• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • VISAKHAPATNAM TIRUPATHI KAKINADA GOT NATIONAL RANKS IN EASE OF LIVING INDEX LIST ACROSS INDIA HERE ARE THE DETAILS PRN

Andhra Pradesh: ఇండియా టాప్ సిటీల్లో ఏపీకి స్థానం.. ఆ మూడు నగరాలకే పట్టం

Andhra Pradesh: ఇండియా టాప్ సిటీల్లో ఏపీకి స్థానం.. ఆ మూడు నగరాలకే పట్టం

ప్రతీకాత్మక చిత్రం

కేంద్ర ప్రభుత్వం.. దేశంలోనే అత్యుత్తమ మున్సిపాలిటీల జాబితాను రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న నగరాలు, మున్సిపాలిటీలఖు ర్యాంకులు కేటాయించింది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల సీజన్ నడుస్తోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికల్లో అన్ని పార్టీలు అభివృద్ధే ప్రధాన అజెండాగా ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికలు జరుగుతున్న నగరాలు, పట్టణాలను తామంటే తాము అభివృద్ధి చేశామంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం.. దేశంలోనే అత్యుత్తమ మున్సిపాలిటీల జాబితాను రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న నగరాలు, మున్సిపాలిటీలను పరిశీలించి అక్కడ జరిగిన అభివృద్ధి, ప్రజలు నివాసముండటానికి అనుకూలించే పరిస్థితులను అధ్యయనం చేసి ర్యాంకులిచ్చింది. ఈ లిస్టులో ఏపీకి చెందిన మూడు నగరాలుండగా.. తెలంగాణకు అసలు స్థానం దక్కలేదు. టాప్ టెన్ లో మూడు నగరాలు చోటు దక్కించుకోవడం ఏపీ వాసులకు శుభవార్తే. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరి ఈ జాబితాను విడుదల చేశారు.

    ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్, మున్సిపల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ పేరుతో సర్వే నిర్వహించిన కేంద్రం రెండు వేర్వేరు జాబితాలను విడుదల చేశింది. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అంటే.. నివాసానికి అనుకూలంగా ఉండే నగరాలపై సర్వే సర్వే నిర్వహించిన కేంద్రం.. వాటిని రెడు విభాగాలుగా విభజించింది. 10 లక్షల జనాభా కంటే ఎక్కువ ఉన్న నగరాలు, 10 లక్షలకంటే తక్కువ జనభా కలిసిన నగరాలుగా విభజించారు. రెండు కేటగిరీల నగరాల్లో నివాస యోగ్యమైన పరిస్థితులు, మౌలిక వసతులు, పరిశుభ్రత లాంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. మొదటి కేటగిరీలో రాష్ట్రంలో ఒక్కనగరానికి కూడా చోటు దక్కలేదు. రెండో కేటగిరీలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు దేశంలోనే నాలుగో ర్యాంక్ దక్కింది.

    ఇది చదవండి: టీడీపీ విజయవాడ మేయర్ అభ్యర్థి ఖరారు... పంతం నెగ్గించుకున్న ఎంపీ



    ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌లో 10 లక్షల కంటే ఎక్కువ ఉన్న జనాభా ఉన్న సిటీల్లో బెంగళూరుకు టాప్ ప్లేస్ దక్కింది. ఈ లిస్టులో బెంగళూరుకు 66.70 పాయింట్లు దక్కగా.. రెండో స్థానంలో ఉన్న పుణే 66.27 పాయింట్లు సాధించింది. అహ్మదాబాద్-64.87, చెన్నై-62.61, సూరత్-61.73, నవీ ముంబై-61.60, కోయంబత్తూరు-59.72, వడోదర-59.24, ఇండోర్-58.58, గ్రేటర్ ముంబై-58.23 పాయింట్లతో టాప్‌-10లో చోటు సంపాదించాయి.

    ఇది చదవండి: మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయపరిమితి ఎంతో తెలుసా...?



    10 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న జాబితాలో ఏపీ నుంచి కాకినాడకు నాలుగో ర్యాంక్ దక్కింది. కాకినాడకు మొత్తం 56.84 పాయింట్లు వచ్చాయి. ఈ జాబితాలో ఫస్ట్ ప్లేస్ సాధించిన సిమ్లాకు 60.90, రెండో స్థానంలో ఉన్న భువనేశ్వర్ కు 59.85 పాయింట్లు లభించాయి. సిల్వాస-58.43, సేలం-56.40, వేలూరు-56.38, గాంధీనగర్-56.25, గురుగ్రామ్-56.00, దావణగెరె-55.25 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

    ఇక మున్సిపల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్‌లో విశాఖ, తిరుపతి నగరాలు టాప్-10లో చోటు దక్కించుకున్నాయి. 10 లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల జాబితాలో వైజాగ్ తొమ్మిదో స్థానాన్ని దక్కించుకుంది. విశాఖకు 52.77 పాయింట్లు రాగా.. ఈ లిస్ట్‌లో టాప్ ప్లేస్ లో ఉన్న ఇండోర్ నగరానికి 66.08 పాయింట్లు వచ్చాయి. సూరత్-60.82, భోపాల్-59.04, పింప్రి ఛించ్వాడ్-59.00, పుణే-58.79, అహ్మదాబాద్-57.60, రాయ్‌పూర్-54.98, గ్రేటర్ ముంబై-54.36, వడోదర-52.68 టాప్-10లో ఉన్నాయి. ఇక 10 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న అత్యుత్తమ మున్సిపాలిటీల జాబితాలో ఆధ్యాత్మిక నగరం తిరుపతికి రెండో స్థానం లభించింది. తిరుపతికి 51.69 పాయింట్లు వచ్చాయి. న్యూఢిల్లీ-52.92, గాంధీనగర్-51.59, కర్నాల్-51.39, సేలం-49.04, తిరుప్పూర్-48.92, బిలాస్‌పూర్-47.99, ఉదయ్‌పూర్-47.77, ఝాన్సీ-47.04, తిరునెల్వేలి-47.02 పాయింట్లు దక్కాయి.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు