హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

TikTok Bhargav : మళ్లీ కటకటాల్లోకి ఫన్ బకెట్ భార్గవ్ -బెయిలొచ్చినా వీడు మారలే - ఏసీపీ ప్రేమ్ కాజల్

TikTok Bhargav : మళ్లీ కటకటాల్లోకి ఫన్ బకెట్ భార్గవ్ -బెయిలొచ్చినా వీడు మారలే - ఏసీపీ ప్రేమ్ కాజల్

టిక్ టాక్ భార్గవ్, ఏసీపీ ప్రేమ్ కాజల్

టిక్ టాక్ భార్గవ్, ఏసీపీ ప్రేమ్ కాజల్

ఫన్నీ వీడియోలతో టిక్ టాక్ స్టార్ గా ఎదిగిన ఫన్ బకెట్ భార్గవ్ ను విశాఖపట్నం దిశ పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. చెల్లి అని పిస్తూనే మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో అరెస్టయిన భార్గవ్.. ఇటీవల బెయిల్ పై బయటికొచ్చి బాధితురాలిని, సాక్ష్యులను బెదిరించడంతో దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ చర్యలకు దిగారు..

ఇంకా చదవండి ...

ఫన్నీ వీడియోలతో టిక్ టాక్ స్టార్ గా ఎదిగి, 'ఫన్ బకెట్'నే తన ఇంటిపేరుగా మార్చుకుని, సినీరంగంలోనూ ప్రయత్నాలు చేస్తోన్న చిప్పాడ భార్గవ్ అలియాస్ టిక్ టాక్ ఫన్ బకెట్ భార్గవ్ కీచక వ్యవహారాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఫన్ వీడియోలలో చోటు కల్పిస్తానని, టీవీషోలు, సినిమాల్లోనూ అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి, చెల్లి అని పిలుస్తూనే ఓ మైనర్ బాలికను శారీరకంగా లోబర్చుకుని, ఆమెపై అత్యాచారానికి పాల్పడి, గర్భవతిని కూడా చేసి కేసులపాలైన భార్గవ్ తన తీరును ఏమాత్రం మార్చుకోకపోవడంతో విశాఖపట్నం దిశ పోలీసులు మరోసారి లాఠీ ఝుళిపించారు. బాలికపై అత్యాచారం కేసులో బెయిల్ పై బయటికొచ్చిన భార్గవ్.. బాదితులను, సాక్ష్యులను బెదిరించేలా చర్యలకు దిగడంతో పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. విశాఖ సిటీ దిశ పోలీస్ స్టేషన్ ఏసీపీ ప్రేమ్ కాజల్ చెప్పిన వివరాలివి..

చిప్పాడ భార్గవ్ అలియాస్ టిక్ టాక్ భార్గవ్.. ఫన్నీ వీడియోల్లో అవకాశం కల్పిస్తానంటూ మైనర్ బాలికను అత్యాచారం చేసిన వ్యవహారం వెలుగులోకి రావడంతో ఈ ఏడాది ఏప్రిల్ లో అరెస్టయ్యాడు. మైనర్ బాలిక రేప్ ఉదంతం తర్వాత భార్గవ్ చేతులో వేధింపులు ఎదుర్కొన్న చాలా మంది అమ్మాయిలు మీడియా ముందుకొచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కీచక భార్గవ్ కు శిక్షపడేలా పోలీసులు ప్రయత్నిస్తుండగానే, అతనికి కోర్టులో బెయిల్ మంజూరైంది. కొద్ది రోజుల కిందట బెయిల్ పై విడుదలైన భార్గవ్ మరోసారి తన ప్రతాపం చూపించుకునే ప్రయత్నంచేశాడు..

బెయిల్ పై విడుదలైన భార్గవ్ మళ్లీ రెచ్చిపోతూ, తన సోషల్ మీడియా ఖాతాల్లో అనూహ్య పోస్టులు పెట్టాడు. రేప్ కేసు సహా తనపై వేధింపుల ఆరోపణలుచేసిన బాధిత అమ్మాయిలను, వారి కుటుంబీకులను ఉద్దేశించి భార్గవ్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. భార్గవ్ చర్యలు బాధితులను, సాక్ష్యులను బెదిరించేలా ఉన్నాయని ఫిర్యాదులు రావడంతో దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ మళ్లీ రంగంలోకి దిగారు.

బెయిల్ నిబంధనలకు విరుద్దంగా సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, బెదిరింపులకు దిగన భార్గవ్ ను మళ్లీ అరెస్టు చేసిన దిశ పోలీసులు.. అతణ్ని శుక్రవారం పోక్సో కోర్టులో ప్రవేశపెట్టారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన జడ్జి.. భార్గవ్ బెయిల్ ను రద్దు చేశారు. అంతేకాదు, నిందితుడికి ఈనెల 11 వరకు రిమాండ్ విధించారు. ఆ వెంటనే కేజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించి, భార్గవ్ ను వైజాగ్ సెంట్రల్ జైలుకు తరలించినట్లు దిశ పోలీస్‌స్టేషన్‌ ఏసీపీ ప్రేమ్‌కాజల్‌ వెల్లడించారు. పోక్సోగానీ మరే ఇతర కేసుల్లోగానీ బెయిల్ పై విడుదలైన నిందితులు.. బాధితురాళ్లను బెదిరించేలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని కాజల్ హెచ్చరించారు.

First published:

Tags: AP News, Disha police station, Fun bucket bhargav, Vishakaptnam

ఉత్తమ కథలు