగరాల్లో సన్నాహక సమావేశాలు జరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికే జీ20 సన్నాహక సదస్సులు బెంగళూరు, చండీగడ్, చెన్నై, గువహతి, ఇండోర్, జోథ్‌పూర్, ఖజురహో, కోల్‌కతా, లక్నో, ముంబై, పూణే, రాణ్ ఆఫ్ కచ్, సూరత్, తిరువనంతపురం, ఉదయ్‌పూర్‌లో జరిగాయి. ఇవాళ విశాఖపట్నం (Visakhapatnam)లో జీ20 సదస్సు జరగనుంది.
ఈ జీ20 సదస్సులను దేశంలోని వివిధ నగరాల్లో నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖపట్నంలో మార్చ్ 28న జీ20 సదస్సుకు ఏపీ ప్రభుత్వం ఆతిద్యమిస్తోంది. జీ 20 దేశాల సదస్సుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. జీ20 సదస్సుకు 2500 మంది పోలీసుల్ని మొహరించారు. ఇందులో 1850 మంది సివిల్ పోలీసులు, 400 మంది ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసులు, 4 గ్రే హౌండ్స్ దళాలు, 2 క్యూఆర్టీ టీమ్స్, 6 ప్రత్యేక పార్టీలు, 2 ఏపీఎస్పీ ప్లాటూన్లు ఉన్నాయి. ఈ జీ20 సదస్సు నేపధ్యంలో విశాఖపట్నం నగరంతో పాటు చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాల్ని సుందరంగా అలంకరించారు. నగరమంతా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అయితే రాష్ట్రంలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు స్థానికులను అనుమించడం లేదు. కేవలం జీ 20 సదస్సు కోసం వచ్చే అతిథులను మాత్రేమే అనుమతిస్తారు.
జీ20 అంటే ఏమిటి
జీ20కి ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ అని అర్ధం. ఇందులో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా , సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, యూకే, యూఎస్ఏ దేశాలున్నాయి. అంటే ప్రపంచ జీడీపీలో 85 శాతం జీ20 దేశాలే కలిగి ఉన్నాయి. ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం జీ20 దేశాలదే కావడం దీనికి కారణం. 1990 దశకంలో వివిధ దేశాల్లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభాలు, ప్రపంచ ఆర్ధిక వ్యవహారాల్లో కొన్ని దేశాలకు తగినంతగా గుర్తింపు లేకపోవడంతో జీ20 ఏర్పాడింది.
ఇదీ చదవండి : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు? సీఎం జగన్ ముందు ఆప్షన్లు ఇవే..?
ఇండియాకు 2023 జీ20 అధ్యక్ష బాధ్యతలు
జీ20 సదస్సులు 2008 నుంచి వరుసగా జరుగుతున్నాయి. మొట్టమొదటి జీ20 సదస్సును యూఎస్ఏ చేపట్టగా రెండవ సదస్సును యూకే నిర్వహించింది. 2022లో జీ20 సదస్సును ఇండోనేషియా లీడ్ చేసింది. 2023లో అంటే ఈ ఏడాది ఇండియా అధ్యక్షత వహిస్తోంది. వచ్చే ఏడాది 2024లో బ్రెజిల్ జీ20 అధ్యక్షత వహించనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, G20 Summit, Visakhapatnam